Dharani
పార్కులో ఉన్న చెట్టును హగ్ చేసుకోవాలంటే.. 1500 చెల్లించాలి అంట. ఇదేంది.. ఇదెక్కడి రూల్ అనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి.
పార్కులో ఉన్న చెట్టును హగ్ చేసుకోవాలంటే.. 1500 చెల్లించాలి అంట. ఇదేంది.. ఇదెక్కడి రూల్ అనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి.
Dharani
గ్రామాలు, చిన్న చిన్న టౌన్‌లలో ఏమో కానీ.. మెట్రో నగరాల్లో పార్కులు కచ్చితంగా ఉంటాయి. వీటిల్లో ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసుకోవడానికి.. పిల్లలు ఆడుకోవడానికి అనుమతిస్తారు. పార్కులను పరిశుభ్రంగా ఉంచడం కోసం.. అక్కడ పని చేసే సిబ్బందికి వేతనాలు చెల్లించడం కోసం పార్కులు ఎంట్రీ ఫీజు వసూలు చేస్తుంటాయి. ఇక కొన్ని పార్కుల్లో అరుదైన మొక్కలను, జంతు, వృక్ష జాతులను కాపాడుతుంటారు. వాటికి ఎవరైనా నష్టం చేకూరిస్తే.. జరిమానా విధిస్తుంటారని మనకు తెలుసు. కానీ ఓ కంపెనీ మాత్రం వింత రూల్ పాస్ చేసింది. పార్కులోని చెట్లను హగ్ చేసుకోవాలనుకుంటే భారీగా డబ్బులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. మరి ఆ కంపెనీ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది.. ఇది ఎక్కడ అమల్లోకి వచ్చింది వంటి వివరాల కోసం..
ప్రస్తుతం ఇందుకు సబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ ఇలాంటి ప్రకటన చేసింది. నగరంలోని ప్రముఖ కబ్బన్ పార్క్‌లో చెట్లను హగ్ చేసుకోవాలంటే 1500 రూపాయలు చెల్లించాలంట. దీ హీలింగ్ పవర్ ఆఫ్ ఫారెస్ట్ పేరుతో సదరు కంపెనీ క్యాంపెయిన్ ప్రారంభించింది. దీనిలో భాగంగా ఫారెస్ట్ బాతింగ్ అనే కార్యక్రమాన్ని ఆరంభించింది. ఎవరైనా దీనిలో చేరాలంటే 1,500 రూపాయలు చెల్లించాలి.
ఇక ఈ ఫారెస్ట్ బాతింగ్ కార్యక్రమంలో భాగంగా మీరు చెట్లను హగ్ చేసుకోవచ్చు.. అలానే ప్రకృతి ఒడిలో సేదదీరేలా.. ఉరుకులు, పరుగులతో అలసిపోయిన జీవితాలకు కాస్త బ్రేక్ ఇచ్చి.. రణగొణ ధ్వనులకు దూరంగా అడవుల్లోకి ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్లి వచ్చే కార్యక్రమాన్ని రూపొందించామని సదరు కంపెనీ తెలిపింది. దీన్ని జపనీస్ ఆర్ట్ అంటారని చెప్పుకొచ్చింది. ఈ అద్బుతమైన అనుభవాన్ని కేవలం 1500 రూపాయలు చెల్లించి.. మీరు కూడా ఆస్వాదించవచ్చని సదరు కంపెనీ యాడ్స్ ఇచ్చింది.
ఇక ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజనులు దీనిపై రకరకాల విమర్శలు చేస్తున్నారు. మార్కెట్‌లోకి మరో కొత్త రకం మోసం వచ్చింది.. అంటూ ట్రోల్ చేస్తున్నారు. అడవిలో నడుచుకుంటూ వెళ్లడానికి, చెట్లను హగ్ చేసుకోవడానికి మీరు ట్రైనింగ్ ఇస్తారా ఏంటి.. ఎందుకు జనాలను ఇలా మోసం చేస్తున్నారు అని మండిపడుతున్నారు. ఇక ఏప్రిల్ 28, ఉదయం 810.30 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగతుందని.. టికెట్ కొన్నవారు మాత్రమే దీనిలో పాల్గొనడానికి అర్హులని సదరు కంపెనీ వెల్లడించింది.
Babe, wake up! There’s a new scam in the market. pic.twitter.com/UO4zrJgiUa
— jolad rotti (@AJayAWhy) April 16, 2024