Keerthi
ఇతరులకు సహాయం చేయాలనే గొప్ప ఆలోచనతో ఓ మంచి మనసున్న వ్యక్తి కూలీ పనిచేస్తు తన గ్రామంలో చదువుకున్న పిల్లలకు చేసిన సహాయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇతరులకు సహాయం చేయాలనే గొప్ప ఆలోచనతో ఓ మంచి మనసున్న వ్యక్తి కూలీ పనిచేస్తు తన గ్రామంలో చదువుకున్న పిల్లలకు చేసిన సహాయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Keerthi
ప్రస్తుతం సమాజంలో చాలామంది కోట్లు కలిగివున్నా.. ఇతరుల కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టడం కానీ, సాయం చేయడానకి కానీ వెనుకాడతారు. ఎందుకంటే.. ఈ డబ్బు మోజులో ఉన్నవారు సంపాదిస్తున్నా మరింత సంపాదించేయాలని అత్యశ తప్ప పరులకు మేలు చేయాలని కళలో కూడా అనుకోరు. కానీ, కొంతమంది మాత్రం తమ స్తోమత తగ్గట్టుగా చిన్న చిన్న సహాయాలను చేస్తూ.. సమాజానికి ఉపకారిగా ఉంటారు. అలాంటి వారు తమ ఆర్థిక స్థితి అంతంత మాత్రమే ఉన్నా సాయం చేయడానికి ముందుకు వచ్చి కష్టల్లో ఉన్నవారిని అదుకుంటారు. అయితే ఉన్నవాడు సమాజం కోసం ఉపకారం చేసిన, ఎదుటవారిని సాయం చేసిన ఒక అర్ధం ఉంటుంది. ఎందుకంటే వాడి దగ్గర కోట్లలో డబ్బు ఉంటుంది. కానీ ఏమి లేనివాడు, కూలీ పని చేసినవాడు సమాజం కోసం ఆలోచించి సాయం చేయడమంటే అది చిన్న మాట కాదు. తాజాగా అలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది.
ఇతరులకు సహాయం చేయాలనే గొప్ప ఆలోచనతో ఓ మంచి మనసున్న వ్యక్తి 11 మంది విద్యార్థులకు సైకిళ్లు కొనిచ్చి తన గొప్ప మనసును చాటుకున్నాడు. కానీ, అతనొక రోజువారి కూలీ చేసుకొని వచ్చిన డబ్బులతో ఆ సైకిల్ కొనడం గమన్హారం. కాగా, అతడు తన సంపాదనను మొత్తం సమాజహితం కోసం ఉపయోగించాలనే ఆలోచనే అతడిని ధనవంతుడిని చేసింది. అసలు మనసులో ఎదుటవారికి సాయం చేయాలని ఆలోచన ఉండాలే కానీ వాడు కోటీశ్వరుడే కానక్కర్లేదని కర్ణాటకలోని అంజనేయ యాదవ్ అనే యువకుడు మరోమారు ఆదర్శంగా నిలిచి రుజువు చేశాడు. ఇతడు కర్ణాటకలోని రాయచూర్ జిల్లా దేవదుర్గకు చెందినవాడు. కాగా, రోజు తన గ్రామం నుంచి 3 – 4 కిలోమీటర్లు దూరంలోని పాఠశాలకు నడిచివెళ్లే విద్యార్థులకు 11 సైకిళ్లు కొనిచ్చాడు. అయితే ఆ సైకిళ్లు కొనడానికి అతడు రోజువారీ కూలిపనులు చేసుకుంటూ వచ్చిన డబ్బులో రూ.40 వేలు పొదుపు చేసి ఆ విద్యార్థులకు సాయం చేశాడు. యాదవ్ గ్రామం మల్కందిన్నిలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. దీంతో హైస్కూల్ కోసం విద్యార్థులు సుమారు 4 కి.మీ.ల దూరంలో ఉన్న యమనూరుకు వెళ్లాలి. రోజూ విద్యార్థులు అంత దూరం నడిచి వెళ్తుండటాన్ని గమనించిన ఆంజనేయ యాదవ్.. వారి కోసం ఏదైనా చేయాలని అనుకున్నాడు. అందుకే తన కూలి డబ్బుల్లో కొంత మొత్తాన్ని దాచిపెట్టి వారికి సైకిళ్లను కొని అందజేశాడు.
ఇక రవాణా సౌకర్యం సరిగ్గా లేని గ్రామాల నుంచి గ్రామాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలంటే విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా కొందరు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. కనుక అలా పిల్లల చదువు ఆగిపోకూడదని తాను సైకిళ్లు పంపిణీ చేశానని ఆ యువకుడు తెలిపాడు. అంతేకాకుండా.. పిల్లలకు సులభంగా విద్యను పొందేలా చేయడమే కాకుండా విద్యా కార్యక్రమాలకు సమాజం మద్దతు కూడా అవసరమని యాదవ్ సమాజానికి చాటిచెప్పారు. కాగా, యాదవ్ సహాయం దేశంలోని ఇప్పటికీ మారుమూల ప్రాంతాల పిల్లలకు విద్య చేరువకాలేదనే విషయాన్ని గుర్తుచేస్తోంది. మరి, ఒక కూలీ పని చేసుకున్న యువకుడు గ్రామంలో పిల్లల కోసం ఉన్నతంగా ఆలోచించి చేసిన సహాయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.