iDreamPost
android-app
ios-app

మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. రెండు రోజుల పాటు దుకాణాలు బంద్

మద్యం తాగనిదే రోజు గడవని మందు బాబులకు ఓ బ్యాడ్ న్యూస్. రానున్న రెండు రోజుల పాటు మద్యం దొరికే అవకాశాలు లేవు. ఎందుకనుకుంటున్నారా అయితే ఈ వార్త చదవండి.

మద్యం తాగనిదే రోజు గడవని మందు బాబులకు ఓ బ్యాడ్ న్యూస్. రానున్న రెండు రోజుల పాటు మద్యం దొరికే అవకాశాలు లేవు. ఎందుకనుకుంటున్నారా అయితే ఈ వార్త చదవండి.

మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. రెండు రోజుల పాటు దుకాణాలు బంద్

‘మందు బాబులం.. మేము మందు బాబులం.. మందు కొడితే మాకు మేమే మహారాజులం’ అంటూ పాటేసుకుంటున్నారేటీ. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే.. మందు పడనిదే మద్యం ప్రియులకు రోజు గడవదు కనుక. బార్ షాపులు రోజంతా తెరిచినా కూడా తాగేవాళ్లు ఉన్నారు ఈ ఇలాకాలో. తీర్థం తాగకపోతే ఏదో వెలితిగా ఫీల్ అవుతుంటారు. అలాంటిది రెండు రోజులు.. అదే రెండంటే రెండు రోజులు బార్ అండ్ లిక్కర్ షాపులు తెరుచుకోవంటే.. ఊహించడమే కష్టం కదా..నిజమే మరీ మద్యం బాబులకు మింగుడు పడని ఓ న్యూస్ వచ్చింది. అదేంటంటే.. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూత పడనున్నాయి. ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ అనుకుంటున్నారా..?

మద్యం దుకాణాలను గురు, శుక్రవారాలు మూతపడనున్నాయి. ఎక్కడంటే తమిళనాడులోని చెన్నైలో. జనవరి 25, 26 తేదీల్లో బార్ షాపులను మూసివేయాలని చెన్నై జిల్లా కలెక్టర్ రశ్మీ సిద్దార్థ్ ఉత్తర్వులు జారీ చేశారు. 26 అంటే గణతంత్ర దినోత్సవం సందర్బం కాబట్టి అనుకోవచ్చు. కానీ జనవరి 25వ తేదీ ఎందుకంటే.. ఆరోజు వడలూరు రామలింగర్ వర్థంతి. ఈ నేపథ్యంలో ఆ రోజు కూడా మద్యం షాపులు తీయొద్దని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించినా, ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా మద్యం దుకాణాలు మూసివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరీ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.