iDreamPost
android-app
ios-app

వీడియో: భయపడిన ఆనంద్ మహీంద్రా.. అక్కడ ఒక్క రాత్రి కూడా ఉండనంటూ..!

  • Author Soma Sekhar Published - 09:56 PM, Thu - 13 July 23
  • Author Soma Sekhar Published - 09:56 PM, Thu - 13 July 23
వీడియో: భయపడిన ఆనంద్ మహీంద్రా.. అక్కడ ఒక్క రాత్రి కూడా ఉండనంటూ..!

సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టీవ్ గా ఉండే పారిశ్రామిక వేత్త ఎవరు అంటే? చాలా మందికి వెంటనే మైండ్ లో ఓ పేరు గుర్తుకు వస్తుంది. ఆయన పేరే ‘ఆనంద్ మహీంద్రా’. దానికి కారణం ఎప్పటికప్పుడు దేశంలో, ప్రపంచంలో జరిగే ఆసక్తికరమైన విషయాలను సోషల్ మీడియా ద్వారా యువతకు చేరవేస్తుంటారు. ఇక నెటిజన్ల ప్రశ్నలకు ఎంతో ఓపికతో సమాధానాలు సైతం ఇస్తుంటారు ఆనంద్ మహీంద్రా. తాజాగా మరో వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియోను షేర్ చేస్తూ.. అక్కడ నేను ఒక్క రాత్రి కూడా గడపలేను అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. మరి ఆ వీడియో గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆనంద్ మహీంద్రా.. ఎప్పటికప్పుడు కొత్తకొత్త విషయాలను యంగ్ జనరేషన్ తో పంచుకుంటూ.. వారికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే పలు ఆసక్తికరమైన వీడియోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తుంటారు. తాజాగా మరో వీడియోను షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. ఆ వీడియోను చూసి ఆయన భయపడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు చూద్దాం. ఒక కొండ మీద రూమ్ నిర్మించారు. అది రూమ్ చాలా ట్రాన్స్ పరెంట్ గా ఉంది. కొండ అంచుకు ఆనుకుని ఉన్న గది కింద సపోర్ట్ గా ఏమీ లేదు. పైగా జోరుగా వానకురుస్తోంది. ఈ దృశ్యాం చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది.

అయితే ఆనంద్ మహీంద్రా మాత్రం ఆ రూమ్ ను చూసి భయపడినట్లు ఉన్నారు. అందుకే ఈ రూమ్ లో నేను ఒక్క రాత్రి ఉండగలనా అన్నది సందేహమే అంటూ పోస్ట్ చేశాడు. ఈ అందమైన డిజైన్ ను చూసి నేను ఆశ్చర్యపోయాను. కానీ భారీ వర్షం కారణంగా ఒక్క రాత్రి నేను ఈ గదిలో ఉండగలనా? అనేది మాత్రం కచ్చితంగా చెప్పలేను అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఈ ప్లేస్ ఎంతో బాగుందని, జీవితంలో ఒక్కసారైనా ఈ ప్లేస్ కు వెళ్లాలని కామెంట్స్ చేస్తున్నారు. మరి పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: కొడుకు క్రీజ్ లో ఉన్నా.. సచిన్ అవుటవ్వగానే ఛానల్ మార్చేసిన స్టార్ క్రికెటర్ పేరెంట్స్!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss