Keerthi
ఈ మధ్య చాలామంది బ్యాంకు అధికారులు ప్రజలు దాచుకున్న బంగారన్ని, డిపాజిట్ ల పేరిట కోట్ల విలువ చేసే నగదును తమ సొంత ఖర్చులకు వాడుకొనిదివాలతీసే ఘటనలు ఇటీవలే చాలా చూస్తున్నాం. అయితే తాజాగా జరిగిన ఓ ఘటనలో మాత్రం ఓ బ్యాంకు మేనేజర్ ప్రజలు దాచిన నగలను కొట్టేయాలని ఏకంగా భారీ స్కేచ్ వేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఈ మధ్య చాలామంది బ్యాంకు అధికారులు ప్రజలు దాచుకున్న బంగారన్ని, డిపాజిట్ ల పేరిట కోట్ల విలువ చేసే నగదును తమ సొంత ఖర్చులకు వాడుకొనిదివాలతీసే ఘటనలు ఇటీవలే చాలా చూస్తున్నాం. అయితే తాజాగా జరిగిన ఓ ఘటనలో మాత్రం ఓ బ్యాంకు మేనేజర్ ప్రజలు దాచిన నగలను కొట్టేయాలని ఏకంగా భారీ స్కేచ్ వేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
Keerthi
ప్రస్తుతం కాలంలో ఉన్నత ఉద్యోగం చేస్తున్న వారికి, ఈజీగా డబ్బులు సంపాదించాలని మోసలు చేసే కేటుగాళ్లకు పెద్ద తేడా లేకుండా పోతుంది. ఎందుకంటే.. మోసలకు పాల్పడే కేటుగాళ్లకు అదే పని కావొచ్చు. కానీ, మంచి ఉద్యోగం చేస్తున్న వారికి కూడా దూరాశతో తమ వృత్తి ధర్మానికి ఎసరుపెడుతున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగాల్లో అయితే ఈ తరహా మోసాలు ఎక్కువగానే జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే.. చాలామంది బ్యాంకు అధికారులు ప్రజలు దాచుకున్న బంగారన్ని, డిపాజిట్ ల పేరిట కోట్ల విలువ చేసే నగదును తమ సొంత ఖర్చులకు వాడుకొనిదివాలతీసే ఘటనలు ఇటీవలే చాలా చూస్తున్నాం. అయితే తాజాగా జరిగిన ఓ ఘటనలో మాత్రం ఓ బ్యాంకు మేనేజర్ ప్రజలు దాచిన నగలను కొట్టేయాలని ఏకంగా భారీ స్కేచ్ వేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
తాజాగా ఓ బ్యాంకు మేనేజర్ భారీ మోసానికి పాల్పడ్డాడు. చాలామంది కస్టమర్లు లోన్లు తీసుకునేందుకు బ్యాంకులో బంగారం తాకట్టు పెడుతూ ఉంటారు. అయితే ఆ బంగారంపై కన్నేసిన ఆ బ్యాంకు మేనేజర్.. ఎలాగైనా వాటిని కొట్టేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే.. బ్యాంకులో కస్టమర్లు పెట్టే నగలను దోచేసి వాటి స్థానంలో నకిలీ నగలు తయారు చేసి పెట్టాడు. దీని తర్వాత ఆ బ్యాంకు మేనేజర్ ట్రాన్స్‌ఫర్ అయి వెళ్లిపోగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాంక్ మేనేజర్ ఇవి నకిలీ నగలను గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ భారీ మోసం కేరళలోని చోటు చేసుకుంది.
కాగా, ప్రస్తుతం ఈ మోసం వైరల్ గా మారింది. అయితే కేరళలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడకర్ బ్రాంచ్‌కు కొత్తగా వచ్చిన ఇర్షాద్ అనే మేనేజర్ ఈ మోసంను కోజికోడ జిల్లాలోని వడకర పోలీసులకు ఫిర్యాదు చేశఆడు. దీంతో బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇక ఈ విచారణలో అంతకుముందు బ్యాంక్ మేనేజర్‌గా పనిచేసిన తమిళనాడుకు చెందిన మధు జయకుమార్ ఈ నకిలీ నగలను పెట్టి అసలైన బంగారంను కొట్టేశాడని తెలింది. ముఖ్యంగా ఈ బ్యాంకులో తాకట్టు పెట్టిన 26 కిలోల బంగారాన్ని మధు జయకుమార్ తీసుకెళ్లి.. దాన్ని స్థానంలో నకిలీ నగలను పెట్టాడని గుర్తించారు.
అయితే వాటి విలువ ఏకంగా రూ..17 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో వడకర బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసిన మధు జయకుమార్.. ఆ తర్వాత కొచ్చిలోని బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. అయితే ఈ బ్యాంకు కుంభకోణం బయటికి రావడంతో మధు జయకుమార్ కనిపించకుండా పోయారు. అంతేకాకుండా అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో అతడే నిందితుడుని గుర్తించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరీ, బ్యాంకు మేనజర్ ఈ భారీ కుంభకోణానికి పాల్పడిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.