iDreamPost
android-app
ios-app

ఆ బుడతడు చెప్పింది చేస్తే మా కంపెనీ దివాలా తీస్తుంది: ఆనంద్ మహీంద్రా

  • Published Dec 25, 2023 | 1:09 PM Updated Updated Dec 25, 2023 | 1:09 PM

Anand Mahindra: ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా.. ఓబుడ్డోడి మాటలకు ఫిదా అయ్యారు. అంతేకాక ఆ పిల్లాడు చెప్పినట్లు చేస్తే.. తమ కంపెనీ దివాల తీస్తుందని ఫన్నీగా పోస్టు పెట్టారు. మరి.. ఆ వివరాలు ఏమిటంటే..

Anand Mahindra: ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా.. ఓబుడ్డోడి మాటలకు ఫిదా అయ్యారు. అంతేకాక ఆ పిల్లాడు చెప్పినట్లు చేస్తే.. తమ కంపెనీ దివాల తీస్తుందని ఫన్నీగా పోస్టు పెట్టారు. మరి.. ఆ వివరాలు ఏమిటంటే..

  • Published Dec 25, 2023 | 1:09 PMUpdated Dec 25, 2023 | 1:09 PM
ఆ బుడతడు చెప్పింది చేస్తే మా కంపెనీ దివాలా తీస్తుంది: ఆనంద్ మహీంద్రా

ఆనంద్ మహీంద్రా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయన వ్యాపార రంగంలో ఎంతో ఫేమస్. మహేంద్ర గ్రూప్ సంస్థల  అధినేతగా ఉంటూ.. వ్యాపార రంగంలో తనదైన మార్క్ చూపించారు. ఇక బిజినెస్ లో ఎంత ఫేమసో.. సోషల్ మీడియాలో కూడా ఆయన అంతే అంతే ఫేమస్. వివిధ అంశాలపై తనదైన శైలీలో ఆనంద్ మహీంద్ర స్పందిస్తుంటారు. అంతేకాక ప్రతిభ కలిగిన యువతను గుర్తించి.. వారి గురించి సోషల్ మీడియాలో ప్రస్తావిస్తుంటారు. తరచూ వినూత్నమైన పోస్టులు, ప్రశ్నలు, జవాబులతో ఆనంద్ మహీంద్రా వార్తల్లో ఉంటుంటారు. తాజాగా ఓ బుడ్డోడు మాట్లాడిన మాటలకు ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. పైగా ఆ పిల్లాడు చెప్పినట్లు చేస్తే తమ మహీంద్రా కంపెనీ దివాలా తీస్తుందని కూడా చెప్పుకొచ్చారు. ఇంతకు.. ఆ పిల్లాడు చెప్పిన మాటలు ఏమిటి?. ఆ వివరాలు తెలుసుకుందాం..

ఢిల్లీలోని నోయిడా ప్రాంతానికి చెందిన చీకు అనే చిన్న బుడతడు తన తండ్రితో  మహీంద్రా కారు గురించి మాట్లాడుతుంటాడు.  దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడమే కాకుండా.. చివరకు ఆనంద్ మహీంద్రా వద్దకు చేరింది. దీంతో మహీంద్రా కూడా ఆ బుడతడి మాటలకు చాలా సరదగా  సమాధానం ఇచ్చారు. మహీంద్రా థార్  అనే మోడల్ కారు చాలా ఫేమస్. దాని కోసం ఎంతో  మంది వేచి చూస్తారనే విషయం తెలిసిందే.

anand mahindar shockung tweet

 ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ఎక్స్ యూవీ 700 కారు ను థార్ గా పొరపడిన చీకూ అనే పిల్లవాడు.. ఓ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. రెండు ఒకటే అని భావించిన చీకూ.. ఎక్స్ యూవీ కారును కొందామని తన తండ్రిని అడగడం ఆ వీడియోలో మనకు కనిపిస్తోంది. ఎక్స్ యూవీ 700లో 700 ఉంది కాబట్టి దాని ధర రూ.700 అని చీకూ అనుకున్నాడు. దీంతో బయటకి వెళ్లినప్పుడు రూ.700తో ఎక్స్ యూవీ 700 అనే మోడల్ కారును కొనేద్దామని తన తండ్రితో అనడం ఆ వీడియోలో కనిపిస్తోంది. అయితే దానికి  సంబంధిచిన వీడియోను చీకూ తండ్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో క్షణాల్లో ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది.

ఆ బుడ్డోడు మాట్లాడిన మాట తీరు ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. పైగా ఆ బుడ్డోడి అమాయకత్వపు మాటలు మరింత ముద్దొస్తున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోను ఆనంద్‌ మహీంద్రాకు ఆయన స్నేహితుడు ఒకరు పంపించినట్లు మహీంద్రా తెలిపారు. ఆ వీడియోతోపాటు చీకూకు తీసిన మరికొన్ని వీడియోలు చూసిన తర్వాత తాను కూడా ఆ బుడతడిని ఇష్టపడడం మొదలుపెట్టినట్లు చెప్పారు. చీకూ చెప్పినట్లు థార్‌ను రూ.700కు అమ్మితే త్వరలోనే తమ కంపెనీ దివాలా తీస్తుందని ఫన్నీగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆనంద్ మహేంద్ర చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ రెండు ఫన్నీ ట్వీట్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobet güncel girişMadridbetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet