iDreamPost
android-app
ios-app

కావాలని కదులుతున్న కారు కింద పడిన బెంగళూరు మహిళ.. వీడియో వైరల్

  • Published Aug 31, 2024 | 1:07 PM Updated Updated Aug 31, 2024 | 1:07 PM

Cunning Woman At Nights Creates Nuisance: డబ్బు కోసం మనుషులు ఎంతగా దిగజారిపోతారంటే? అవసరమైతే ప్రాణాలను కూడా రిస్క్ లో పెడతారు. తాజాగా ఓ అమ్మాయి డబ్బు కోసం తన ప్రాణాలనే రిస్క్ లో పెట్టింది.

Cunning Woman At Nights Creates Nuisance: డబ్బు కోసం మనుషులు ఎంతగా దిగజారిపోతారంటే? అవసరమైతే ప్రాణాలను కూడా రిస్క్ లో పెడతారు. తాజాగా ఓ అమ్మాయి డబ్బు కోసం తన ప్రాణాలనే రిస్క్ లో పెట్టింది.

కావాలని కదులుతున్న కారు కింద పడిన బెంగళూరు మహిళ.. వీడియో వైరల్

కొంతమంది మరీ చీప్ మెంటాలిటీ కలిగి ఉంటారు. అబ్బాయిలు మాత్రమే కాదు.. ఈ మధ్య అమ్మాయిలు కూడా మగవారికి పోటీ వస్తున్నారు. ఎంత దారుణంగా ఉంటున్నారంటే కష్టపడి సంపాదించడం చేతకాక సులువుగా ఒకడి కష్టాన్ని దోచేసి డబ్బులు సంపాదించేయాలి అని ఫిక్స్ అయిపోతున్నారు. మీరు కనుక రాత్రి సమయంలో రోడ్డు మీద వెళ్తుంటే జాగ్రత్త.. రాత్రి పూట అనే కాదు పగటి పూట కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి కన్నింగ్ లేడీస్ కూడా ఉంటారు. మీరు ఏమీ చేయకపోయినా మీరే చేశారని చెప్పి మిమ్మల్ని జనంతో కొట్టించి పోలీస్ కేసు కూడా పెడతారు. తాజాగా ఓ మహిళ చేసిన నీచపు పని ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అదృష్టం కొద్దీ బాధితుడి కారులో కెమెరా ఉండబట్టి సరిపోయింది లేదంటే ఆమె చెప్పేది నిజం అనుకుని అతన్ని కొట్టేసేవారు. ఆ తర్వాత ఆ అమ్మాయి నష్టపరిహారంగా ఎంతోకొంత డబ్బు లాక్కుని పోతుంది. అసలేం జరిగిందంటే.. బెంగళూరులో షోనీ కపూర్ అనే వ్యక్తి కారులో వెళ్తున్నాడు. అయితే ఒక అమ్మాయి రోడ్డు మధ్యలో నిలబడి కావాలని కారుకి అడ్డం వచ్చింది. షోనీ కపూర్ వెంటనే బ్రేక్ వేశాడు. ఆ అమ్మాయి కావాలని కారు బానెట్ కి గుద్దుకుని కింద పడిపోయింది. బాబోయ్ గుద్దేసాడు అంటూ కలరింగ్ ఇచ్చింది. ఒక ఫేక్ యాక్సిడెంట్ ని క్రియేట్ చేసి హడావుడి చేసింది. అయితే కారులో ఉన్న వ్యక్తి తెలివిగా పోలీస్ పోలీస్ అంటూ అరవడంతో ఆ అమ్మాయి కాసేపు ఉండి ఆ తర్వాత వెళ్ళిపోయింది. ఈ వీడియో మొత్తం కారు డ్యాష్ బోర్డులో ఉన్న కెమెరాలో రికార్డ్ అయ్యింది.

ఆ వీడియోని షోనీ కపూర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. ‘డ్యాష్ కెమెరా పెట్టండి. ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది తెలియదు. ముఖ్యంగా లేడీస్ అయితే ఏదైనా జరగరానిది జరిగితే జనం కూడా ఆ అమ్మాయి వైపే ఉంటారు’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్స్ స్పందిస్తున్నారు. కార్లలో డ్యాష్ కెమెరాలు ఖచ్చితంగా ఉండాలి అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలాంటి వివాదాలప్పుడు డ్యాష్ క్యామ్ లే సాక్ష్యాలుగా ఉంటాయని.. యాక్సిడెంట్స్, మోసపూరిత వాదనలు వంటివి జరిగినప్పుడు ఉపయోగపడతాయని మరొక యూజర్ కామెంట్ చేశాడు. రియల్ టైం ఫుటేజ్ ని రికార్డు చేయడం వల్ల డ్రైవర్స్ స్కామ్స్ నుంచి తప్పుడు ఆరోపణల నుంచి రక్షించబడతారని కామెంట్ చేశాడు.