iDreamPost
android-app
ios-app

దేశంలో పెరుగుతున్న వివాహేతర సంబంధాలు.. ముందంజలో మహిళలు!

  • Published Apr 20, 2024 | 7:44 AM Updated Updated Apr 20, 2024 | 7:44 AM

ఆడవారు అన్ని రంగాల్లో ముందు ఉంటున్నారు. మగవారు చేసే జాబులు అయితేనేమీ.. మగవారు వేసుకునే బట్టలు అయితేనేమి.. మగవారు పీల్చి వదిలే సిగరెట్ పొగ విషయంలో అయితేనేమీ.. మద్యం తాగే విషయంలో అయితేనేమీ.. తాగి రచ్చ చేసే విషయంలో అయితేనేమీ ఇలా చాలా విషయాల్లో ముందుంటున్నారు. తాజాగా వివాహేతర సంబంధాల విషయంలో కూడా మగవారి కంటే ముందు ఉండడం ఆశ్చర్యం కలిగించే అంశం.

ఆడవారు అన్ని రంగాల్లో ముందు ఉంటున్నారు. మగవారు చేసే జాబులు అయితేనేమీ.. మగవారు వేసుకునే బట్టలు అయితేనేమి.. మగవారు పీల్చి వదిలే సిగరెట్ పొగ విషయంలో అయితేనేమీ.. మద్యం తాగే విషయంలో అయితేనేమీ.. తాగి రచ్చ చేసే విషయంలో అయితేనేమీ ఇలా చాలా విషయాల్లో ముందుంటున్నారు. తాజాగా వివాహేతర సంబంధాల విషయంలో కూడా మగవారి కంటే ముందు ఉండడం ఆశ్చర్యం కలిగించే అంశం.

దేశంలో పెరుగుతున్న వివాహేతర సంబంధాలు.. ముందంజలో మహిళలు!

వివాహ వ్యవస్థను మన దేశంలో ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వివాహ వ్యవస్థ మీద ఉన్న మంచి అభిప్రాయాన్ని చాలా మంది పోగొట్టేస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే కలహాలు పెట్టుకుని కలిసి ఉండలేక విడిపోతున్న వారు కొందరైతే.. భాగస్వామికి తెలియకుండా వివాహేతర సంబంధాలు పెట్టుకునేవారు కొందరు.. ఇలా వివాహ వ్యవస్థ మీద ఉన్న మంచి అభిప్రాయాన్ని కూడా ఇలాంటి వాళ్ళు పోయేలా చేస్తున్నారు. తాజాగా జరిగిన ఓ సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. భారతదేశంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయని.. ఇందులో 25 నుంచి 50 సంవత్సరాల వయసున్న వారు ఉన్నారని తేలింది. వీరిలో పెళ్ళైన ఆడవారు ముందు వరుసలో ఉండడం ఆశ్చర్యానికి గురి చేసే విషయం.  

దేశంలోని పలు ప్రధాన నగరాలకు చెందిన 25 నుంచి 50 ఏళ్ల వయసు కలిగిన 1503 మంది పెళ్ళైన వారు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వేలో పెళ్ళైన వారు ఎక్కువగా వివాహేతర సంబంధం వైపు ఆకర్షితులవుతున్నట్లు తేలింది. గ్లీడెన్ సర్వే ప్రకారం 60 శాతం మంది పెళ్ళైన భారతీయులు పెళ్లి, ద్రోహం, సాంస్కృతిక నిబంధనలు వంటి విషయాలపై భిన్నమైన ఆలోచనా విధానాన్ని కలిగి ఉన్నట్లు తేలింది. వివాహేతర సంబంధాలు కొనసాగించడానికి, భాగస్వామిని మోసం చేయడానికి అనేక పద్ధతులను అనుసరిస్తున్నారని సర్వేలో తేలింది. పెళ్ళైన తర్వాత మరొకరితో వివాహేతర సంబంధం కలిగి ఉండడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని.. 46 శాతం మంది మగవారు ఇలాంటి వాటిని ఇష్టపడుతున్నారని సర్వేలో వెల్లడైంది. అయితే వీరిలో ఎక్కువ మంది కోల్కతా చెందినవారు ఉన్నారట. ఇక శారీరకంగానే కాకుండా వర్చువల్ గా అంటే ఆన్ లైన్ రిలేషన్ షిప్ లో ఉండేవారు కూడా ఉన్నారు.

ఈ సర్వే ప్రకారం.. 35 శాతం మంది మగవారు, 36 శాతం మంది మగువలు వర్చువల్ ఫ్లర్టింగ్ ని బాగా ఇష్టపడుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఈ విషయంలో మగవారి కంటే మగువలే ఒక శాతం ఎక్కువ ఉండడం గమనార్హం. అంతేకాదు 33 శాతం మంది మగవారు, 35 శాతం మంది ఆడవారు పెళ్ళైనప్పటికీ ఇతరులతో కలిసి జీవించాలన్న ఫాంటసీ కలిగి ఉన్నారని సర్వేలో వెల్లడైంది. వీరంతా ఇతరులతో శారీరక సంబంధం ఏర్పరచుకునేందుకు ఇష్టంగా ఉన్నట్లు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక్కడ కూడా ఆడవారు అధికంగా ఉండడం గమనార్హం. మరి గ్లీడెన్ జరిపిన సర్వేలో దేశంలో వివాహ వ్యవస్థ పట్ల నేటి జనం విభిన్నమైన ఆలోచనా విధానం కలిగి ఉండడం.. వివాహేతర సంబంధాల పట్ల ఆకర్షితులవుతున్నట్లు తేలడం వంటి విపరీత పరిణామాలకు కారణం ఏమై ఉంటుందని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.