iDreamPost
android-app
ios-app

ప్రైవేట్ ట్యూషన్లు చెబుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులపై కఠిన చర్యలు: విద్యాశాఖ

  • Published Jan 03, 2024 | 5:20 PM Updated Updated Jan 03, 2024 | 5:20 PM

ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితుల కారణం వలనో.. లేదా ఆర్థిక ఇబ్బందుల వలనో చాలా మంది రెండు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వీరిలో ప్రైవేట్ ఉద్యోగులు ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. కానీ, ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ఇటువంటివి చేస్తే.. కఠిన చర్యలు తప్పవని అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితుల కారణం వలనో.. లేదా ఆర్థిక ఇబ్బందుల వలనో చాలా మంది రెండు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వీరిలో ప్రైవేట్ ఉద్యోగులు ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. కానీ, ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ఇటువంటివి చేస్తే.. కఠిన చర్యలు తప్పవని అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు.

  • Published Jan 03, 2024 | 5:20 PMUpdated Jan 03, 2024 | 5:20 PM
ప్రైవేట్ ట్యూషన్లు చెబుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులపై కఠిన చర్యలు: విద్యాశాఖ

సాధారణంగా అందరూ ఎంత వీలైతే అంత డబ్బు సంపాదించాలని అనుకుంటారు. రెండు చేతులా డబ్బు సంపాదించాలనే క్రమంలో.. వారు రెండు ఉద్యోగాలను చేస్తూ ఉంటారు. వీరిలో ప్రైవేట్ ఉద్యోగులు ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. అయితే, ప్రైవేట్ ఉద్యోగులు ఏం చేసినా ప్రశ్నించే వారు ఉండరు. కానీ, ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు.. పగలు పాఠశాలలో చెబుతూనే.. ప్రైవేట్ ట్యూషన్స్ కూడా చెబుతూ ఉంటారు. అయితే, ఇక నుంచి ఇలా ఎవరైనా చేస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ.. తాజాగా బీహార్ విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బీహార్ లోని ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి సాధారణ విధులతో పాటూ .. ప్రైవేట్ గా ట్యూషన్స్ కూడా చెబుతున్నారంటూ.. పిర్యాదులు వచ్చాయి. అయితే, వీటిపై తగిన చర్యలు తీసుకునే క్రమంలో విద్యా శాఖ.. జిల్లా మేజిస్ట్రేట్ లకు ఒక లెటర్ రాసింది. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి, ప్రైవేట్ కోచింగ్ సెంటర్ ల నుంచి..రాత పూర్వకంగా ఒక ఒప్పంద పత్రాన్ని రాయించి వాటిపై వారి సంతకాలు కూడా తీసుకోవాలని ఆదేశించింది. కాగా, ఈ అగ్రిమెంట్ ను ఎటువంటి పరిస్థితిలోను ఎవరూ కూడా ఉల్లగించడానికి లేదు. ఒకవేల ఈ నియమాలను ఎవరైనా అతిక్రమిస్తే వారిపై ప్రభుత్వం చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటుందని.. అధికారులు వెల్లడించారు.

కాగా, ఈ రకంగా ఎవరైనా ఉపాధ్యాయులు నియమాలను ఉల్లంగిస్తే.. వెంటనే వారి వివరాలను జిల్లా ప్రధాన కార్యాలయాలకు తెలియాజేయాలని.. విద్యాశాఖ అన్ని జిల్లాల అధికారులను సూచించింది. అయితే, బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు (BSEB) కు సంబంధించిన 10,12 వ తరగతి పరీక్షలు జనవరి 10న ప్రారంభం అవ్వనున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులంతా.. వారికీ కేటాయించిన పాఠశాలలలో మాత్రమే వారి విధులను నిర్వహించాలని.. విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. అలాగే పరీక్షల తేదీ దగ్గర పడుతుండడంతో.. ఉపాధ్యాయులంతా ఎక్కువగా సెలవులు తీసుకోవడానికి వీలు లేదని కూడా తెలిపారు. ఒకేసారి 10% మంది ఉపాధ్యాయులు సెలవుల్లో ఉండకూడదని ఆదేశించారు.

ఏదేమైనా, బీహార్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలను చేపట్టి ఎంతో మందిని విద్యార్థులకు మంచి చేస్తుందని చెప్పి తీరాలి. లేదంటే ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహించే ఎంతో మంది.. అక్కడి విద్యార్థులను పట్టించుకోకుండా ప్రైవేట్ ట్యూషన్స్ చెప్తూ వారి సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇప్పుడు ఇటువంటి ఓ చట్టం రావడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతుంది. మరి, బీహార్ విద్యా శాఖ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంపై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.