iDreamPost
android-app
ios-app

ఈ క్యాంటీన్‌లో ఏ వస్తువైనా రూ.11 మాత్రమే! మాములు ఆఫర్ కాదిది!

మీరు ఏవైనా వస్తువులు కొనాలనుకుంటే మీకో మంచి ఆఫర్ అదిస్తోంది ఆ క్యాంటీన్. ఏ వస్తువు కొన్నా కేవలం రూ. 11 మాత్రమే. ఇంతకీ ఆ క్యాంటీన్ ఎక్కడుందంటే?

మీరు ఏవైనా వస్తువులు కొనాలనుకుంటే మీకో మంచి ఆఫర్ అదిస్తోంది ఆ క్యాంటీన్. ఏ వస్తువు కొన్నా కేవలం రూ. 11 మాత్రమే. ఇంతకీ ఆ క్యాంటీన్ ఎక్కడుందంటే?

ఈ క్యాంటీన్‌లో ఏ వస్తువైనా రూ.11 మాత్రమే! మాములు ఆఫర్ కాదిది!

ఏవైనా వస్తువులు కొనాలనుకుంటే మార్ట్స్, షాపింగ్ మాల్స్, స్మార్ట్ బజార్ లను వినియోగదారులు సందర్శిస్తుంటారు. మరికొంతమంది ఆన్ లైన్ లో బుక్ చేసుకుని ఇంటికే తెప్పించుకుంటుంటారు. ఇంట్లోకి అవసరమైన వస్తువుల దగ్గర్నుంచి బట్టలు, ఆటబొమ్మలు వంటివి ఆన్ లైన్ లో అయినా, షాపుల్లో అయినా ధరలు కనీసం ఓ 50 నుంచి 100 రూపాయల మధ్య మొదలవుతాయి. ఇంట్లోకి అవసరమైన వస్తువులు కాబట్టి ధర ఎంతున్నా కూడా కొనకుండా ఉండలేరు. మరి అవే వస్తువులు కేవలం రూ. 11 కే వస్తున్నాయని తెలిస్తే కొనకుండా ఊరుకుంటారా? ఓ క్యాంటీన్ లో ఏ వస్తువైన కేవలం రూ. 11కే లభ్యమవుతోంది. ఇంతకీ ఆ క్యాంటీన్ ఎక్కడుందంటే..

మీరు ఏవైనా వస్తువులు కొనాలని భావిస్తే ఆ క్యాంటీన్ కు వెళ్లండి. అక్కడ ఏం కావాలన్నా రూ. 11కే దొరుకుతాయి. బట్టల నుంచి మందులు, కిరాణా సామాన్లు, రేషన్, చెప్పులు, పిల్లల ఆటబొమ్మలు ఏవైనా రూ. 11 కే లభిస్తాయి. అయితే ఈ సౌలభ్యం అందరికీ కాదు. కేవలం పేదలకు మాత్రమే. ఆ క్యాంటీనే ఆఖ్రీ ఉమీద్ సంక్షేమ సంఘం. దీన్ని లాస్ట్‌ హోప్‌ సంస్థ నిర్వహిస్తోంది. పంజాబ్ కు చెందిన ఈ క్యాంటీన్ లో ఏం కావాలన్నా రూ. 11కే కొనుగోలు చేమొచ్చు. అలాగే మధ్యాహ్నం వేళ భోజనం కూడా అందిస్తామంటున్నారు నిర్వాహకుడు జతీందర్. మంచి వంటకాలతో పేదల కడుపు నింపుతున్నారు.

దీనిపై జతీందర్ మాట్లాడుతూ.. ఈ క్యాంటీన్ మొదలు పెట్టినప్పుడు 11 మంది సభ్యులు ఉండేవారు. ఇప్పుడు 1400 వాలంటీర్లు 1000కి పైగా కుటుంబాల సాయంతో ఈ క్యాంటీన్ రన్ అవుతోంది. ప్రజలు వాడకుండా వదిలేసిన పాత వస్తువులను ఇక్కడికి తీసుకొచ్చి అందిస్తారు. వాటిని శుభ్రపరిచి పేదలకు రూ. 11 కే అందిస్తామంటున్నారు. దీంతో పాటు డొనేషన్ బాక్స్ లో వచ్చిన నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అంబులెన్స్ సేవలు కూడా రూ. 11 కే అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా విజ్రంభన సమయంలో 8 వందలకు పైగా మృతులకు దహన సంస్కారాలు నిర్వహించామని జతీందర్ తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి