iDreamPost
android-app
ios-app

బాల రామునికి సాయం.. అయోధ్యకు రూ.52 లక్షలు విరాళం ఇచ్చిన బాలిక

బాల రాముని ప్రాణ ప్రతిష్ట వేళ ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో రామ భక్తులు పూజలు చేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. అయోధ్య రాముడి దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక అయోధ్య రామ్ మందిర్ నిర్మాణానికి ఓ బాలిక రూ. 52 లక్షల విరాళమందించింది.

బాల రాముని ప్రాణ ప్రతిష్ట వేళ ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో రామ భక్తులు పూజలు చేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. అయోధ్య రాముడి దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక అయోధ్య రామ్ మందిర్ నిర్మాణానికి ఓ బాలిక రూ. 52 లక్షల విరాళమందించింది.

బాల రామునికి సాయం.. అయోధ్యకు రూ.52 లక్షలు విరాళం ఇచ్చిన బాలిక

అయోధ్య రామ్ మందిర్ ప్రారంభోత్సవ వేళ దేశ జనులు రామ జపంతో భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. దేశ వ్యాప్తంగా ఊరూ, వాడలన్నీ బాలరాముని ప్రాణప్రతిష్ట వేళ ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. రామనామంతో ప్రకృతి సైతం పరివశించిపోతోంది. ఇక అయోధ్య రామ్ మందిర్ నిర్మాణానికి రామ భక్తులు తమకు తోచిన సాయాన్ని విరాళాల రూపంలో అందజేశారు. సంపన్నుల నుంచి మొదలుకుని సామాన్యుల వరకు ప్రతిష్టాత్మకమైన ఆలయ నిర్మాణంలో భాగమయ్యారు. కాగా ఓ బాలిక సైతం బాలరామునికి సాయం అందించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 52 లక్షలు అయోధ్యకు విరాళంగా అందించి తన పెద్ద మనసును చాటుకుంది.

గుజరాత్ రాష్ట్రానికి చెందిన 14 ఏళ్ల వయసున్న భవికా మహేశ్వరి అనే బాలిక బాలరాముని పట్ల తన ఉడతా భక్తిని చాటుకుంది. అయోధ్య రామ్ మందిర్ నిర్మాణం కోసం భారీ విరాళాన్ని అందించింది. ఇందుకోసం మూడేళ్లు దాదాపు 50 కిలోమీటర్లు ప్రయాణించి రూ. 52 లక్షల విరాళాలు సేకరించింది. అలా వచ్చిన విరాళాలను రామ్ మందిర్ నిర్మాణం కోసం విరాళంగా సమర్పించింది. ఈ బాలికకు 2020 లో పదకొండేళ్ల వయసున్న సమయంలో రామ్ మందిర్ నిర్మాణం కోసం విరాళాలు అందిస్తున్నారని తెలుసుకుని తాను కూడా అందులో భాగం కావాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఆ బాలికకు రామాయణం మీద ఉన్న ఆసక్తితో.. బాలరాముడి కథలు చదవడం ప్రారంభించింది. ఆ కథలను చెప్పి ప్రజల దగ్గరి నుంచి విరాళాలు సేకరించడం మొదలుపెట్టింది.

బహిరంగ సభల్లో పాల్గొని బాల రాముడి కథలు చెప్పి విరాళాలు సేకరించేది. ఈ క్రమంలో ఓ జైలులో ఉన్న ఖైదీలకు 2021లో బాల రాముడి కథలను చెప్పడంతో వారు ఏకంగా భవికా మహేశ్వరికి రూ.లక్ష విరాళం అందించారు. అప్పటి నుంచి 300 పైగా ప్రదర్శనలు ఇచ్చింది ఆ బాలిక. ఈ ప్రదర్శనల ద్వారా మొత్తం రూ.52 లక్షల వరకు సేకరించింది. ఆ మొత్తం డబ్బును అయోధ్య రామాలయ నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కు అందించింది. అయోధ్య రామ్ మందిర్ కోసం ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించి బాల రామునికి సాయమందించిన తీరుపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరి భవికా మహేశ్వరి అనే బాలిక రామ్ మందిర్ కోసం రూ. 52 లక్షలు విరాళం అందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.