iDreamPost
android-app
ios-app

రూ.29 కే కిలో బియ్యం.. భారత్ రైస్ ఎక్కడ కొనాలి? షాప్స్ లో అమ్ముతారా?

  • Published Feb 06, 2024 | 7:04 PM Updated Updated Feb 06, 2024 | 7:30 PM

దేశంలో బియ్యం ధరలు భగ్గుమంటున్న సమయంలో మోదీ సర్కార్ ప్రజలకు తీపి కబురు చెప్పింద. ఇకపై కేజీ 29 రూపాయలకే బియ్యం అందించనున్నారు.

దేశంలో బియ్యం ధరలు భగ్గుమంటున్న సమయంలో మోదీ సర్కార్ ప్రజలకు తీపి కబురు చెప్పింద. ఇకపై కేజీ 29 రూపాయలకే బియ్యం అందించనున్నారు.

రూ.29 కే కిలో బియ్యం.. భారత్ రైస్ ఎక్కడ కొనాలి? షాప్స్ లో అమ్ముతారా?

దేశంలో ప్రస్తుతం పేద, మధ్యతరగతి కుటుంబాల వారు బియ్యం కొనాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఇటీవల నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి.. దానికి తోడు రోజు రోజుకీ బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే మార్కెట్లో బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది మోదీ సర్కార్. కిలో బియ్యం కేవలం రూ.29 లకే ఇస్తున్నట్లు ప్రకటించింది. మరి ఈ బియ్యం ఎక్కడ తీసుకోవచ్చు? ఎప్పటి నుంచి ఇస్తారు? అనే విషయాల గురించి తెలుసుకుందాం. 

దేశంలో పేద, మధ్యతరగతి ప్రజలు ఇటీవల పెరిగిపోతున్న నిత్యావసర ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. వంట గ్యాస్, ఆయిల్, పప్పు దినుసులే కాదు బియ్యం ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయనే కారణాల వల్ల ఉత్పత్తి తగ్గిందని చెబుతూ వ్యాపారులు ధరలను భారీగా పెంచేస్తున్నారు. ముఖ్యంగా బియ్యం విషయంలో మార్కెట్లో దళారుల వల్ల రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి.  బియ్యం ఎగుమతులకు కేంద్రం బ్రేక్ వేసినా.. ధరలు అదుపులోకి రావడం లేదు. విచిత్రం ఏంటంటే బియ్యం ధర 15 శాతం పెరిగిపోయిందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. దీంతో సామాన్యులు బియ్యం కొనాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో మోదీ సర్కార్ బియ్యం ధరలకు కళ్లెం వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ రైస్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

కేంద్రం బియ్యం ధరలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ‘భారత్ రైస్’ను ఆహార శాఖ మంత్రి పియూష్ గోయాల్ ఢిల్లీలో కర్తవ్య పథ్ లో ప్రారంభించారు. భారత ఆహార సంస్థ నుంచి సేకరించిన 5 లక్షల టన్నుల బియ్యం ఎన్ఎఎఫ్ఈడి, ఎన్‌సీసీఎఫ్, కేంద్రీయ భండార్ తో సహా అన్ని పెద్ద చైన్ రిటైల్ లో అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ సెక్రటరీ సంజీవ్ చోప్రా స్పందించారు. ప్రస్తుతం ఈ బియ్యం రోజుకు 5 కిలోలు, 10 కిలోల బ్యాగులు అందుబాటులో ఉంటాయని అన్నారు. భారత్ రైస్ సప్లై కోసం కేంద్రం ప్రత్యేక మొబైల్ వాహనాలు కేటాయించాలని భావిస్తుందని.. కేంద్ర కో ఆపరేటివ్ ఏజెన్సీల ద్వారా నేరుగా వెళ్లి కొనుగోలు చేయవచ్చునని అన్నారు.

అలాగే ఇంటింటికీ తిరిగి ఈ రైస్ విక్రయించేలా ప్రతిపాదనలు రెడీ చేస్తున్నామని.. అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా భారత్ రైస్ ని విక్రయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ఈ-కామర్స్ వేదికల్లో భారత్ బ్రాండ్ విక్రయాలకు మంచి స్పందన వస్తున్న నేపధ్యంలో భారత్ రైస్ కు సైతం అదే స్థాయిలో మంచి ఆదరణ వస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ప్రతి సామాన్యుడికి భారత్ రైస్ చేరేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.  ఏది ఏమైనా రూ.29 లకే కిలో బియ్యం అనే అంశంపై ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబం వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి తక్కువ ధరకే బియ్యం అందిస్తుండడంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.