Tirupathi Rao
Bengaluru Food Safety Officials Confirms No Dog Meat Detected: బెంగళూరులో కుక్క మాంసం అంటూ చాలానే వార్తలు వచ్చాయి. శుక్రవారం కేఎస్సార్ రైల్వే స్టేషన్ లో 90 కాటన్ బాక్సుల్లో కుక్క మాసం దొరికిందని చెప్పుకొచ్చారు. ఆ అన్ని వార్తలు, పుకార్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు క్లారిటీ ఇచ్చారు.
Bengaluru Food Safety Officials Confirms No Dog Meat Detected: బెంగళూరులో కుక్క మాంసం అంటూ చాలానే వార్తలు వచ్చాయి. శుక్రవారం కేఎస్సార్ రైల్వే స్టేషన్ లో 90 కాటన్ బాక్సుల్లో కుక్క మాసం దొరికిందని చెప్పుకొచ్చారు. ఆ అన్ని వార్తలు, పుకార్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు క్లారిటీ ఇచ్చారు.
Tirupathi Rao
ఇప్పుడు బెంగళూరు ప్రజలను.. అక్కడికి వెళ్లి వచ్చే వారిని ఒక వార్త కంగారు పెట్టేస్తోంది. అదేంటంటే.. బెంగళూరులో కుక్క మాంసాన్ని మటన్ గా చెప్పి అమ్మేస్తున్నారు అని. అందుకు సంబంధించి చాలానే వార్తలు వచ్చాయి. అలాగే శుక్రవారం కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ లో 90 కార్టన్ బాక్సుల్లో భారీ ఎత్తున మాంసం లభించింది. అదంతా కుక్క మాంసం అని.. రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు అని యాక్టివిస్ట్ పునీత్ కరేహల్లి అక్కడకు చేరుకుని దానిని ల్యాబ్ టెస్టు చేయించాలని డిమాండ్ చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ బాక్కుల్లో ఉన్న మాంసాన్ని ఏ జంతువుదో తెలుసుకోవడానికి ల్యాబు టెస్టులకు పంపారు. ఆ రిపోర్టుల్లో వచ్చిన రిజల్ట్ ఏంటో ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు.
శుక్రవారం బెంగళూరు మొత్తం ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎందుకంటే కేఎస్సార్ రైల్వే స్టేషన్ లో భారీగా మాంసం పట్టుబడింది. అది కుక్క మాంసం అంటూ అక్కడకు చేరుకున్న యాక్టివిస్టులు గోల చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు రావాలని.. దానిని టెస్ట్ చేయించాలని కోరారు. అంత మాంసం ఉంది అనగానే ఫుడ్ సేఫ్టీ అధికారులు స్టేషన్ కు చేరుకున్నారు. అన్ని బాక్సుల్లో ఉన్న మాంసం శాంపిల్స్ ని ల్యాబు టెస్టుల కోసం పంపారు. ఆ టెస్టుల్లో అది కుక్క మాంసం కాదని తేలిందని చెప్పారు. వాళ్లు రవాణా చేస్తోంది మేక మాంసమే అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ప్రజలకు క్లారిటీ కూడా ఇచ్చారు.
“కేఎస్సార్ రైల్వే స్టేషన్ లో తీసుకున్న శాంపిల్స్ ని ల్యాబ్ లో టెస్ట్ చేయించాం. అందులో ఎలాంటి కుక్క మాంసం కలవలేదు అని స్పష్టమైంది. అది సిరోహి అనే ఒక స్పెషల్ బ్రీడ్ మాంసం. ఈ జాతి మేకలకు ఒంటిమీద మచ్చలు ఉంటాయి. తోక కూడా సాధారణం కంటే కాస్త పొడవుగా ఉంటుంది. ఈ రకం మేకలు రాజస్థాన్, కచ్, భుజ్ ప్రాంతాల్లో బాగా పాపులర్. బెంగళూరులో మటన్ కు ఉన్న డిమాండ్ కి తగ్గట్లు వ్యాపారం చేసుకునేందుకు కొందరు డీలర్స్.. కొంతకాలంగా ఈ సిరోహి మాంసాన్ని రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు” అంటూ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ క్లారిటీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా బెంగళూరులో మటన్ పేరిట కుక్క మాంసం అమ్మేస్తున్నారని.. హోటల్స్ లో కుక్క మాంసంతో చేసిన బిర్యానీని మటన్ బిర్యాని అని అమ్ముతున్నారు అంటూ చాలానే పుకార్లు వచ్చాయి. ఇప్పుడు ఈ టెస్టులతో ఆ పుకార్లకు పుల్ స్టాప్ పడినట్లు అయ్యింది. అలాగే అధికారులు కూడా అది కుక్క మాంసం కాదు అని స్పష్టం చేశారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.