iDreamPost
android-app
ios-app

Sabarimala: అయ్యప్ప భక్తులకు చేదు వార్త.. ప్రసాదంపై కీలక నిర్ణయం

దేశంలోనే ప్రఖ్యాతి చెందిన కేరళలోని శబరిమలై అయ్యప్ప స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర స్టేట్స్ నుండి అనేక మంది శబరిమలకు తరలివెళుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రావెన్ కోర్ కీలక నిర్ణయం తీసుకుంది.

దేశంలోనే ప్రఖ్యాతి చెందిన కేరళలోని శబరిమలై అయ్యప్ప స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర స్టేట్స్ నుండి అనేక మంది శబరిమలకు తరలివెళుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రావెన్ కోర్ కీలక నిర్ణయం తీసుకుంది.

Sabarimala: అయ్యప్ప భక్తులకు చేదు వార్త.. ప్రసాదంపై కీలక నిర్ణయం

కేరళలో కొలువైన దేవాలయాల్లో ఒకటి శబరిమల అయ్యప్ప దేవస్థానం. నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో అయ్యప్పను సందర్శించేందుకు వేలాది మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు. అయ్యప్ప దీక్షను చేపట్టి.. విరుముడి కట్టి.. ఇక్కడకు వచ్చి.. ఆ తర్వాత మాలను తీస్తుంటారు. ఇక్కడ మకర విళక్కు (మకర సంక్రాంతి) రోజున జ్యోతి రూపంలో సాక్షాత్తూ ఆ అయ్యప్పే తమకు సాక్షాత్కారమౌతాడని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అందుకే లక్షలాది మంది భక్తులు తరలి వెళుతుంటారు. హరిహరసుతుడిగా భావిస్తూ.. భక్తులు అతడికి పూజలు చేస్తారు. దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడకు వస్తుంటారు.

అయ్యప్ప దేవాలయం అనగానే.. 18 మెట్లు, మకర జ్యోతిలాగానే.. ఇక్కడ ప్రసాదం కూడా అంతే ఫేమస్.. దీన్ని అవరణ అని పిలుస్తారు. దీని టేస్టే వేరు. ఈ ప్రసాదం కోసం కూడా భక్తులు బారులు తీరుతుంటారు. ఈ ఏడాది కూడా వేలాది మంది భక్తులు శబరిమలకు తరలివెళుతున్నారు. భారీ క్యూలైన్లలో గంటలు గంటలు ఉండిపోతున్నామని ఇప్పటికే పలువురు భక్తులు వెల్లడించారు. కొంత మంది దైవ దర్శనం చేసుకోకుండా వెనుదిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి షాక్ లాంటి న్యూస్ చెప్పింది ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు. భారీగా భక్తులు తరలి వెళుతుండటంతో.. అరవణ ప్రసాదంపై పరిమితులు విధించింది బోర్డు.

ఒక్కొక్క భక్తుడికి కేవలం రెండు డబ్బాల ప్రసాదం మాత్రమే పంపిణీ చేస్తామని వెల్లడించారు బోర్డు అధికారులు. ప్రసాదం డబ్బాల కొరత, భారీగా భక్తుల రద్దీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మకర జ్యోతి దర్శనానికి మరింత మంది భక్తులు శబరిమలకు వస్తారని.. దీంతో ఆ భక్తులు అందిరికీ ప్రసాదం అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే ఈ విషయంపై భక్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తర్వలోనే అరవణ ప్రసాదం డబ్బాల సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు బోర్డు సభ్యులు. అలాగే భక్తుల కోసం జనవరి 20వ తేదీ వరకు ఆలయాన్ని తెరిచే ఉంచుతామని చెప్పారు. ఈ ప్రసాదంపై కోత పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.