Arjun Suravaram
Archana Express Train: రైలు ఇంజిన నుంచి బోగీలు, అలానే బోగీలే సగంగా విడిపోయిన ఘ టనలు మనం పలు సందర్భాల్లో చూశాం. అలానే ఇంజిన్ నుంచి విడిపోయినా బోగీలు ట్రాక్ పై ఉండగా, మరో రైలు వచ్చి ఢీకొట్టిన ఘటనలు వేరే దేశాల్లో జరిగాయి.
Archana Express Train: రైలు ఇంజిన నుంచి బోగీలు, అలానే బోగీలే సగంగా విడిపోయిన ఘ టనలు మనం పలు సందర్భాల్లో చూశాం. అలానే ఇంజిన్ నుంచి విడిపోయినా బోగీలు ట్రాక్ పై ఉండగా, మరో రైలు వచ్చి ఢీకొట్టిన ఘటనలు వేరే దేశాల్లో జరిగాయి.
Arjun Suravaram
తరచూ రైలు ప్రమాదాలకు సంబంధించిన వార్తలు మనం వింటున్నాము. వివిధ కారణాలతో ఈ రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. కొన్ని సందర్భాల్లో రైల్వే అధికారులు, లోకో ఫైలట్ల సమయస్ఫూర్తితో పెను ప్రమాదాలను తప్పిస్తుంటారు. మరికొన్ని సార్లు కొందరి నిర్లక్ష్యం కారణంగా పెను ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. గతంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు విషయంలో ఘరో గురించి ఇప్పటికీ అందరు తలచుకుంటారు. ఆ తరువా కూడా పలు చిన్న చిన్న రైలు ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఓ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు 3 కిలోమీటర్లు ప్రయాణించాయి. ఈ సందర్భంగా అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అప్పుడప్పుడు రైలు ఇంజిన నుంచి బోగీలు, అలానే బోగీలే సగంగా విడిపోయిన ఘ టనలు మనం పలు సందర్భాల్లో చూశాం. అలానే ఇంజిన్ నుంచి విడిపోయినా బోగీలు ట్రాక్ పై ఉండగా, మరో రైలు వచ్చి ఢీకొట్టిన ఘటనలు వేరే దేశాల్లో జరిగాయి. అలానే రైలు ప్లాట్ ఫామ్ మీదకు ఎక్కిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా వీటి తరహాలోనే ఓ పెను ప్రమాదం తప్పింది. రైల్వే అధికారులు, లోకో ఫైలట్ వెంటనే అప్రమత్తం అవ్వడం వల్ల రైల్వేలో ఓ పెను ప్రమాదం తప్పింది. ఇంతక అసలు విషయం ఏమిటంటే ట్రాక్ పై వెళ్తున్న అర్చన ఎక్స్ ప్రెస్ రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయాయి. ఈ విషయాన్ని లోకో ఫైలెట్ తో సహా ఎవరు గుర్తించలేదు. అలా విడిపోయిన తరువాత దాదాపు 3 కిలోమీటర్ల వరకు ఇంజన్ లేని బోగీలు, అలానే అందులో ప్రయాణించాయి.
పంజాబ్‌లోని ఖన్నాలో పాట్నా నుంచి -జమ్మూ తావికి అర్చన ఎక్స్‌ప్రెస్ రైలు 12355 వెళ్తోంది. ఈ క్రమంలోనే కోచ్‌లు ఇంజన్ విడిపోయాయి. రైలులో ఉన్న ప్యాసెంజర్లకు కూడా ఈ విషయం తెలియదు. తాము ఉన్న బోగీలకు ఇంజిన్ లేదని తెలిసిన వెంటనే ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అంతేకాక అదే ట్రాక్ పై వేరే ట్రైన్ వస్తాదేమో అనే భయంతో బోగీలు ఆగగానే దిగి పరుగులు పెట్టారు. ఇంజిన్ లేని బోగీలను గుర్తించిన కీమాన్ వెంటనే అలారం మోగించాడు. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది బోగీలు లేకుండా వెళ్తున్న ఇంజిన్ కు సమాచారం ఇచ్చి నిలిపివేశారు. తర్వాత బోగీలను ఇంజిన్ కు అటాచ్ చేసి ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ వార్త విన్నవారంత షాక్ కు గురవ్వుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Train’s engine got detached and kept running for 3 km before a keyman spotted the engineless coaches and alerted the driver! pic.twitter.com/tFkH6sUQ4y
— Cow Momma (@Cow__Momma) May 6, 2024