iDreamPost

ఇద్దరు ఒకేరోజు పుట్టి.. ఒకేరోజు చనిపోయారు! బెస్ట్ కపుల్స్ విషాధ గాథ!

  • Published Jun 08, 2024 | 12:24 PMUpdated Jun 08, 2024 | 12:24 PM

Bengaluru Trekkers Couple: భారత దేశంలో వివాహ వ్యవస్థకు ఎంతో గౌరవం ఉంది. వేద మంత్రాల సాక్షిగా ఒక్కటైన జంట నిండు నూరేళ్లు కలిసి ఉండాలని పెద్దలు దీవిస్తుంటారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి అరమరికలు లేకుండా ఉంటే ఆ కుటుంబం చల్లగా వర్ధిల్లుతుందని అంటారు.

Bengaluru Trekkers Couple: భారత దేశంలో వివాహ వ్యవస్థకు ఎంతో గౌరవం ఉంది. వేద మంత్రాల సాక్షిగా ఒక్కటైన జంట నిండు నూరేళ్లు కలిసి ఉండాలని పెద్దలు దీవిస్తుంటారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి అరమరికలు లేకుండా ఉంటే ఆ కుటుంబం చల్లగా వర్ధిల్లుతుందని అంటారు.

  • Published Jun 08, 2024 | 12:24 PMUpdated Jun 08, 2024 | 12:24 PM
ఇద్దరు ఒకేరోజు పుట్టి.. ఒకేరోజు చనిపోయారు! బెస్ట్ కపుల్స్ విషాధ గాథ!

వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను పెద్దలు, బంధుమిత్రులు నిండు నూరేళ్లు చల్లగా జీవించాలని దీవిస్తారు. భారత దేశంలో హిందూ వివాహ వ్యవస్థకు ప్రపంచంలోనే గొప్ప పేరు ఉంది. మన వివాహ వ్యవస్థను ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు. భార్యాభర్తల అనుబంధం ఎంతో గొప్పంది. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. వివాహ బంధంతో ఒక్కటైన జంట చనిపోయే వరకు ఒకరికొకరు తోడు నీడగా ఉంటారు. జీవితంలో ఎలాంటి పరిస్థితిలో అయినా సరే చివరి వరకు కలిసి జీవించేది భార్యాభర్తలే. పెళ్లైన నాటి నుంచి ఆ జంట అన్యోన్యంగా ఉండేవారు. ట్రెక్కింగ్ హాబీ.. హిమాలయాల్లో తరుచూ ట్రెక్కింగ్ కోసం వెళ్తుంటారు. ఈ క్రమంలోనే మృత్యువు ఆ దంపతులను వెంటాడింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది. వివరల్లోకి వెళితే..

ఉత్తరాఖాండ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హిమాలయ పర్వతాల్లో ట్రెక్కింగ్ కోసం వెళ్లిన ఓ జంట ప్రాణాలు కోల్పోయారు.హిమాలయ పర్వతాల్లో సహస్త్రతాల్ అనే ఒక సరస్సు ఉంది.. సహస్త్రతాల్ ప్రాంతంలో ఏడు సరస్సులు ఉన్నాయి. ఇక్కడ నుంచి పాండవులు స్వర్గానికి వెళ్లారని పురాణాల్లో చెబుతుంటారు. గత నెల 29 న 22 మంది ట్రెక్కంగ్ బృందం హిమాలయన్ వ్యూ ట్రెక్కింగ్ ఏజెన్సీ సహస్త్రతాల్ సరస్సు దగ్గరకు పంపించింది. ఇందులో 18 మంది కర్ణాటకకు చెందిన వారు ఉన్నారు. ముగ్గురు లోకల్ గైడ్స్ తో వీరంతా ట్రెక్కింగ్ కి వెళ్లారు. ట్రెక్కింగ్ పూర్తి చేసుకొని శుక్రవారం తిరుగు ప్రయాణం కావడానికి సిద్దమయ్యారు. కానీ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.. మంచు తుఫాన్, చలిగాలుల్లో చిక్కుకున్నారు. వారు సమయానికి బేస్ క్యాంప్ కి చేరుకోకపోవడంతో ట్రెక్కింగే ఏజెన్సీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడ ప్రభుత్వం స్పందించి సైన్యం, హెలికాప్టర్లతో సహాయక చర్యలు ప్రారంభించారు.

ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు.. మిగిలిన వారిని ఎస్‌డీఆర్ఎఫ్ సురక్షితంగా కాపాడి తీసుకువచ్చారు. చనిపోయిన వారిలో కర్ణాటక హుబ్బళికి చెందిన భార్యాభర్త వినాయక్ ముంగురవాడి, సుజాత ముంగురవాడీ ఉన్నారు. వీరిద్దరూ 1994 లో హుబ్బళిలో బీవీబీ కాలేజ్ లో ఇంజనీరింగ్ చదివారు. మరో విషాదం ఏంటంటే.. ఇద్దరి పుట్టిన రోజు ఒక్కటే.. చనిపోయిన రోజూ ఒక్కటే. ఓ ప్రైవేట్ కంపెనీలో టెక్కీలుగా కొనసాగుతున్నారు. వినాయక్ స్నేహలోక అనే స్వచ్చంద సంస్థలో గత 16 ఏండ్లుగా సేవలు అందిస్తున్నారు. కరోనా సమయంలో ఈ జంట చేసిన సేవలకు స్థానికంగా ఎంతోమంచి పేరు వచ్చింది. ప్రతి ఏడాది వినాయక్ ట్రెక్కింగ్ కి వెళ్తుంటాడు.. ఈ ఏడాది భార్యతో వెళ్లాడు. ఈ జంట మరణ వార్త విని కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి