భారత సైనిక అవసరాల కోసం కొత్త జంతువులు!

Indian Army: కోట్ల మంది ప్రజలు గుండెమీద చేయి వేసుకొని ప్రశాంతంగా బతుకుతున్నారంటే సరిహద్దుల్లో సైనికులు కంటికి రెప్పాలా కాపాడటం వల్లే అంటారు. శత్రు దేశాల దాడులను తిప్పికొడుతూ ఎప్పటికప్పుడు పహారా కాస్తూ రక్షణగా ఉంటారు.

Indian Army: కోట్ల మంది ప్రజలు గుండెమీద చేయి వేసుకొని ప్రశాంతంగా బతుకుతున్నారంటే సరిహద్దుల్లో సైనికులు కంటికి రెప్పాలా కాపాడటం వల్లే అంటారు. శత్రు దేశాల దాడులను తిప్పికొడుతూ ఎప్పటికప్పుడు పహారా కాస్తూ రక్షణగా ఉంటారు.

దేశ సరిహద్దులో నిత్యం పహారా కాస్తూ కోట్ల మంది భారతీయులను రక్షించే సైనికుల సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏ వైపు నుంచి శత్రువుల వచ్చినా వారిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ప్రజల ప్రాణాలు రక్షిస్తుంటారు. ఎత్తైన పర్వత ప్రాంతాలు, గడ్డ కట్టే మంచు కొండల్లో ప్రయాణం చేస్తూ సైనికులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కొన్నిసార్లు సరైన సదుపాయాలు కూడా ఉండవు. ముఖ్యంగా లద్దాఖ్ లో భారత సైన్యం రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. లద్దాఖ్ ప్రాంతంలో సవాళ్ళను ఎదుర్కొంటున్న భారత సైన్యం కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

భారత సైన్యం సరిహద్దులో భద్రత ఇతర అవసరాల కోసం కొత్తగా జంతువుల సేవలు ఉపయోగించుకుంటుంది. లద్దాఖ్ సరిహద్దులో పహారా కాసేందుకు, సామాగ్రి తరలించేందుకు లేహ్ లోని డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూట్ రీసెర్చ్ (డీఐహెచ్ఏఆర్ ) రెండు మాపురాల (బాక్ట్రియన్ ) ఒంటెలను బందోబస్తుకు ఉపయోగిస్తున్నారు. ఇవి పహారా కాసే సైనికులు బరువులు మోసేందుకు శిక్షణ ఇచ్చామని.. సత్పలితాలు ఇస్తున్నాయని అధికారులు తెలిపారు.

డ్రోన్లు, ఆల్ – టెరైన్ వాహనాల వంటి వాటిని వినియోగించాలంటే.. వాతావరణం, పర్యావరణ అంశాలు, రోడ్డు సదుపాయాలు వంటివి పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పైగా శత్రు దేశాలు జామర్ల వంటి సాంకేతికతలు వాటిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అదే జంతువులు అయితే ఈ ఇబ్బందులు ఏవీ ఉండవు. సరుకు రవాణాలో మెరుగ్గా పనిచేస్తాయని సైనిక అధికారులు అంటున్నారు. ఆర్మీ లాజిస్టిక్స్ ఇతర అవసరాల కోసం ఈ జంతువులు చక్కగా ఉపయోగపడుతున్నాయని ‘డీఐహెచ్‌ఏఆర్‌’తెలిపింది. లద్దాక్ సెక్టార్ లో సామాగ్రి చేరవేతకు 1999 కార్గిల్ యుద్దం నుంచి జన్‌స్కర్లను విస్తృతంగా ఉపయోగించినట్లు అధికారలు తెలిపారు.

చైనా సరిహద్దు తూర్పు లద్దాఖ్ లో బాక్ట్రియన్ ఒంటెలతో నిర్వహించిన ప్రాథమిక పరీక్షలు విజయవంతం అయ్యాయి. పెట్రోలింగ్, బరువులు మోయడం వంటి పనుల కోసం బాక్ట్రియన్ బాగా ఉపయోగపడుతున్నాయని అధికారులు అంటున్నారు. సైనిక అవసరాలకు సంబంధించిన శిక్షణ భిన్నంగా ఉంటుందని, యుద్ద సమయాల్లో ఏమాత్రం బెదరకుండా, సిబ్బంది ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తాయని అధికారులు తెలిపారు. వీటితో పాటు జడల బర్రెలను ఉపయోగించడంపై ట్రయల్స్ జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.

Show comments