iDreamPost
android-app
ios-app

ఇండియాలో ముగిసిన అనంత్- రాధికల పెళ్లి వేడుకలు.. ఇక లండన్‌లో..!

ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ, నీతాల కుమారుడు అనంత్ అంబానీ- తన స్నేహితురాలు రాధిక మర్చంట్ మెడలో జులై 12న మూడు ముళ్లు వేశాడు. ఈ వేడుకలు మూడు రోజుల పాటు జరిగాయి. ఇప్పుడు ఇండియాలో ముగిసిన వేడుకలు.. లండన్ లో మొదలు కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ, నీతాల కుమారుడు అనంత్ అంబానీ- తన స్నేహితురాలు రాధిక మర్చంట్ మెడలో జులై 12న మూడు ముళ్లు వేశాడు. ఈ వేడుకలు మూడు రోజుల పాటు జరిగాయి. ఇప్పుడు ఇండియాలో ముగిసిన వేడుకలు.. లండన్ లో మొదలు కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇండియాలో ముగిసిన అనంత్- రాధికల పెళ్లి వేడుకలు.. ఇక లండన్‌లో..!

ఆసియాలోనే దిగ్గజ వ్యాపార వేత్త.. అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల తనయుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి విదితమే. జూలై 12 నుండి జులై 14 వరకు ముంబయి నగరంలోని యాంటిలియా భవనం, జియో కన్వెన్షన్ సెంటర్‌లో జరిగాయి. రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగానికి చెందిన ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకు విచ్చేసి..సందడి చేశారు. అలాగే ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా అంబానీ ఇంట పెళ్లి వేడుకకు విచ్చేసి.. వారు ఇచ్చిన ఆతిధ్యాన్ని స్వీకరించారు. పెళ్లికి ముందు రెండు సార్లు  ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. జామ్ నగర్‌లో ప్రీ వెడ్డింగ్ వేడుక, ఇటలీ క్రూయిజ్ పార్టీతో మొదలైన వేడుకలు.. జులై 15తో ముగిశాయి.

ఇప్పుడు పోస్టు వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ వేడుకలు లండన్‌లో జరపనున్నట్లు సమాచారం. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు లండన్‌లో నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు. ఈ వేడుకల కోసం సెవెన్ స్టార్ హోటల్ బుక్ చేశారట. స్టోక్ పార్క్ కంట్రీ క్లబ్ బుక్ చేసినట్లు తెలుస్తుంది. 2021లో కూడా ఈ స్టోక్ పార్క్ కంట్రీ క్లబ్‌ను రూ. 614 కోట్లకు అంబానీ కటుంబం కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ హోటల్ 300 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. సెప్టెంబర్ వరకు అంటే దాదాపు రెండు నెలల పాటు బుక్ చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రిన్స్ హ్యారీ, యుకే మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ వంటి ప్రముఖు వ్యక్తులు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రజలను ఈ హోటల్లోకి ప్రవేశించడం నిషేధించినట్లు తెలుస్తుంది.

దాదాపు 850 మంది గోల్ఫ్ క్లబ్ సభ్యులను కూడా రావొద్దని కోరినట్టు తెలుస్తుంది. అయితే అంబానీ కుటుంబం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అనంత్ అంబానీ ప్రముఖ వ్యాపార వేత్త వీరెన్ మర్చంట్, శైలా మర్చంట్ కుమార్తె, తన స్నేహితురాలు రాధిక మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేశాడు. పెళ్లి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ మొత్తం వివాహ తంతుకు ఈ కుటుంబం సుమారు 5 వేల కోట్లను ఖర్చు పెట్టిందన్న వార్తలు వినిపించాయి. అలాగే ఈ పెళ్లిపై కొందరు విమర్శలు గుప్పించారు. ఈ వివాహ వేడుకకు బాలీవుడ్, హాలీవుడ్ యాక్టర్సే కాకుండా సౌత్ ఇండస్ట్రీ నుండి కూడా పలువురు సెలబ్రిటీలు విచ్చేశారు. మహేష్ బాబు, రామ్ చరణ్, అఖిల్, సూర్య, యశ్, రష్మిక మందన్న, వెంకటేశ్, పృధ్వీరాజ్ సుకుమారన్, రాశి ఖన్నా తదితరులు హాజరయ్యారు. ఇక బాలీవుడ్ మొత్తం కదలి వెళ్లిన సంగతి విదితమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి