nagidream
BJP Breaks 24 Years CM: 2000వ సంవత్సరం నుంచి ఇప్పటివరకూ వరుసగా ఐదు సార్లు సీఎంగా గెలిచిన వ్యక్తి.. 24 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అతను. అలాంటి వ్యక్తి సీఎం పీఠాన్ని బీజేపీ కదిలించబోతుంది. 24 ఏళ్లు అప్రతిహితంగా ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తిని సీఎం కుర్చీ నుంచి తప్పించబోతుంది.
BJP Breaks 24 Years CM: 2000వ సంవత్సరం నుంచి ఇప్పటివరకూ వరుసగా ఐదు సార్లు సీఎంగా గెలిచిన వ్యక్తి.. 24 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అతను. అలాంటి వ్యక్తి సీఎం పీఠాన్ని బీజేపీ కదిలించబోతుంది. 24 ఏళ్లు అప్రతిహితంగా ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తిని సీఎం కుర్చీ నుంచి తప్పించబోతుంది.
nagidream
వరుసగా ఐదు సార్లు సీఎంగా గెలిచారు. 24 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా గెలిస్తే దేశంలోనే అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు కూడా తన ఖాతాలో పడుతుంది. కానీ అదేమీ జరక్కుండా బీజేపీ పార్టీ మొత్తం లెక్కలన్నీ మార్చేసింది. అక్కడ బీజేపీ లీడింగ్ లో ఉంది. 24 ఏళ్ల సీఎంని కాదని.. ఆ పార్టీని కాదని జనం బీజేపీకి ఓట్లు వేశారు. ఆ 24 ఏళ్ల సీఎం మరెవరో కాదు.. నవీన్ పట్నాయక్. ఈయన ఒడిశా రాష్ట్రానికి సీఎంగా పనిచేశారు. 2000వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ వరుసగా ఐదు సార్లు గెలిచి 24 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నారు. గతంలో నవీన్ పట్నాయక్ తండ్రి బిజు పట్నాయక్.. ఒడిశా స్టేట్ కి సీఎంగా పని చేశారు.
జనతా దళ్ పార్టీ తరపున ఎంపీగా ఉన్న బిజు పట్నాయక్.. 1997 ఏప్రిల్ 17న చనిపోయారు. దీంతో ఆయన కొడుకు నవీన్ పట్నాయక్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. తండ్రి మరణంతో ఖాళీ అయిన అస్కా లోక్ సభకు నిర్వహించిన ఉపఎన్నికలో ఎంపీ అభ్యర్థిగా విజయం సాధించారు నవీన్ పట్నాయక్. ఆ తర్వాత జనతా దళ్ పార్టీ విడిపోవడంతో 1998లో తన తండ్రి పేరుతో బిజు జనతా దళ్ పార్టీని స్థాపించారు. అటల్ బిహారీ వాజ్ పేయ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. 2000వ సంవత్సరంలో ఒడిశా శాసనసభ ఎన్నికల్లో బిజు జనతా దళ్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. దీంతో నవీన్ పట్నాయక్ తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. వరుసగా 5 సార్లు గెలుస్తూ వచ్చారు. 24 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వచ్చారు.
అలాంటి వ్యక్తిని సీఎం కుర్చీ నుంచి దూరం చేయబోతుంది బీజేపీ. ఒడిశా రాష్ట్రంలో మొత్తం 147 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 75 సీట్లతో మెజారిటీలో ఉంది. బిజు జనతా దళ్ పార్టీ 54 సీట్లతో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 15 సీట్లు, ఇతరులు 3 సీట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సంఖ్య ప్రకారం ఈ మూడూ కలిసినా గానీ బీజేపీని దాటడం అనేది అసాధ్యం. దీంతో 24 ఏళ్ల సీఎం పీఠాన్ని బీజేపీ కదిలించి చరిత్ర సృష్టిస్తుందని అంటున్నారు. మరోవైపు నవీన్ పట్నాయక్ ఈసారి గెలిస్తే కనుక.. మనదేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డుని సొంతం చేసుకునేవారు. ఈయన కంటే ముందే మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ 25 ఏళ్ల పాటు సీఎంగా పని చేసి రికార్డు సృష్టించారు. ఈ రికార్డుని నవీన్ పట్నాయక్ బ్రేక్ చేయాలని కలలు కన్నారు. కానీ ఆ కలలను బీజేపీ తుడిచిపెట్టేలా ఉంది.