P Krishna
P Krishna
ఇటీవల దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు కామాంధులు ఎవరినీ వదలడం లేదు. మహిళలు ఒంటరిగా బయట తిరగాలంటే భయంతో వణికిపోయే పరిస్థితి నెలకొంది. ఎన్ని కఠిన చట్టాలు అమల్లోకి తీసుకువస్తున్నా.. ఆడవాళ్ళు కనిపిస్తే చాలు కొంతమంది కామాంధులు మృగాళ్లా మారిపోతున్నారు. దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ తమపై లైంగి వేధింపులకు పాల్పపడుతున్నారని వందల సంఖ్యల్లో కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఓ మహిళలను వేధిస్తూ తరుచూ ఫోన్ చేసి అభ్యంగా మాట్లాడుతున్నాడన్న కారణంతో ఓ యువకుడిని కొట్టి అరగుండు గీయించి ఊరేగించారు. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
దేశంలో నిత్యం ఆడవాళ్లపై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. బీహార్‌లోని కతిహార్ జిల్లాలో ఆనంద్ అనే వ్యక్తి కబర్ లోని ఓ మిల్లులో కొంతకాలంగా పనిచేస్తున్నాడు. మిల్లు యజమాని రాజీవ్ కుమార్ కి నమ్మకస్తుడిగా పని చేస్తున్న ఆనంద్ తరుచూ వాళ్ల ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే రాజీవ్ కుమార్ భార్యతో ఆనంద్ కి మంచి పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుతూ.. ఒంటరిగా కలుసుకునే వారు. ఉన్నట్టుండి ఆనంద్ తనని వేధిస్తున్నాడని.. నిత్యం ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నాడని, ఇంటికి వచ్చి ఒంటరిగా ఉన్న తనను సతాయిస్తున్నాడని రాజీవ్ కి ఫిర్యాదు చేసింది భార్య.
ఎంతో నమ్మకంగా ఉన్నాడని ఇంటికి రానిస్తే.. ఇంత దారుణానికి పాల్పపడతాడా అని రాజీవ్ కుటుంబ సభ్యులు ఆనంద్ ని పట్టుకొని చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. అంతేకాదు అతనికి అరగుండు గీయించి, చెప్పులు, బూట్ల దండ వేసి ఊరేగించారు. ఇదిలా ఉంటే రాజీవ్ భార్య కావాలనే ఆనంద్ కి ఫోన్ చేసేదని, ఇంటికి పిలిపించుకునేదని కొంతమంది స్థానికులు అంటున్నారు. ఆనంద్ అమాయకుడు అని.. అతనిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు తాను నిర్దోషిని అని.. ఆమెతో ఎలాంటి అక్రమ సంబంధం లేదని అంటున్నాడు బాధితుడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆనంద్ ని అదుపులోకి తీసుకున్నారు. ఇరు పక్షాల వారు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో ఆనంద్ ని విడిచిపెట్టారు పోలీసులు.