అనంత్ అంబానీ- రాధిక హనీమూన్ కోసం ఎక్కడికి వెళ్తున్నారంటే?

Anant Ambani Honeymoon Place: ప్రపంచంలోని అత్యంత కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ముగిశాయి. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం ఘనంగా జరిగింది. తాజాగా నూతన జంట హానీమూన్ వెళ్లే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.

Anant Ambani Honeymoon Place: ప్రపంచంలోని అత్యంత కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ముగిశాయి. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం ఘనంగా జరిగింది. తాజాగా నూతన జంట హానీమూన్ వెళ్లే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.

దేశమంతా మాట్లాడుకునేలా రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి జరిగింది. ప్రపంచంలోని సంపన్నుల్లో ఒకరైన ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీ దంపతులు, తమ ముద్దుల చిన్న కొడుకు పెళ్లిని ఎంతో గొప్పగా చేయాలని భావించి.. ప్రపంచం, దేశంలోని ప్రముఖులందరిని పిలిచి.. నః భూతో నః భవిష్యతీ అన్న రీతిలో చాలా ఘనంగా వివాహం జరిపించారు. కొన్ని నెలల నుంచి దేశవ్యాప్తంగా అంబానీ ఇంట పెళ్లి హాట్ టాపిక్ గా ఉంది. జూలై 12 వీరి వివాహం  జరిగింది. ఇప్పుడు అంబానీ కొత్త జంట హానీమూన్ కి ఎక్కడకి వెళ్తుందా అని అందరూ తెగ ఆసక్తగా చూస్తున్నారు. ఈక్రమంలోనే కొన్ని ప్రదేశాలు వెళ్లొచ్చని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రపంచంలోని అత్యంత కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ముగిశాయి. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం ఘనంగా జరిగింది. ప్రపంచంలోని అతిరథులందరూ ఈ వేడుకకు హాజరయ్యారు. దీంతో అనంత్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. జులై 12న అనంత్ రాధికతో కలిసి ఏడడుగులు వేశారు. పెళ్లి తర్వాత రోజు ‘శుభ్ ఆశీర్వాద్’ వేడుక, ఆదివారం జరిగిన ‘మంగల్ ఉత్సవ్’ కార్యక్రమాలతో పెళ్లి వేడుకలు పూర్తయ్యాయి.

ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంటూ మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వేడుకలు వైభంగా జరిగాయి. ఈ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌ వేడుకల్లో అన్నీ రంగాల్లో టాప్ పర్సన్ గెస్ట్ లుగా హాజరయ్యారు. ఇలా ప్రీవెడ్డింగ్ ను, పెళ్లిని ఎంతో అంగరంగ వైభవంగా జరిపిచారు. ఇదే సమంయలో అనంత్ అంబానీ, రాధికా మర్చట్ జంట హానిమూన్ కి సంబంధించి..పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని ప్రదేశాల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తోన్నాయి.

దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్. ఈ ప్రాంతానికి ఎక్కువ మంది వస్తుంటారు. ఈ పార్క్ ఆఫ్రికాలోని అతిపెద్ద గేమ్ రిజర్వరల్లో ఒకటి. అలానే స్విట్జర్లాండ్ అనేది ప్రతి హానీమూన్ కలల గమ్యస్థానంగా ఉంటుంది. ప్రకృతి అందాలతో ఈ ప్రాంతం అందరిని ఆకట్టుకుంటుంది. ఎక్కువ మంది..హనీమూన్ కి  ఈ ప్రదేశానికి వస్తుంటారు. అలానే హానీమూన్ కి సరైన ప్రదేశాల్లో  బ్రిటీష్ వర్జిన్ దీవులు ఒకటి. ఇక్కడ జంట రొమాంటిక్ సన్‌సెట్ క్రూయిజ్‌లు, బీచ్‌లో క్యాండిల్‌లైట్ డిన్నర్లు మరియు పాంపరింగ్ స్పా ట్రీట్‌మెంట్‌లను ఆస్వాదించవచ్చు.

కొత్తగా పెళ్లయిన  జంటలకు కోసం ఫిజీ ద్వీపం మనోహరమైన ఎంపికను అందిస్తుంది. తెల్లని ఇసుక బీచ్‌లు, మణి జలాలు మరియు పచ్చటి ఉష్ణమండల అడవులను కలిగి ఉన్న ఫిజీ ద్వీపం ప్రపంచంలోని అత్యుత్తమ హనీమూన్ గమ్యస్థానాలలో ఒకటి. బోరా బోరా ద్వీపం హనీమూన్‌లకు స్వర్గం, దాని మణి మడుగు, ఓవర్‌వాటర్ బంగ్లాలు మరియు పచ్చని ఉష్ణమండల అందాలకు ప్రసిద్ధి చెందింది. మరి.. అనంత్ అంబానీ జంట హానీమూన్ కి ఏ ప్రాంతంకి  వెళ్తుందో తెలియాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

Show comments