Vande Bharat Trains: మరో 10 వందే భారత్ రైళ్లు లాంచ్! ఈసారి ఈ సౌకర్యాలు కూడా…

Vande Bharat Trains: రైల్వే వ్యవస్థని అభివృద్ధి చెయ్యడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తుంది. వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం ఇచ్చేందుకు ఈ సరికొత్త రైళ్లను తీసుకు వస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఎక్స్ ప్రెస్ ట్రైన్స్, సూపర్ ఫాస్ట్ రైళ్లు, అలాగే వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లను తీసుకు వచ్చింది.

Vande Bharat Trains: రైల్వే వ్యవస్థని అభివృద్ధి చెయ్యడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తుంది. వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం ఇచ్చేందుకు ఈ సరికొత్త రైళ్లను తీసుకు వస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఎక్స్ ప్రెస్ ట్రైన్స్, సూపర్ ఫాస్ట్ రైళ్లు, అలాగే వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లను తీసుకు వచ్చింది.

దేశంలో రైల్వే వ్యవస్థని అభివృద్ధి చెయ్యడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తుంది. ప్రజల కోసం సురక్షితమైన, వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం ఇచ్చేందుకు ఈ సరికొత్త రైళ్లను తీసుకు వస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఎక్స్ ప్రెస్ ట్రైన్స్, సూపర్ ఫాస్ట్ రైళ్లు, అలాగే వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లను తీసుకు వచ్చింది కేంద్రం. త్వరలో మెరపు వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైళ్ళను కూడా తీసుకు రాబోతుంది. ఇక ప్రస్తుతం దేశంలో అత్యంత వేగంగా, ఎంతో సురక్షితంగా ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి ఈ వందే భారత్ రైళ్లు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రైళ్ళు నడుస్తున్నాయి. ఇక రాను రాను ఈ ట్రైన్లకు జనాల నుంచి బాగా ఆదరణ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో మరిన్ని రైళ్లను ప్రవేశపెడుతుంది కేంద్ర ప్రభుత్వం.

ఇక తాజాగా ఇండియాలో మరో 10 కొత్త వందే భారత్ రైళ్లు రాబోతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కొన్ని వందే భారత్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.ఇక తాజాగా ఈ నెలలోనే మరో 10 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. సెప్టెంబర్ 15న ప్రధాని మోడీ ఈ రైళ్ళను ప్రారంభించనున్నారు..ఇక రాబోయే ఈ రైళ్ల విషయానికి వస్తే.. టాటానగర్-పాట్నా, వారణాసి-దియోఘర్, రాంచీ-గొడ్డ, దుర్గ్-విశాఖపట్నం, టాటానగర్-బెర్హంపూర్ (ఒడిశా), రూర్కెలా-హౌరా, హౌరా-గయా, ఆగ్రా-వారణాసితో సహా కీలక మార్గాలలో ప్రయాణించనున్నాయి. ఆ మార్గాల్లో కనెక్టివిటీని ఇంకా విస్తరింపజేయనున్నాయి.

రైల్వే వ్యవస్థను ఇంకా త్వరగా అప్డేట్ చెయ్యాలనే ఉద్దేశ్యంలో భాగంగా ఈ కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నారు. ఈ రైళ్లు హై-స్పీడ్ పవర్స్ తో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇంకా అంతేకాకుండా ఈ రైళ్ళలో ఎన్నో సౌకర్యాలని ఏర్పటు చేశారు. ప్రయాణికుల కోసం ప్రతి సీటు దగ్గర మొబైల్ ఛార్జింగ్ సాకెట్ని ఫిక్స్ చేశారు.. ఈ మధ్యనే ప్రధాని మోడీ మూడు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. మీరట్ నుంచి లక్నో, మధురై నుంచి బెంగళూరు, చెన్నై నుంచి నాగర్‌ కోయిల్‌లను కలుపుతూ ఆ రైళ్లని ప్రారంభించారు. ఇంకా అలాగే ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలను కలుపుతూ ఈ రైళ్లు ప్రారంభమయ్యాయి.

Show comments