iDreamPost
android-app
ios-app

రాధికా మర్చంట్ కి ఖరీదైన డైమండ్ నెక్లెస్ బహుకరించిన నీతా అంబానీ

  • Published Aug 20, 2024 | 4:30 PM Updated Updated Aug 20, 2024 | 4:33 PM

Nita Ambani Gifts Crore Valued Diamond Necklace To Radhika Merchant: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వీరి వేడుక గురించి దేశమంతా మాట్లాడుకుంది. అయితే మరోసారి ఇప్పుడు అంబానీ కుటుంబం గురించి ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. నీతా అంబానీ తన కొత్త కోడలికి బహుకరించిన డైమండ్ నెక్లెస్ కి సంబంధించిన వార్తలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి.

Nita Ambani Gifts Crore Valued Diamond Necklace To Radhika Merchant: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వీరి వేడుక గురించి దేశమంతా మాట్లాడుకుంది. అయితే మరోసారి ఇప్పుడు అంబానీ కుటుంబం గురించి ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. నీతా అంబానీ తన కొత్త కోడలికి బహుకరించిన డైమండ్ నెక్లెస్ కి సంబంధించిన వార్తలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి.

  • Published Aug 20, 2024 | 4:30 PMUpdated Aug 20, 2024 | 4:33 PM
రాధికా మర్చంట్ కి ఖరీదైన డైమండ్ నెక్లెస్ బహుకరించిన నీతా అంబానీ

ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ వేడుక జూలై 12న అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు, క్రీడాకారుల సమక్షంలో గుజరాత్ లోని జామ్ నగర్ లో మూడు రోజుల పాటు ఘనంగా ఈ వేడుకలు జరిగాయి. దేశ విదేశాల నుంచి అతిథులు వచ్చారు. అయితే పెళ్లి అన్నాక నూతన దంపతులకు బహుమతులు ఇవ్వడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. బంధువులు, స్నేహితులు, అయినోళ్లు బహుమతులు ఇచ్చినప్పుడు అత్తింటి వాళ్ళు బహుమతులు ఇవ్వకపోతే ఎలా? అందులోనూ అంబానీ కోడలు అంటే మినిమమ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి కదా. తన కోడలికి ఊహించని విధంగా అత్యంత ఖరీదైన బహుమతి ఇచ్చారు ముకేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు. కొడుకు, కోడలి కోసం దుబాయ్ లోని అత్యంత ఖరీదైన, విలాసవంతమైన వందల కోట్లు విలువ చేసే లగ్జరీ ఇంటిని బహుమతిగా ఇచ్చారు.

నిజానికి 2022 ఏప్రిల్ నెలలోనే ముకేశ్ అంబానీ దంపతులు ఈ లగ్జరీ హౌజ్ ని కొనుగోలు చేశారు. పెళ్లి నాటికి దాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్ది నూతన దంపతులకు బహుకరించారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల కోసం దుబాయ్ లోని పామ్ జుమేరియా ఐలాండ్ లో సీ ఫేసింగ్ లో విలాసవంతమైన మ్యాన్షన్ ని కొనుగోలు చేసి హెడ్ లైన్స్ లో నిలిచారు. ఈ మ్యాన్షన్ 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో 10 బెడ్ రూమ్స్ ఉంటాయి. అంతేకాదు 70 మీటర్లు విస్తరించి ఉన్న ఒక ప్రైవేట్ బీచ్ కూడా ఉంది. అయితేఈ విలాసవంతమైన ఇంటి విలువ 640 కోట్లు ఉంటుందని సమాచారం. దుబాయ్ లోని అత్యంత ఖరీదైన ప్రాపర్టీగా ఈ మ్యాన్షన్ ఉండడం గమనార్హం.

ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులు కొడుకు, కోడలు కోసం ఇచ్చిన అత్యంత ఖరీదైన బహుమతి ఇదే. ఏకంగా 640 కోట్ల విలువ చేసే విలాసవంతమైన ఇంటిని బహుకరించారు. ఇప్పుడు ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరోవైపు రాధికా మర్చంట్ కూడా తన కోడలు రాధికా మర్చంట్ కోసం అత్యంత విలువైన బహుమతిని ఇచ్చారు. రాధికా మర్చంట్ తో నీతా అంబానీ ఎంత సన్నిహితంగా ఉంటారో తెలిసిందే. ఆమె తన కోడలి కోసం ముత్యాలు, వజ్రాలతో పొదిగిన నెక్లెస్ ని బహుకరించిన సంగతి తెలిసిందే. జూలై 2022లోనే ఈ డైమండ్ ని బహుకరించారు. రాధికా మర్చంట్ బంగారు లెహెంగా ధరించి వజ్రాల నెక్లెస్ తో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ నెక్లెస్ ఖరీదు ఎంత ఉంటుందనేది తెలియదు కానీ చాలా ఖరీదు ఉంటుందని తెలుస్తుంది.

ఇదే సమయంలో నీతా అంబానీ తన పెద్ద కోడలు శ్లోకా అంబానీకి ఇచ్చిన ఖరీదైన వజ్రాల హారం గురించి కూడా ఇప్పుడు చర్చ నడుస్తోంది. శ్లోకా పెళ్లి నాడు ఆమెకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రాల హారాన్ని బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తుంది. దీని ఖరీదు ఏకంగా 451 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. 407.48 క్యారెట్ల పసుపు వజ్రాలతో పొదగబడి ఉంటుంది. ఈ మొత్తం డైమండ్ సెట్ 18 క్యారెట్ల గోల్డ్ చైన్ లో ఉంచబడింది. తాజాగా ఇప్పుడు రాధికా మర్చంట్ కి కూడా ఇంతకంటే ఖరీదైన డైమండ్ నెక్లెస్ ని బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ బహుమతితో నీతా అంబానీ తన కోడళ్ల విషయంలో ఎంత ప్రేమగా ఉంటారో అనేది తెలిసింది. కోడళ్లను తమ కూతుర్లుగా ఎంత ప్రత్యేకంగా చూస్తారో అనడానికి ఈ ఖరీదైన బహుమతులే నిదర్శనం. నీతా అంబానీ తన కోడళ్ల పట్ల చూపే ప్రేమ ఎంతోమంది అత్తలకు ఆదర్శం అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet