iDreamPost
android-app
ios-app

రామ మందిరం కల సాకారం! మోదీ కాదు.. అసలు హీరో LK. అద్వానీ!

  • Published Jan 22, 2024 | 1:18 PMUpdated Jan 22, 2024 | 1:18 PM

Ayodhya Ram Mandir-LK Advani: అయోధ్య మందిర ప్రారంభోత్సవం సందర్భంగా.. ఎక్కడ చూసినా మోదీ పేరే వినిపిస్తోంది. కానీ మందిరం సాకారం విషయంలో మోదీ కన్న ఎక్కువ కృషి చేసింది అద్వానీ.. ఆ వివరాలు..

Ayodhya Ram Mandir-LK Advani: అయోధ్య మందిర ప్రారంభోత్సవం సందర్భంగా.. ఎక్కడ చూసినా మోదీ పేరే వినిపిస్తోంది. కానీ మందిరం సాకారం విషయంలో మోదీ కన్న ఎక్కువ కృషి చేసింది అద్వానీ.. ఆ వివరాలు..

  • Published Jan 22, 2024 | 1:18 PMUpdated Jan 22, 2024 | 1:18 PM
రామ మందిరం కల సాకారం! మోదీ కాదు.. అసలు హీరో LK. అద్వానీ!

సుమారు ఐదు వందల ఏళ్ల నిరీక్షణకు మరి కొన్ని గంటల్లో తెర పడనుంది. కోట్లాది మంది హిందువులు ఎంతో ఆత్రుతగా, భక్తిగా ఎదురు చూస్తోన్న అపురూప దృశ్యం మరి కొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య గర్భగుడిలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ క్రతువులో పాల్గొనడం కోసం దేశ, విదేశాల నుంచి భారీ ఎత్తున భక్తులు అయోధ్యకు తరలి వస్తున్నారు. ఇక అయోధ్య మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో నేడు ఎ‍క్కడ చూసినా మోదీ పేరే వినిపిస్తోంది. ఆయన ప్రధానిగా ఉన్నారు కాబట్టి.. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మోదీ చేతుల మీదుగా జరుగుతుంది. కానీ అయోధ్య మందిరం కల సాకారం అవ్వడంలో అసలు హీరో మాత్రం వేరే ఉన్నారు. ఆయనే బీజేపీ అగ్రనేత ఎల్‌కే అ‍ద్వానీ.

నేడు అయోధ్య రామ మందిరంలో బాల రాముడు కొలువు దీరాడు. అయితే తన జన్మభూమిలో రామ్‌ లల్లా కొలువు దీరడం కోసం ఎంతో మంది రామ భక్తులు తమ రక్తాన్ని దారపోశారు. అయితే రామ మందిర ఉద్యమానికి మంచి ఊపు తీసుకొచ్చింది.. దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ప్రచారం చేసింది బీజీపీ సీనియర్‌ నేత ఎల్‌ కే అద్వానీ ప్రారంభించిన రథయాత్ర. ఈయన చేపట్టిన రథయాత్ర.. దేశ రాజకీయాలను మార్చి వేసింది. నేడు ప్రారంభం కాబోతున్న రామ మందిరం.. నాటి అద్వానీ రథయాత్ర వల్లనే సాధ్యం అయ్యింది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. రథయాత్ర ఫలితంగా అయోధ్యలో మందిర నిర్మాణం చేయాలనే ఆకాంక్ష కాస్త డిమాండ్‌గా మారింది.

LK Advani

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం పోరాడాలని విశ్వహిందూ పరిషత్‌ 1984లో నిర్ణయం తీసుకుంది. 1986లో రామ జన్మభూమి ఉద్యమం ఊపందుకోవడం.. 1989 నాటికి దేశ వ్యాప్తంగా రామ శిల కార్యక్రమం అయోధ్య రామ మందిర నిర్మాణం చేయాలనే వేడిని పెంచాయి. 1989 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా బీజేపీ మేనిఫెస్టోలో అయోధ్య రామ మందిర నిర్మాణం భాగమయ్యింది. 1989 ఎన్నికల ఫలితాల తర్వాత అప్పటి ప్రధాని వీపీ సింగ్‌ నాలుగు నెలల్లో అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. కానీ మాట నిలబెట్టుకోలేదు. దాంతో వీహెచ్‌పీ కరసేవ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి బీజేపీ కూడా మద్దతిచ్చింది.

ముందు పాదయాత్ర అనుకున్నారు.. తర్వాత రథయాత్ర

వీహెచ్‌పీ తలపెట్టిన కార్యక్రమానికి బీజేపీ మద్దతివ్వడమే కాక.. గుజరాత్‌లోని సోమనాథ్‌ నుంచి అయోధ్యకు పాదయాత్ర చేయాలని సంకల్పించింది. కానీ ఆ తర్వాత నిర్ణయం మార్చుకుని రథయాత్ర చేయాలని సంకల్పించారు. సెప్టెంబర్ 12న 1990 రథయాత్రపై ప్రకటన చేశారు. సెప్టెంబర్ 25 దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి రోజున సోమనాథ్ నుంచి ఈ యాత్రను మొదలుపెట్టారు. అక్టోబర్ 30న అయోధ్యకు ఈ రథయాత్రకు చేరుకోవాలని రూట్ మ్యాప్ సిద్దం చేసుకున్నారు. అయితే ఈ రథయాత్ర కేవలం ఉత్తరాదికే కాకుండా దక్షిణాదిలో కూడా సాగాలని నిర్ణయించారు. 10 వేల కిలో మీటర్ల మేర సాగే ఈ యాత్ర కోసం ఓ మినీ ట్రక్కును రథం రూపంలో సిద్ధం చేశారు.

1990 సెప్టెంబర్ 25న గుజరాత్‌, సోమనాథ్‌లోని జోత్యర్లింగానికి పూజల తర్వాత అద్వానీ రథయాత్ర మొదలైంది. ఈ యాత్రలో ఆయన వెంట ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. నాడు అద్వానీ చేపట్టిన రథయాత్ర ఫలితంగా రామ జన్మభూమిలో మందిర నిర్మాణం జరిగి తీరాలనే డిమాండ్‌ వచ్చింది. ఇన్నాళ్లకు అది సాకారం అయ్యింది. అయితే ఇక్కడ మరో బాధాకరమైన సంగతి ఏంటంటే అయోధ్య మందిర నిర్మాణం కోసం ఇంతలా పాటుపడిన అద్వానీ మాత్రం నేడు మందిర ప్రారంభోత్సవానికి దూరంగా ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి