iDreamPost
android-app
ios-app

అయోధ్య బాలరాముడికి కొత్త పేరు.. ఇక మీదట ఇలాగే పిలవాలి!

అయోధ్యలో కొలువైన బాల రాముని పేరును మార్చారు. బాల రామునికి కొత్త పేరు పెట్టినట్లు పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఇక నుంచి అందరు బాల రాముడిని ఇలాగే పిలవాలట. ఇంతకీ కొత్త పేరు ఏంటంటే?

అయోధ్యలో కొలువైన బాల రాముని పేరును మార్చారు. బాల రామునికి కొత్త పేరు పెట్టినట్లు పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఇక నుంచి అందరు బాల రాముడిని ఇలాగే పిలవాలట. ఇంతకీ కొత్త పేరు ఏంటంటే?

అయోధ్య బాలరాముడికి కొత్త పేరు.. ఇక మీదట ఇలాగే పిలవాలి!

కోట్లాది మంది భారతీయులు కలలుగన్న అయోధ్య రామ్ మందిర్ నిర్మాణం సాకారమైంది. వందల ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈ నెల 22న రామ్ మందిర్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్య మందిరాన్ని ప్రారంభించి బాల రామునికి ప్రాణ ప్రతిష్ట చేశారు. అయోధ్యలో కొలువుదీరిన కోదండ రామున్ని రామ భక్తులు దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో అయోధ్య బాల రాముడి పేరు మార్చారు. బాల రామునికి కొత్త పేరు పెట్టారు. ఈ బాల రాముడి పేరు మార్చిన విషయాన్ని పూజారి అరుణ్ దీక్షిత్ వెల్లడించారు. ఇక నుంచి అందరూ ఆ పేరుతోనే పిలవాలట. ఇంతకీ బాల రాముని కొత్త పేరు ఏంటో తెలుసా?

అయోధ్యలో రామ్ మందిర్ ప్రారంభోత్సవ వేళ వేద పండితులు, రుషీశ్వరులు, మునులు, ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని కన్నులారా వీక్షించేందుకు వేల మంది భక్తులు అయోధ్యకు తరలివెళ్లారు. అయోధ్య నగరంతో పాటు దేశమంతా కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. బాల రాముడి విగ్రహానికి 22న ప్రాణ ప్రతిష్ఠ చేసిన విషయం తెలిసిందే. అయితే బాల రాముని పేరును మార్చారు. ఇక నుంచి రామ్‌లల్లా విగ్రహాన్ని ‘బాలక్‌ రామ్‌’గా పిలువనున్నారు. ఐదేళ్ల బాలుడిగా రాముడు దర్శనమిస్తున్న నేపథ్యంలో ‘బాలక్‌ రామ్‌’గా పిలువనున్నట్లు పూజారి అరుణ్ దీక్షిత్ వెల్లడించారు. బాల రాముడి విగ్రహానికి మైసూరుకు చెందిన శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ 51 అంగుళాల విగ్రహాన్ని తీర్చిదిద్దారు. మూడు బిలియన్‌ సంవత్సరాలకు చెందిన నల్లరాతిపై విగ్రహాన్ని చెక్కారు.

new name for bala ramudu

ఇక బాలక్ రామ్ ని దర్శించుకునేందుకు అయోధ్యలో భక్తులు పోటెత్తారు. బాలక్ రామ్ దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో అయోధ్యకు తరలివస్తున్నారు. నిన్న ఒక్క రోజే దాదాపు 5 లక్షల మంది బాలక్ రామ్ ని దర్శించుకున్నారు. ఈ రోజు సైతం సుమారు 3 లక్షలకు పైగా భక్తులు దర్శించుకునే అవకాశం ఉన్నట్లు ఆలయ ట్రస్టు వారు వెల్లడిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో తోపులాటలు చోటుచేసుకుంటున్నాయి. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా తగిన ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. మరి బాల రాముడి పేరును బాలక్ రామ్ గా మార్చడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.