iDreamPost
android-app
ios-app

Ayodhya Temple: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి 84 సెకన్ల అద్భుతమైన ముహుర్తం

  • Published Dec 25, 2023 | 10:58 AM Updated Updated Dec 25, 2023 | 10:58 AM

దేశవ్యాప్తంగా హిందువులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న భవ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సమయం ఆసన్నమవుతోంది. ఆలయంలో రామ్ లల్లా విగ్రహాల ప్రతిష్టాపనకు అద్భుత ముహుర్తం పెట్టారు పండితులు. ఆ వివరాలు..

దేశవ్యాప్తంగా హిందువులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న భవ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సమయం ఆసన్నమవుతోంది. ఆలయంలో రామ్ లల్లా విగ్రహాల ప్రతిష్టాపనకు అద్భుత ముహుర్తం పెట్టారు పండితులు. ఆ వివరాలు..

  • Published Dec 25, 2023 | 10:58 AMUpdated Dec 25, 2023 | 10:58 AM
Ayodhya Temple: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి 84 సెకన్ల అద్భుతమైన ముహుర్తం

దేశంలోని హిందువులందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న అద్భుత ఘట్టం తర్వలోనే అవిష్కుతం కానుంది. అయోధ్య భవ్య రామ మందిరం నిర్మాణం దాదాపు పూర్తి కావొస్తుంది. వచ్చే ఏడాది అనగా 2024, జనవరి 22న రామ మందిరం ప్రారంభోత్సవం, విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమ నిర్వహాణకు అయోధ్య రామ మందిరం ట్రస్ట్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఈ మహోన్నత ఘట్టానికి ముఖ్య అతిథులుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా పలువురు ప్రముఖుల్ని, సాధువుల్ని, ఆధ్యాత్మిక గురువుల్ని ఆహ్వానించింది. ఆ అద్భుత ఘట్టంలో పాల్గొనడానికి కోట్ల మంది తరలిరానున్నట్లు సమాచారం. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం.. అన్నీ ఏర్పాట్లు చేస్తోంది.

వచ్చే ఏడాది జనవరి నెల 22 వ తేదీన అయోధ్య మందిరం గర్భగుడిలో.. రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. అయితే ఆరోజు అనగా జనవరి 22న మంచి ముహూర్తం ఉన్నట్లు జ్యోతిష్యులు వెల్లడించారు. సుమారు 84 సెకన్ల పాటు శుభ ఘడియలు ఉన్నాయని.. ఆ సమయంలో అయోధ్య మందిరంలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగితే దేశం పేరు మారు మోగిపోతుందని వెల్లడించారు. జనవరి 22 వ తేదీ మధ్యాహ్నం 12 గం 29 ని 8 సె నుంచి 12 గం 30 ని 32 సె మధ్య అత్యంత శుభ ఘడియలు ఉన్నాయని వారణాసికి చెందిన సంగ్వేద విద్యాలయ ఆచార్యుడు, జ్యోతిషుడు ఆచార్య గణేశ్వర్‌ శాస్త్రి ద్రవిడ్‌ తెలిపారు.

ayodhya ram mandir

మేష లగ్నంలో అభిజిత్‌ ముహూర్తంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 12.45 గంటల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనున్నట్లు అయోధ్య ట్రస్ట్ వర్గాలు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక ఈ అమృత కాల ఘడియల్లో.. ప్రాణ ప్రతిష్ట జరిగితే.. ఎంతో శుభం చేకూరుతుందన్నారు.

మరోవైపు.. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో.. అన్ని ఏర్పాట్లు చకచక పూర్తవుతున్నాయి. మందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో.. నగరంలోని హోటల్‌ గదుల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. కొన్నిచోట్ల ఒక్కో గది రేటు రూ.లక్షకు చేరడం గమనార్హం. అటు వారణాసిలోనూ ఇదే పరిస్థితి నెలకొందని టూర్‌ ఆపరేటర్లు చెబుతున్నారు. మార్చి వరకు బుకింగ్స్ అయిపోయాయని.. ఆ తర్వాతే కొత్త బుకింగ్స్‌ ప్రారంభం అవుతాయని పేర్కొంటున్నారు.

నేపాల్ నుంచి కానుకలు..

ఇక నేపాల్‌ నుంచి కూడా అయోధ్య రాముడికి కానుకలు అందనున్నాయి. నగలు, పట్టు వస్త్రాలు, స్వీట్లతో కూడిన పలు వస్తువులను శ్రీరాముడికి సమర్పించనున్నారు. ఇందుకోసం జనక్‌పుర్‌ధామ్‌-అయోధ్యధామ్‌ యాత్రను చేపట్టనున్నారు. జనవరి 12 వ తేదీన ప్రారంభమయ్యే ఈ యాత్ర.. జనవరి 20 వ తేదీన కానుకలను శ్రీరామ జన్మభూమి రామ మందిర ట్రస్టుకు అందించడంతో ముగుస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గతంలో నేపాల్‌లోని కలిగంధకి నదీ తీరంలో లభించే సాలగ్రామ శిలలను సేకరించి శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మించడానికి అయోధ్యకు పంపిన సంగతి తెలిసిందే.