iDreamPost
android-app
ios-app

పెళ్లి తరువాత తొలిసారి బయటకి అనంత్‌ – రాధికా జంట! ఆ దేశంలో చిల్ అవుతూ!

  • Published Jul 31, 2024 | 4:21 PM Updated Updated Jul 31, 2024 | 4:21 PM

Anant Ambani and Radhika Merchant: ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ 2024 క్రీడలు ఎంతో ఉత్సాహంగా సాగుతున్నాయి. వివిధ దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులు పోటీల్లో తమ సత్తా చాటుతున్నారు.పారిస్ లో ప్రస్తుతం అంబానీ కుటుంబ సభ్యులు సందడి చేస్తున్నారు.

Anant Ambani and Radhika Merchant: ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ 2024 క్రీడలు ఎంతో ఉత్సాహంగా సాగుతున్నాయి. వివిధ దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులు పోటీల్లో తమ సత్తా చాటుతున్నారు.పారిస్ లో ప్రస్తుతం అంబానీ కుటుంబ సభ్యులు సందడి చేస్తున్నారు.

  • Published Jul 31, 2024 | 4:21 PMUpdated Jul 31, 2024 | 4:21 PM
పెళ్లి తరువాత తొలిసారి బయటకి అనంత్‌ – రాధికా జంట! ఆ దేశంలో చిల్ అవుతూ!

2024 ఒలింపిక్ క్రీడలు పారిస్ లో ప్రారంభం అయ్యాయి. వివిధ దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులు పోటీల్లో ప్రత్యర్థులతో తలపడుతూ తమ సత్తా చాటుతున్నారు. ఈనెల 12న ముఖేశ్‌ అంబానీ- నీతా అంబానీ ముద్దుల తనయుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు జరిగిన వీరి వివాహమహోత్సవానికి దేశ విదేశాల నుంచి సెలబ్రెటీలు వచ్చి సందడి చేశారు.ముఖేశ్ అంబానీ తన కొడుకు పెళ్లి కోసం ఏకంగా ఆరు వేల కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి. పెళ్లైన తర్వాత అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ తొలిసారిగా బయటకు వచ్చి ఆ దేశంలో చిల్ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే..

జులై 12న అనంత్ అంబానీ- రాధికల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ముంబాయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ సెంటర్ లో ఈ జంట వివాహమహోత్సం మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. వివాహ వేడుకలు పూర్తయిన తర్వాత అంబానీ ఫ్యామిలీ పారిస్ వెళ్లారు. నీతా అంబానీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిలీ (IOC) సభ్యురాలు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పారిస్ కి ముఖేశ్ అంబానీ-నీతా అంబానీతో పాటు వారి కూతురు ఈషా అంబానీ, కొత్త జంట అనంత్ – రాధిక లు పారిస్ వెళ్లారు. పెళ్లైన తర్వాత తొలిసారిగా కొత్త జంట పారిస్ లో చిల్ అవుతున్నారు.

పారిస్ లో రిలయన్స్ ఫౌండేషన్ సంస్థకు చెందిన స్వదేశ్ సెంటర్ ను అంబానీ కుటుంబ సభ్యులు గేమ్స్ వీక్షించేందుకు ప్రత్యేక ప్రాంగణం ఏర్పాటు చేశారు. పారిస్ ఒలింపిక్స్ లో న్న ఇండియా హౌజ్ వద్ద శనివారం నీతా అంబాన్ని దీన్ని ప్రారంభించారు. ఇక్కడ భారతీయ టెక్స్ టైల్స్, హ్యాండీ క్రాప్ట్ కు చెందిన వస్తువులు ప్రదర్శించబడుతున్నాయి.మంగళవారం ప్యారిస్‌లోని ఏర్పాటు చేసిన ఇండియా హౌస్‌లో నూతన వధూవరులు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ కలర్ ఫుల్ డ్రెస్ తో సందడి చేశారు.పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశానికి రెండవ పతకాన్ని గెలుచుకున్న మను భాకర్, సరబ్జోత్ సింగ్ అభినందించారు. ప్రస్తుతం అనంత్ – రాధిక‌లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio