P Venkatesh
ఆ యువతి అదృష్టం తలుపు తట్టింది. ఒక్క రోజులోనే రూ. 50 లక్షలు విలువ చేసే కారును సొంతం చేసుకుంది. లగ్జరీ కారును రూ. 100 కే దక్కించుకోవడంతో ఆనందంలో మునిగిపోయింది. దీంతో ఆ యువతి నెట్టింటా వైరల్ గా మారింది.
ఆ యువతి అదృష్టం తలుపు తట్టింది. ఒక్క రోజులోనే రూ. 50 లక్షలు విలువ చేసే కారును సొంతం చేసుకుంది. లగ్జరీ కారును రూ. 100 కే దక్కించుకోవడంతో ఆనందంలో మునిగిపోయింది. దీంతో ఆ యువతి నెట్టింటా వైరల్ గా మారింది.
P Venkatesh
అదృష్టం ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేము. అప్పటి వరకు సాధారణ జీవితాన్ని అనుభవించిన వారు ఒక్కసారిగా కోటీశ్వరులవుతారు. ఈ మధ్య సామాన్యులు లాటరీ టికెట్లు కొని కోట్ల రూపాయలు గెలుచుకున్న సంఘటనలు మనం చూశాం. తాజాగా ఓ యువతి జాక్ పాట్ కొట్టేసింది. అదృష్టం అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా మారిపోయింది. ఏకంగా రూ. 50 లక్షలు విలువ చేసే కారును కేవలం రూ. 100 కే సొంతం చేసుకుంది. ఇది తెలిసిన వారు ఆ యువతి నక్కతోక తొక్కి వచ్చిందేమో అని సరదాగా కామెంట్ చేస్తున్నారు. రూ. 100 కే లక్షలు విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ కారును గెలుచుకోవడంతో ఈ విషయం వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
సాధారణంగా మంచి కారు కొనాలంటే 3 నుంచి 5 లక్షల వరకు అవసరమవుతాయి. అదే లగ్జరీ కారు కావాలంటే 50 లక్షల నుంచి కోటి రూపాయల పైమాటే. ధన వంతులు మాత్రమే అలాంటి లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే దీపావళిని పురస్కరించుకుని ఆటోమెబైల్ కంపెనీలు ఆఫర్స్ ఇస్తుంటాయి. కళ్లు చెదిరే బహుమతులను కూడా అందిస్తుంటాయి. ఇదే విధంగా అసోంలోని ఓ యువతి కేవలం రూ.100కే లగ్జరీ మెర్సిడెస్ కారును దక్కించుకుంది. ఆమె పేరు దిశా దాస్, ప్రస్తుతం 12వ తరగతి చదువుతోంది. లగ్జరీ కారు రూపంలో ఆమెకు అదృష్టం వరించింది.
దిశా దాస్ లక్కీ డ్రా కూపన్ ద్వారా లగ్జరీ కారును గెలుచుకుంది. 100 రూపాయాల లక్కీ డ్రా కూపన్ గేమ్… రిజల్ట్ తాజాగా ప్రకటించారు. అందులో ఆమె విజేతగా నిలిచింది. బార్పెట్ బుక్ అండ్ సైన్స్ ఫెయిర్ ఫిబ్రవరి 2024లో జరగనుంది. దానికి ప్రచారం కల్పించేందుకూ లక్కీ డ్రా నిర్వహించారు నిర్వాహకులు. ఈ డ్రాలో మొదటి బహుమతి మెర్సిడెస్ బెంజ్ కారు. అయితే అందరి లాగానే దిశా దాస్ కూడా బహుమతి కూపన్‌ను కొనుగోలు చేసింది. ఆ కూపనే ఆమెకు రూ. 50 లక్షల విలువ చేసే కారును సొంతమయ్యేలా చేసింది. లక్కీ డ్రాలో మెర్సిడేస్ బెంజ్ కారును గెలుచుకోవడంతో ఆ యువతి కుటుంబంలో దీపావళి ఆనందం రెట్టింపయ్యింది. లక్కీ డ్రాలో తమ కూతురు కారు గెలుచుకోవడంతో కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు.