iDreamPost
android-app
ios-app

అప్పటి వరకు భారత్‌లోనే షేక్ హసీనా..భారీ బందోబస్తు!

  • Published Aug 06, 2024 | 12:16 PM Updated Updated Aug 06, 2024 | 12:16 PM

Sheikh Hasina: ప్రపంచం మొత్తం ఇప్పుడు బంగ్లాదేశ్ వైపే చూస్తుంది. గత కొంత కాలంగా ఇక్కడ రిజర్వేషన్ల కోటా నేపథ్యంలో జరుగుతున్న ఆందోళన హింసాత్మకంగా మారి..ఏకంగా ప్రధాని తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

Sheikh Hasina: ప్రపంచం మొత్తం ఇప్పుడు బంగ్లాదేశ్ వైపే చూస్తుంది. గత కొంత కాలంగా ఇక్కడ రిజర్వేషన్ల కోటా నేపథ్యంలో జరుగుతున్న ఆందోళన హింసాత్మకంగా మారి..ఏకంగా ప్రధాని తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

  • Published Aug 06, 2024 | 12:16 PMUpdated Aug 06, 2024 | 12:16 PM
అప్పటి వరకు భారత్‌లోనే షేక్ హసీనా..భారీ బందోబస్తు!

ఇటీవల బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంతో అట్టుడికిపోయింది. ఆందోళన చిలికి చిలికి గాలివానగా మారి విధ్వంసాలకు తెరలేపింది. ఇక చేసేదేమీ లేక ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు.ఈ క్రమంలోనే పాలనను సైన్యం తన చేతుల్లోకి తీసుకోవడంతో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే గత కొన్నిరోజులుగా బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఆందోళనకర పరిస్థితులు భారత్ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తుంది. అయితే షేక్ హసీనా గుర్తు తెలియని ప్రదేశానికి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆమె కొంతకాలం భారత్‌లో తలదాచుకోనున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..

బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల గొవడవ హింసాత్మకంగా మారిపోవడంతో ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. అయితే రాజీనామా చేసిన కొంత సేపటికే ఆమె కనిపించకుండా పోరారు. సోమవారం సాయంత్రం ఆమె బంగ్లదేశ్ సైనిక హెలికాప్టర్ లో యూపీలోని హిండన్ ఎయిర్ బేస్ లో దిగారు. ఆమెను ఆహ్వానించడానికి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్వయంగా వెళ్లారు. వాస్తవానికి షేక్ హసీనా బ్రిటన్ కి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నప్పటికీ కొన్ని పరిణామాల వల్ల అది కుదరలేదు. దీంతో కొంతకాలం ఆమె భారత్ లోనే తలదాచుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమెకు భారత్ భారీ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు సమాచారం.

షేక్ హసీనాకు బ్రిటన్ నుంచి అనుమతి వచ్చే వరకు భారత్ లోనే ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. తనను రాజకీయ శరణార్థిగా పరిగణించి ఆశ్రయం కల్పించాలని యూకేను హసీనా కోరినట్లు సమాచారం. దీనిపై కైర్ స్టార్మర్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. దీంతో యూకే నుంచి అనుమతులు వచ్చే వరకు షేక్ హసీనాకు భారత్ లో పూర్తి భద్రతే ఏర్పాటు చేయనున్నట్లు కథనాలు వస్తున్నాయి. క్లిష్ట సమయంలో హసీనాకు భారత్ సంస్థాగతంగా పూర్తి సహకారం అందించనున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై అఫిషియల్ గా ఎలాంటి