P Krishna
Anant Ambani Wedding: ప్రపంచ కుబేరుల్లో ఒకరు ముఖేష్ అంబాని. జులై 12న ముఖేష్ అంబాని దంపతుల తనయుడు అనంత్ అంబానీ - రాధిక మర్చెంట్ వివాహం అంగరంగ వైభవంగా జరగబోతుంది. అంబానీ ఇంట పెళ్లంటే పెళ్లి పత్రిక నుంచి అతిధులకు వడ్డించే భోజనాల వరకు అన్నీ ప్రత్యేకమే..
Anant Ambani Wedding: ప్రపంచ కుబేరుల్లో ఒకరు ముఖేష్ అంబాని. జులై 12న ముఖేష్ అంబాని దంపతుల తనయుడు అనంత్ అంబానీ - రాధిక మర్చెంట్ వివాహం అంగరంగ వైభవంగా జరగబోతుంది. అంబానీ ఇంట పెళ్లంటే పెళ్లి పత్రిక నుంచి అతిధులకు వడ్డించే భోజనాల వరకు అన్నీ ప్రత్యేకమే..
P Krishna
ఆసియాలోని సంపన్నుల్లో ఒకరు ముఖేష్ అంబాని ఒకరు. ముఖేష్ అంబానీ-నీతా అంబానీల ముద్దుల తనయుడు అనంత్ అంబానీ- రాధిక మర్చెంట్ వివాహం జులై 12న జరగనుంది. ఇప్పటికే నిశ్చితార్థ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా అంబానీ ఇంట జరగబోయే పెళ్లి వేడుకల గురించే టాక్ వినిపిస్తుంది. ఆంటిలియాలో అనంత్ అబానీ- రాధిక మర్చంట్ పెళ్లికి సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. ఈ పెళ్లి వేడుకలో కనీ వినీ ఎరుగని రీతిలో వంటకాలు ఉండబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. తాజాగా మెనూకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
అపర కుభేరుడు ముఖేష్ – నీతా అంబానీల తనయుడు అనంత్ అంబానీ – రాధిక మర్చెంట్ ల పెళ్లి తేదీ దగ్గరలోనే ఉది. సోషల్ మీడియాలో ఈ పెళ్లికి సంబంధించిన వార్తల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మార్చి నెలలో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఎంత గ్రాండ్ గా జరిగాయో అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమంలో హాజరైన అతిథులకు దాదాపు 2,500 రకాల వంటకాలతో విందు భోజనాలు పెట్టారు. ప్రీ వెండింగ్ ఈవెంట్ కే ఇన్ని రకాల వెరైటీలు వడ్డిస్తే.. ఇక జులై 12 న పెళ్లి విందు ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ చర్చలు మొదలయ్యాయి. తాజాగా మెనూలో కొన్ని వంటకాల గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.నీతా అంబాని ఆర్డర్ మేరకు వారణాసిలో ఫేమస్ కాశి ఛాట్ బండార్ వ్యాపారులు పెళ్లి విందు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇక సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం పెళ్లి విందులో ప్రత్యేక వంటకాలు.. ఫాలుదా, కుల్ఫీ, టమాటా ఛాట్, టిక్కీ, చన కచోరి, దహి పూరి, బనారస్ ఛాట్, పాలక్ చాట్ మరెన్నో ఐటమ్స్ ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్లి విందులో స్పెషల్ ఐటమ్స్ స్వయంగా నీతా అంబానీ ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని కాశీ చాట్ భండార్ యజమాని కేసరి తెలిపారు. ముంబాయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో మూడు రోజుల పాటు ఈ పెళ్లి వేడుకలు జరగనున్నాయి. జులై 12న శుభ్ వివాహ్, 13న శుభ్ ఆశీర్వాద్, 14 న మంగళ్ ఉత్సవ్ తో పెళ్లి తంతు ముగియనుంది. ఈ వేడుకకు ఇతర దేశాల నుంచి ప్రముఖులతో పాటు పలువురు సెలబ్రెటీలు, రాజకీ, క్రీడా రంగానికి చెందినవారు హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది.