iDreamPost
android-app
ios-app

రైతన్నకు అవమానం.. షాపింగ్ మాల్ లోకి అనుమతించని సిబ్బంది.. ఎందుకంటే?

  • Published Jul 17, 2024 | 6:11 PMUpdated Jul 17, 2024 | 6:11 PM

ఇటీవల కాలంలో ఎదుట వ్యక్తి బట్టలు, ధనం బట్టి చాలామంది విలువనిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఈ మధ్య మెట్రో రైళ్లు, షాపింగ్ మాల్స్ కు కూడా మనిషి వేసుకునే బట్టల బట్టి వాళ్లని అనుమతించిన ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అచ్చం ఇలానే ధోతి వేసుకున్న ఓ రైతును షాపింగ్ మాల్ లోకి అనుమతివ్వకుండా సిబ్బంది అడ్డుకున్నారు. ఇంతకి ఎక్కడంటే..

ఇటీవల కాలంలో ఎదుట వ్యక్తి బట్టలు, ధనం బట్టి చాలామంది విలువనిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఈ మధ్య మెట్రో రైళ్లు, షాపింగ్ మాల్స్ కు కూడా మనిషి వేసుకునే బట్టల బట్టి వాళ్లని అనుమతించిన ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అచ్చం ఇలానే ధోతి వేసుకున్న ఓ రైతును షాపింగ్ మాల్ లోకి అనుమతివ్వకుండా సిబ్బంది అడ్డుకున్నారు. ఇంతకి ఎక్కడంటే..

  • Published Jul 17, 2024 | 6:11 PMUpdated Jul 17, 2024 | 6:11 PM
రైతన్నకు అవమానం.. షాపింగ్ మాల్ లోకి అనుమతించని సిబ్బంది.. ఎందుకంటే?

ప్రస్తుత సమాజంలో చాలామంది ఎదుట వ్యక్తుల పట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఎదుట వ్యక్తి కట్టుకున్న బట్టలు దగ్గర నుంచి వారి దగ్గర ఉండే ధనం బట్టి వారికి విలువ ఇస్తున్నారు. అయితే ఇలా ఆలోచించిన వారిలో చదువుకున్న ముర్ఖులు కూడా ఉండటం గమన్హారం. అసలు చదువుకొని ఉన్నత హోదాలో ఉన్నవారు సైతం లేని వారి పట్ల చులకనగా చూడటం, వారి కట్టుకున్న దుస్తులు బట్టి వారిని అవమానించడం చేస్తున్నారు. ఇక ఇవాన్ని చూస్తుంటే.. ఈరోజుల్లో డబ్బుకు, కట్టుకున్న బట్టకు ఉన్న విలువ మనిషికి లేదని అనిపిస్తుంది. ఎందుకంటే.. ఇటీవల కాలంలో.. మనిషి వేసుకున్న బట్టల బట్టి చాలామంది మెట్రో రైల్లలో, షాపింగ్ మాల్స్ లో అనుమతించకపోయినా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ క్రమంలోనే.. ఓ షాపింగ్ మాల్ లో ఒక పెద్దాయనను షాపింగ్ మాల్ లోకి అనుమతించకపోవడం తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. దీంతో ఆ పెద్దాయన కొడుకు ఈ విషయమై షాపింగ్ మాల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకి ఎక్కడంటే..

తాజాగా ఓ షాపింగ్ మాల్ సిబ్బంది  తీరు పై నెటిజన్స్ విమర్శలతో దుమ్మెత్తిపోశారు. కేవలం ధోతి ధరించాడన్నకారణంగా ఒక పెద్దాయనను షాపింగ్ మాల్ లోకి అనుమతించకపోవడం తీవ్ర సంచలనంగా మారింది. దీంతో ఆ పెద్దాయన కొడుకు ఈ విషయంపై షాపింగ్ మాల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన వీడియో ప్రస్తుతం సోష్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ అవమానకరమైన ఘటన బెంగళూరులోని జీటి మాల్ లో చోటు చేసుకుంది. ఇంతకి ఏ జరిగిందంటే.. ఉద్యోగ  రీత్యా బెంగళూరులో ఉంటున్న ఓ యువకుడు దగ్గరకు  రాకరాక తన తండ్రి వచ్చాడు. దీంతో తన తండ్రికి సీటి చూపించాలనే ఉద్దేశంతో జీటీ మాల్ కు తీసుకెళ్లాడు. అయితే ఆ జీటీ మాల్ లో తన తండ్రితో కలిసి సినిమా చూద్దామనుకున్నాడు. కానీ, ఊరి నుంచి వచ్చిన తన తండ్రికి బెంగళూరు జిటీ మాల్ సిబ్బంది అడ్డుకుని అవమానకరంగా ప్రవర్తించారు. ముఖ్యంగా మాల్ ఎంట్రన్స్ లోనే తండ్రీకొడుకులను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం గమన్హారం.

అయితే ఆ మాల్ లో ఉన్న మల్టీప్లెక్స్ లో సినిమా చూసేందుకు టికెట్లు కూడా బుక్ చేసుకున్నామని సెక్యూరిటీకి ఎంత చెప్పిన సిబ్బంది వినిపించుకోలేదు. ఇకపోతే ఎందుకు అనుమతించడం లేదని అడిగితే ధోతి ధరించి మాల్ లోకి రాకూడదని, వేరే దుస్తులు ధరించి వస్తే మాల్ కు అనుమతిస్తామని మాల్ సెక్యూరిటీ సిబ్బంది సమాధానం తెలిపారు. కానీ, చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చామని, అంత దూరం వెళ్లి మళ్లీ తిరిగి రావడం కష్టమని ఆ పెద్దాయనను అనుమాతించాలని మాల్ సిబ్బందీని బతిమాలినా పట్టించుకోలేదు. పైగా ధోతీ ధరించి వస్తే అనుమతించకూడదని మేనేజ్మెంట్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని మాల్ సూపర్వైజర్ చెప్పుకొచ్చాడు. ప్యాంట్ ధరిస్తేనే మాల్లోకి అనుమతిస్తామని సెక్యూరిటీ సిబ్బంది ఒకరు తేల్చి చెప్పారు.

 దీంతో ఆ పెద్దాయన కొడుకుకు కోపం వచ్చి  మాల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. తన తండ్రి ఒక రైతు అని, రైతులు అలాంటి దుస్తులు ధరించడంలో తప్పేం ఉందని నిలదీశాడు. దాదాపు అరగంట సేపు వాదించినా మాల్ సిబ్బంది ఆ తండ్రీకొడుకులను షాపింగ్ మాల్లో అడుగు కూడా పెట్టనీయలేదు. ఇక చేసేదేమి లేక ఆ యువకుడు నిరాశతో అతిని తండ్రిని తీసుకొని వెనుదిరిగి వెళ్లిపోయారు. అయితే ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. దీనిని చూసిన నెటిజన్స్  మాల్ సిబ్బంది పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా.. దేశానికి వెన్నముక లాంటి రైతును ఇలా వస్త్రధారణ పేరుతో అవమానించడం సరికాదని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరి, ధోతి ధరించరన పెద్దయనని మాల్ కు రానివ్వని ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి