iDreamPost
android-app
ios-app

సైనిక్‌ స్కూళ్లలో ప్రవేశాలు.. మీ పిల్లల్ని చేర్పించాలనుకుంటే త్వరగా అప్లై చేసుకోండి

తమ పిల్లల్ని సైన్యంల చేర్పించాలనుకునే తల్లిదండ్రులకు, సైనికులు కావాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. దేశంలో ఉన్న సైనిక పాఠశాలల్లో ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.

తమ పిల్లల్ని సైన్యంల చేర్పించాలనుకునే తల్లిదండ్రులకు, సైనికులు కావాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. దేశంలో ఉన్న సైనిక పాఠశాలల్లో ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.

సైనిక్‌ స్కూళ్లలో ప్రవేశాలు.. మీ పిల్లల్ని చేర్పించాలనుకుంటే త్వరగా అప్లై చేసుకోండి

పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని ప్రజా కవి కాళోజీ అన్నారు. దేశం కోసం, సమాజం కోసం పాటుపడే వారికి ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. ఈ నేపథ్యంలో దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న సైనికులు వారి ప్రాణాలను పణంగా పెట్టి దేశ సంపదను, పౌరులను రక్షిస్తున్నారు. సోల్జర్స్ కి సమాజంలో ఎంతటి పేరు ప్రఖ్యాతలు ఉంటాయో వేరే చెప్పక్కర్లేదు. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న రక్షణ రంగంలో మీ పిల్లల్ని సైనికులుగా చూసే అవకాశం వచ్చింది. దేశ రక్షణ రంగంలో పనిచేయాలని కలలుగనే విద్యార్థులకు ఇదొక గోల్డెన్ ఛాన్స్. దేశంలో ఉన్న సైనిక పాఠశాలల్లో ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి కలిగిన వారు డిసెంబర్‌ 16లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

దేశంలోని సైనిక పాఠశాలల్లో ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులకు చివరి తేదీ దగ్గరపడుతోంది. త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్​కు అవసరమైన అధికారులను స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే రెడీ చేసే లక్ష్యంతో.. సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే ఎడ్యుకేషన్ ఇయర్ (2024-25)లో ఆరో క్లాస్, తొమ్మిదో క్లాస్​లో ప్రవేశాలకు ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఎగ్జామ్​ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించనుంది. దేశంలోని 33 సైనిక స్కూళ్లలో 6, 9 క్లాసులకు.. కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలిపిన 19 కొత్త సైనిక స్కూళ్లల్లో నెక్స్ట్ ఇయర్ నుంచే ఈ ఎగ్జామ్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు.

In Sainik schools admissions open

 

సైనిక్ స్కూల్స్ నోటిఫికేషన్​ ముఖ్యాంశాలు:

 

  • ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ డిసెంబర్ 16వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు https://aissee.ntaonline.in/ అప్లయ్ చేసుకోవచ్చు.
  • సైనిక్ స్కూల్స్ అన్నీ కూడా సీబీఎస్​ఈ అనుబంధ ఇంగ్లిష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలలే. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నేవీ అకాడమీతో పాటు ఇతర ట్రైనింగ్ అకాడమీస్​కు ఇక్కడ క్యాడెట్లను రెడీ చేస్తారు.
  • ఎంట్రన్స్ ఎగ్జామ్ జనవరి 21 (ఆదివారం)న నిర్వహిస్తారు. పెన్ను, పేపర్ (ఓఎంఆర్ షీట్) పద్ధతిలోనే పరీక్ష ఉంటుంది. ఇందులో అన్నీ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ఈ ఎగ్జామ్​ను దేశవ్యాప్తంగా 186 టౌన్స్/సిటీస్​లో నిర్వహిస్తారు.
  • ఆరో క్లాసుకు అప్లయ్ చేసుకొనే విద్యార్థులు మార్చి 31, 2024 నాటికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య ఉండాలి.
  • తొమ్మిదో క్లాసుకు దరఖాస్తు చేసుకొని అభ్యర్థుల వయసు 13 నుంచి 15 ఏళ్ల మధ్య ఉండాలి. ఎనిమిదో క్లాసులో పాసై ఉండాలి.
  • ఈ పరీక్షకు అప్లయ్ చేసుకొనే వారికి ఫీజ్ ఉంది. జనరల్, రక్షణ రంగంలో పనిచేస్తున్న వాళ్ల పిల్లలు, ఓబీసీలు (నాన్ క్రిమీలేయర్), ఎక్స్​ సర్వీస్​మెన్ పిల్లలకు రూ.650, ఎస్సీ/ఎస్టీలకు రూ.500 చొప్పున ఫీజును నిర్ణయించారు.