కోట్లు పెట్టి అపార్ట్ మెంట్స్ కొన్నా నీళ్లు లేవు.. రోడ్డెక్కిన సంపన్నులు!

Bengaluru Water Crisis: ఎండాకాలం వచ్చిందంటే చాలు సూర్యుడి ప్రతాపాన్ని తట్టుకోవడం చాలా కష్టం. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుంది. కోట్లు ఖర్చుపెట్టి అపార్ట్ మెంట్స్ లో ఫ్లాట్లు కొన్నా.. నీళ్లు లేక నానా కష్టాలు పడుతుంటారు.

Bengaluru Water Crisis: ఎండాకాలం వచ్చిందంటే చాలు సూర్యుడి ప్రతాపాన్ని తట్టుకోవడం చాలా కష్టం. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుంది. కోట్లు ఖర్చుపెట్టి అపార్ట్ మెంట్స్ లో ఫ్లాట్లు కొన్నా.. నీళ్లు లేక నానా కష్టాలు పడుతుంటారు.

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని అంటారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు  ప్రతి ఒక్కరికీ తమకంటూ ఓ సొంత ఇళ్లు ఉండాలని కోరుకుంటారు.   మార్చి నుంచి ఎండలు దంచి కొడుతున్నాయి. సమ్మర్ సీజన్ లో ఎంత ఆకలికైనా తట్టుకుంటారు కానీ.. మంచినీళ్లు లేకుంటే విల విలలాడిపోతారు.  గత కొంత కాలంగా కర్ణాటకలో తీవ్ర నీటి ఎద్దడి మొదలైన విషయం తెలిసిందే.  ఇదిలా ఉంటే కోట్లు పెట్టి అపార్ట్ మెంట్స్, రెసిడెన్షియల్ కొన్నవారికి నీళ్లు లేక అల్లాడిపోతే వారి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంటుంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు కర్ణాటకలో సంపన్నులకు వచ్చింది.కోట్లు పెట్టి అపార్ట్ మెంట్స్ కొన్నా.. నీటి కొరత వల్ల నానా కష్టాలు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే..

గత కొన్నిరోజులుగా కర్ణాటకలో నీళ్ల సమస్య ఏ విధంగా ఉందో చూస్తూనే ఉన్నాం. చేతులు కడుక్కోవడానికి నీళ్లు లేక టిష్యూలు వాడుతున్నారంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఈ సమస్య రాను రాను మరింత తీవ్ర రూపం దాల్చుతుంది. రాష్ట్ర రాజధాని బెంగుళూరు సిటీలో చాలా వరకు వ్యాపారలు క్లోజ్ చేశారు.. చిన్న చిన్న హూటల్స్ కూడా మూసి వేశారు.చాలా మంది తమ సొంత ఊళ్లకు వెళ్లిపోతున్నారు. బెంగుళూరు లో సామాన్యులకే కాదు.. సంపన్నులకు కూడా నీటి కష్టాలు ఎదురవుతున్నాయి. కోట్లు రూపాయలు పెట్టి ఫ్లాట్లు కొన్న రెసిడిన్షియల్ కాలనీ, సొసైటీల్లోనూ తీవ్రమైన నీటి ఎద్దడి మొదలైంది. దీంతో నీళ్ల కోసం అపార్ట్ మెంట్స్, రెసిడెన్షియల్ వాసులు రోడ్డెక్కుతున్నారు.

బెంగుళూరు నీటి సరఫరా మురుగునీటి బోర్డు (బీడబ్ల్యూఎస్ఎస్‌బి) రోజుకి 40 లక్షల నుంచి 2 కోట్ల లీటర్ల మధ్య వినియోగిస్తున్న రెసిడెన్షియల్ కాలనీలకు, సొసైటీలకు నీటి సరఫరాలో 10 శాతం కోత విధించడంతో వాళ్లకు నీటి కష్టాలు మొదలయ్యాయి. బెంగుళూరులోని షాపూర్జీ పల్లోంజీ పార్క్ వెస్ట్ లో తీవ్రమైన నీటి కొరత ఎర్పడటంతో ఆ ప్రాంతవాసులు నీళ్ల కోసం నానా కష్టాలు పడుతున్నారు. ఈ రెసిడెన్షియల్ లో ఒక్కో ఫ్లాలు ధర దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుందని.. ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి కొన్నా నీటి కష్టాలేంటీ అని బిల్డర్ కి వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు నివాసితులు. కోట్ల పెట్టి ఫ్లాట్లు కొన్నాం.. నీళ్లకు చచ్చిపోతున్నాం.. మాకు నీళ్లు కావాలి అంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకొని బిల్డర్ కి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. సాధ్యమైనంత వరకు నీటి సమస్య లేకుండా చేస్తామని షాపూర్జీ పల్లోంజీ రియల్ ఎస్టేట్ యాజమాన్యం తెలిపింది.

 

Show comments