iDreamPost
android-app
ios-app

ఫేమస్ స్కూల్.. అక్కడ చదవాలంటే.. ఫీజుకు బదులు ప్లాస్టిక్ ఇస్తే చాలు!

Akshar Foundation: ఈ భూగోళం మీద ప్లాస్టిక్‌ తొడుగు ఉంది. అది నీటిలో నానదు. మట్టిలో కలవదు. నిప్పులో కాల్చితే విషంగా మారుతుంది. అలాంటి ప్లాస్టిక్‌ వాడకం తగ్గించాలి. ప్లాస్టిక్ నిర్మూలన కోసం ఓ పాఠశాల వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది

Akshar Foundation: ఈ భూగోళం మీద ప్లాస్టిక్‌ తొడుగు ఉంది. అది నీటిలో నానదు. మట్టిలో కలవదు. నిప్పులో కాల్చితే విషంగా మారుతుంది. అలాంటి ప్లాస్టిక్‌ వాడకం తగ్గించాలి. ప్లాస్టిక్ నిర్మూలన కోసం ఓ పాఠశాల వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది

ఫేమస్ స్కూల్.. అక్కడ చదవాలంటే.. ఫీజుకు బదులు ప్లాస్టిక్ ఇస్తే చాలు!

ప్రస్తుత కాలంలో విద్యాను చాలా మంది వ్యాపారంగానే భావిస్తుంటారు. అందుకే చదువు సామాన్యులకు చాలా భారంగా మారింది. పెరిగిన చదువుల ఫీజులను భరించలేక, పిల్లలను తక్కువ సామర్థ్యం ఉండే స్కూల్స్ లో చేర్చాలేక తల్లిదండ్రులు అల్లాడిపోతుంటారు. మంచి విద్యా అందాలంటే  పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించాల్సిందే. నేటికాలంలో స్కూల్ ఫీజులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఓ పాఠశాల మాత్రం అందరికి ఆదర్శంగా నిలిచింది. ఆ ఫేమస్ స్కూల్ లో చదవాలంటే..ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం ప్లాస్టిక్ ఇస్తే చాలు. ఫీజులు బదులు ప్లాస్టిక్ ను ఆ స్కూల్ తీసుకోవడానికి గల కారణం ఏమిటో, ఆవివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…

సాధారణంగా ఏదైనా ప్రైవేటు పాఠశాల్లలో చదవాలంటే..సదరు నిర్ణయించిన ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆయా పాఠశాలలో గుర్తింపును, ఫేమస్ ను బట్టి ఫీజులు ఉంటాయి. ఫీజుల్లో కాస్తా అటు ఇటు ఉండొచ్చు కానీ, తీసుకోవడం మాత్రం పక్కా. ఏ ప్రైవేటు స్కూల్స్ ఫీజులు తీసుకోకుండా విద్యను బోధించవు. కానీ అస్సాం రాష్ట్రంలోని ‘అక్షర్’ అనే స్కూల్ మాత్రం మిగిలిన స్కూల్స్ కి భిన్నంగా ఉంది. అసోంలోని అక్షర్ స్కూల్‌ 2016లో వృథా ప్లాస్టిక్ ను స్కూల్‌ ఫీజ్‌గా తీసుకుంటున్నారు. ఏడేళ్లు క్రితం ప్రారంభమై దిగ్విజయంగా నడిచి పర్యావరణ హితమైన పాఠశాలగా ప్రశంసలు అందుకుంటోంది.

Famous school no fees

పర్మితా శర్మ, మజిన్‌ ముక్తార్‌ అనే పర్యావరణ ప్రేమికుల  ఆలోచనతో పుట్టిందే అక్షర్ స్కూల్. అస్సాంలోని పమోహీలో 2016 ‘అక్షర్‌’పేరుతో వీరిద్దరూ ఒక పాఠశాల స్థాపించారు. దీనిని  అన్నీ పాఠశాలలకు భిన్నంగా నడపాలని నిశ్చయించుకున్నారు. చదువు, స్కిల్స్, పర్యావరణ స్పృహ అందరికి కల్పించాలని అనుకున్నారు. అందుకే ఫీజు కట్టాలంటే నోట్లు తేవద్దు వాడిపారేస్తున్న ప్లాస్టిక్‌ తెండి విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పారు. ఎంత ఎక్కువ ప్లాస్టిక్‌ వ్యర్థాలు తీసుకెళ్తే ఆ మేర ఫీజు చెల్లించినట్లు రసీదు ఇస్తారు. ఇక్కడ విద్యార్థులను వారి వయసును బట్టి కాకుండా పర్యావణం, చదువు వంటి వాటిపై అవగాహన స్థాయిని బట్టి తరగతుల్లో వేస్తారు. ఇక్కడ ఎనిమిదేళ్లు వచ్చిన వారు 3వ క్లాస్‌లో ఉండాలని  నిబంధన లేదు.

అస్సాంలో చలి కారణంగా వేడి కోసం ప్లాస్టిక్ వస్తువులను కాల్చే వారు. వాటి ద్వారా వచ్చే విష వాయువులను పీల్చి పిల్లలు జబ్బుల బారిన పడసాగారు. దీంతో సామాజిక కార్యకర్త అయిన పర్మితా శర్మకు ఓ ఆలోచన తట్టింది. తన మిత్రుడు మజిన్‌తో తన ఆలోచనను పంచుకుంది. అలా వారిద్దరి ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే ‘అక్షర్‌’ విద్యాలయం. మొత్తంగా ఇక్కడ చదవాలంటే.. వృథాగా పడేసే ప్లాస్టిక్ ఇస్తే చాలు. మరి.. ఈ అక్షర్ స్కూల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.