iDreamPost

ఆశ్రమాలు, లగ్జరీ కార్లు.. భోలే బాబా ఆస్తుల విలువ అన్ని కోట్లా?

Bhole Baba Assets: యూపీ లోని  హాత్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనకు కారణమైన భోలే బాబా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇదే సమయంలో ఆయనకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Bhole Baba Assets: యూపీ లోని  హాత్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనకు కారణమైన భోలే బాబా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇదే సమయంలో ఆయనకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఆశ్రమాలు, లగ్జరీ కార్లు.. భోలే బాబా ఆస్తుల విలువ అన్ని కోట్లా?

ఉత్తర్ ప్రదేశ్  రాష్ట్రంలోని  హాత్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. భోలే బాబా సత్సంగ్ లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 123 మంది మరణించగా, వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు ఆరు మందిని అరెస్టు చేశ రు. అసలు ఈ విషాదానికి కేంద్ర బిందువైన భోలే బాబా ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు లభించలేదు. ఈ దుర్ఘటనపై న్యాయ విచారణ జరుపుతామని ఆ రాష్ట్ర  ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హామీ ఇచ్చారు. ఇది ఇలాంటే ఇప్పటికే భోలే బాబాకు సంబంధించిన నిజాలు అనేకం వెలుగులోకి రాగా..తాజాగా ఆయనకు సబంధించిన ఆస్తులు వివరాలు బయటకు వస్తున్నాయి.  ఇక ఆ వివరాల్లోకి వెళ్తే..

భోలే బాబాకు సంబంధించిన ఆస్తులు, విలాసాలపై ఓ జాతీయ మీడియా ఛానెల్ విస్తుపోయే నిజాలు వెల్లడించింది. ఆయన ఆశ్రమంలోని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం సేకరించినట్లు ఆ మీడియా సంస్థ వెల్లడించింది. భోలే బాబాకు దేశవ్యాప్తంగా 24 అత్యంత విలాసవంతమైన ఆశ్రమాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఎక్కువ ఉత్తర్ ప్రదేశ్ లోనే ఉన్నాయి. ఇక ఆయన మొత్తం ఆస్తి విలువ దాదాపు రూ.100 కోట్ల వరకు ఉంటుందని ఆశ్రమంలోని విశ్వసనీయ వర్గాల ద్వారా బయటకు వచ్చింది. శ్రీ నారాయణ్‌ హరి సాకార్‌ అనే ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ను ఏర్పాటు చేసినట్లు… ఆ ట్రస్ట్ ద్వారానే ఈ ఆస్తులను నిర్వహిస్తున్నారని సమాచారం. ఆయనకు అత్యంత నమ్మకమైన, దగ్గరి వాళ్లు వీటి కార్యకలాపాలు చూస్తుంటారు. నిత్యం తెలుపు రంగు దుస్తులు, టై, కళ్లద్దాల్లో కనిపిస్తుంటారు. ఆయన అందరికి దర్శనం ఇచ్చే సమయంలో భారీ పరేడ్‌తో వస్తారు.

దాదాపు 16 మంది వ్యక్తిగత కమాండోలు ఆయన కారుకు ముందు 350 సీసీ పవర్ కలిగిన ద్విచక్ర వాహనాలపై వెళ్తూ..దారిని క్లియర్ చేస్తారట. అదే విధంగా ఆయన వెనుక 15 నుంచి 30  వరకు లగ్జరీ కార్లు ఆయన కాన్వాయ్‌ ఉంటుంది. మెయిన్‌పురిలోని ఆశ్రమంలో సూరజ్‌పాల్‌ సూరజ్‌పాల్‌  నివాసముంటారు. ఈ ఆశ్రమం 13 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీనిని హరి నగర్‌గా పిలుస్తుంటారు. భోలే బాబా, ఆయన భార్య కోసం ఆ ఆశ్రమంలో ఆరు విలాసవంతమైన గదులు ఉన్నాయని తెలుస్తోంది.ఇక ఆశ్రమంలోకి ఎంట్రీ ఇస్తుండగానే దానికి విరాళాలిచ్చిన 200 మంది పేర్లు అక్కడ ఉన్న బోర్డుపై  కనిపిస్తాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఇటావాలో మరో కొత్త ఆశ్రమం నిర్మాణంలో ఉంది. ఇలా మొత్తంగా పోలీస్ నుంచి ఆధ్యాత్మిక గురువుగా అవతారమెత్తి..కోట్ల రూపాయల ఆస్తులను భోలో బాబా సంపాదించినట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి