iDreamPost
android-app
ios-app

చలాన్లతో మహిళ రికార్డు.. స్కూటీపై ఏకంగా 1.36 లక్షల ఫైన్!

ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఈక్రమంలో ఓ మహిళ చలాన్లతో రికార్డ్ సృష్టించింది.

ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఈక్రమంలో ఓ మహిళ చలాన్లతో రికార్డ్ సృష్టించింది.

చలాన్లతో మహిళ రికార్డు.. స్కూటీపై ఏకంగా 1.36 లక్షల ఫైన్!

కరోనా అనంతరం వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణింంచేందుకే జనాలు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో సొంత వాహనాల సంఖ్య పెరిగింది. దీంతో రోడ్లపై వాహనాల రద్దీ కూడా పెరిగింది. ట్రాఫిక్ ను నియంత్రించేందుకు, ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ ను కఠిన తరం చేశారు. అయినప్పటికీ కొంతమంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారికి భారీగానే జరిమానాలు విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. కాగా ఓ మహిళ ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించింది. చలాన్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ఆమె స్కూటీపై 270 చలాన్లు వేశారు ట్రాఫిక్ పోలీసులు. ఆ చలాన్ల విలువ ఏకంగా రూ.1.36 లక్షలు. పోలీసులు తనిఖీల్లో భాగంగా ఆమె స్కూటీని సీజ్ చేశారు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.

ట్రాఫిక్ రూల్స్ పాటించండంటూ ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించినప్పటికీ వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఓవర్ స్పీడు, రాంగ్ రూట్, సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ట్రాఫిక్ చలాన్లు విధిస్తున్నప్పటికీ వారిలో మార్పు రావడం లేదు. బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఇదే విధంగా ఇష్టారీతిలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ స్కూటీని నడిపింది. ఆమె నియమాలను అతిక్రమించిన ప్రతీసారి బెంగళూరు నగరంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దీంతో తన హోండా యాక్టివా స్కూటీపై ఏకంగా 270 ఫైన్లు పడింది. వాటి విలువ మొత్తం రూ.1.36 లక్షలు అయింది.

ఈ జరిమానా స్కూటీ ధర కంటే కూడా ఎక్కువగా ఉండడంతో ఆ మహిళ షాక్ కు గురైంది. అన్ని చలానాలు పడినా వాటిని కట్టకుండా తప్పించుకు తిరుగుతుండడంతో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు చివరికి ఆమె హోండా యాక్టివా స్కూటీని సీజ్ చేశారు. కాగా ఆ మహిళ తన స్కూటీపై పడిన చలానాలను చెల్లించిందా లేదా అన్నది తెలియరాలేదు. మహిళ స్కూటీపై 270 చలాన్లు పడ్డాయన్న విషయం తెలియడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు సూపర్ ఉమెన్ అంటూ రకరకాల కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.