iDreamPost
android-app
ios-app

‘జైల్లో అయినా ఉంటా, ఇంటికి వెళ్లను!’ ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్!

భార్య వేధిస్తుంటూ ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పోలీసుల ముందు తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో అతడి భార్యపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో కామెంట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరి ఎపిసోడ్ ఓ బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.

భార్య వేధిస్తుంటూ ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పోలీసుల ముందు తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో అతడి భార్యపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో కామెంట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరి ఎపిసోడ్ ఓ బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.

‘జైల్లో అయినా ఉంటా, ఇంటికి వెళ్లను!’ ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్!

రెండు రోజుల క్రితం కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు చెందిన ఓ టెకీ చెప్పిన విషయాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. తనను జైల్లో అయినా పెట్టండి కానీ, భార్య వద్దకు వెళ్లనంటూ పోలీసులకు చెప్పాడు. తన భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నానని పోలీసుల ముందు వాపోయాడు. ఈ ఇష్యూ కాస్తా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. ఇక తాజాగా ఈ ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. సదరు వ్యక్తి భార్య ఎంట్రీ ఇచ్చి..పలు విషయాలను వెల్లడించింది. ఆమె చెప్పిన విషయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం….

కర్ణాటకలోని బెంగళూరులో  విపిన్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి  బెంగళూరులోని మాన్య‌త టెక్ పార్క్‌లో ఓ ప్ర‌ముఖ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఇక అతడికి కి భార్య శ్రీప‌ర్ణ ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. కాగా, వీరు బెంగ‌ళూరులోని కొడిగేహ‌ళ్లిలో  నివసిస్తున్నారు. ఇటీవలే తన భార్యపై పలు ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలో తాజాగా శ్రీఅపర్ణ తన భర్త మానసిక స్థితి బాగాలేదంటూ పలు విషయాలను వెల్లడించారు.

భార్య వేధిస్తుంది కాబట్టే ఆమె నుంచి తప్పించుకునేందుకు భర్త తిరుగుతున్నారంటూ వచ్చిన వార్తల్ని ఖండించారు. గతకొంతకాలంగా తన భర్త కెరియర్ గురించి ఆందోళనకు గురైనట్లు ఆమె తెలిపారు. తన భర్త విపిన్ రెండు సార్లు ఉద్యోగం కోల్పోయాడని,  దీంతో భవిష్యత్ గురించి ఆలోచిస్తూ ఆందోళనకు గురయ్యాడని తెలిపింది. మరోవైపు తన తండ్రి అనారోగ్ సమస్యలు, ఆర్థిక సమస్యలతో విపిన్ ఇబ్బంది పడుతున్నాడని తెలిపింది. చికిత్స కు డబ్బులు అవసరం కావడంతో మానసికంగా కుంగిపోయాడని ఆమె తెలిపింది. తన భర్తను తానే వేధిస్తే.. ఆయన ఆచూకీ కోసం సోషల్ మీడియాను ఎందుకు ఆశ్రయిస్తాని ఆమె తెలిపింది. తన భర్తను ఎప్పుడూ తాను వేధించలేదని, అదే జరిగితే ఆయన ఆచూకీ తెలిపాలనే  పోలీసులను ఎందుకు ఆశ్రయిస్తాని తెలిపారు. తన భర్త మానసికంగా కృంగిపోయాడు కాబట్టే ఆయనను పునరావాస సెంటర్ కి పంపినట్లు ఆమె తెలిపారు.

తన భర్త దొరికిన తరువాత కూడా శ్రీ అపర్ణకు బెదిరింపు సందేశాలు వస్తున్నాయంట.  తన భర్తను కిడ్నాప్ చేశామంటూ పలువురు డబ్బుల్ని డిమాండ్ చేస్తున్నారని తెలిపింది. దీంతో  పోలీసులకు ఫిర్యాదు చేశాని, తనకు సైబర్ నేరగాళ్ల నుంచి సందేసాలు వస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఇక అసలు విషయం ఏమిటంటే..  కర్ణాటకలోని  బెంగళూరులో  విపిన్  అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తన భార్య వేధిస్తుందని ఇంటి నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో ఆయన భార్య శ్రీపర్ణ దత్త పోలీసులు ఫిర్యాదు చేయాగ వారు విచారణ వేగవంతం చేశారు.

ఈ క్రమంలోనే విపిన్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో ఉన్నట్లు గుర్తించారు. ఇక అక్కడి నుంచి ఆయనను బెంగళూరుకు తీసుకొచ్చారు. విపన్ ను విచారించిన పోలీసులు ఆయన చెప్పిన మాటాలు విని ఆశ్చర్యపోయారు. తన భార్య పెట్టే హింసను భరించలేకపోతున్నానని విపిన్ వాపోయాడు. అందుకే ఇంటి నుంచి పారిపోయానని చెప్పాడు. అంతేకాకుండా.. తన మీద ఏ కేసు పెట్టిన అవసరమైతే జైలుకైనా వెళ్తను కానీ, ఇంటికి వెళ్లనని తెలిపాడు. దీంతో అతడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.