iDreamPost

అయోధ్య రామమందిరంపై అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు!

LK Advani: ఎల్ కే అద్వానీ.. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కృషి చేసిన వారిలో ఒకరు. తాజాగా అయోధ్య రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

LK Advani: ఎల్ కే అద్వానీ.. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కృషి చేసిన వారిలో ఒకరు. తాజాగా అయోధ్య రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

అయోధ్య రామమందిరంపై అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు!

అయోధ్యను పాలించే రామయ్య తండ్రి అతి త్వరలో తన మందిరంలో కొలువు తీరనున్నాడు. జనవరి 22వ తేదీన జరగబోయే రామయ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంకు సంబంధిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొన్ని వేల యుగాల క్రితం జరిగిన రామయ్య పట్టాభిషేక వైభోగం.. మరలా ఇప్పుడు కనిపించనుంది. రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ఆ మహత్తర సన్నివేశాన్ని ఎపుడెపుడు కళ్లారా చూస్తామా అని.. కొన్ని కోట్ల మంది భారతీయులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ బృహత్తర కార్యక్రమానికి పునాది వేసిన వ్యక్తి మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ. తాజాగా ఆయన  అయోధ్య రామ మందిరంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ట కోసం యావత్ భారత్ దేశం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది. జనవరి 22న  ఈ మహోత్సవం ఘనంగా జరగనుంది. ఇప్పటికే అయోధ్య నగరం అంతా కాషాయంతో నిండిపోయింది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కోట్లాది మంది కల.. మరికొద్ది రోజుల్లో సాకారం కానుంది. అయితే ఈ  బృహత్తర కార్యం అంత ఈజీగా పూర్తిగా కాలేదు.  అయోధ్యలో రామయ్యను కొలువు తీర్చేందుకు ఎంతో మంది పోరాటాలు చేశారు. అంతేకాక ఏళ్ల తరబడి రామయ్య అంశాన్ని కోర్టుల్లో విచారణ జరిపారు. చివరకు ఎట్టకేలకు అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు రూట్ క్లియర్ అయ్యింది. అయితే ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణం విషయంలో మోదీ పేరు ప్రస్తావనకు వస్తుంది.

అయితే అసలు రామయ్య మందిర నిర్మాణం కోసం పోరాడిన వ్యక్తులు ప్రధానమైన వారు మాజీ ఉప ప్రధాని.. ఎల్ కే అద్వానీ. ఆయన  రామ మందిర నిర్మాణం కోసం పోరాడుతూ.. రథయాత్రను చేపట్టిన సంగతి తెలిసింది. మాజీ ప్రధాని వాజ్ పాయి, అద్వానీ కలిసి ఈ రథయాత్రకు శ్రీకారం చుట్టారు. అయోధ్య ఉద్యమంలో ఆ యాత్ర ఎంతో కీలకమైనది. అద్వానీ లాంటి ఎందరో కన్న కలలు సాకారం కాబోతున్నాయి. అయోధ్య ఆలయ నిర్మాణం కోసం ఎంతో పోరాడిన అద్వానీ ఈ అద్భుత ఘట్టంలో పాల్గొంటారు. ఇక అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించి అద్వానీ కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో ఆలయం నిర్మాణం విధి నిర్ణయమని.. అందుకోసం శ్రీరాముడే మోదీని ఎంచుకున్నారని వ్యాఖ్యానించారు.

అయోధ్య ఉద్యమం తన రాజకీయ జీవితంలో అత్యంత నిర్ణయాత్మకమైన సంఘటన అని అద్వానీ అన్నారు. 1990లో రాముడి మీద నమ్మకంతో ప్రారంభించిన రథయాత్ర ఒక ఉద్యమంలా మారుతుందని తాము ఊహించలేదని ఆయన తెలిపారు. ఆ సమయం అనుకున్నట్లు తాను కేవలం రథసారధిని మాత్రమే అని చెప్పారు. రథయాత్రలో మోదీ కూడా తన వెంటే ఉన్నారని గుర్తుచేసుకున్నారు. అయితే ఈ వేళ మాజీ ప్రధాని అటల్ బీహర్ వాజ్ పాయి లేకపోవడం బాధ కలిగిస్తోందని అన్నారు. మోదీ ఆలయ ప్రతిష్ట చేసేటప్పుడు.. దేశంలోని ప్రతీ పౌరుడికి ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. మరి.. మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి