చంటి బిడ్డతో ఆటో నడుపుతున్న ఓ అమ్మ కథ! హేట్సాఫ్!

ఈ ప్రపంచంలో ఎంతో మంది ఒంటరి మహిళలు ఎవరి మీద ఆధారపడకుండా.. వారి కాళ్ళ మీద వారు నిలబడుతున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్ కి చెందిన ఓ మహిళ చంటి బిడ్డను ఎత్తుకుని జీవనోపాధి సాగిస్తోంది.

ఈ ప్రపంచంలో ఎంతో మంది ఒంటరి మహిళలు ఎవరి మీద ఆధారపడకుండా.. వారి కాళ్ళ మీద వారు నిలబడుతున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్ కి చెందిన ఓ మహిళ చంటి బిడ్డను ఎత్తుకుని జీవనోపాధి సాగిస్తోంది.

సమాజంలో మన చుట్టూ ఎంతో మంది ఒంటరి మహిళలను చూస్తూనే ఉంటాము, అయితే, వారిలో గృహ హింసకు బలైపోయిన మహిళలే ఎక్కువగా ఉంటారు. అటువంటి మహిళలు వారి భర్త వదిలేసిన తర్వాత.. ఏం చేయాలో అర్థంకాక, వారి జీవితాన్ని ఎలా గడపాలో తోచక.. ఆత్మహత్యలు చేసుకోడానికి కూడా వెనుకాడరు. వారిలో చంటి బిడ్డలతో దిక్కుతోచని నిస్సహాయ స్థితిలో ఉండే మహిళలు కూడా ఉంటారు. కానీ, వారందిరిలో కేవలం కొంతమంది మాత్రమే.. ఎవరో వస్తారు ఎదో చేస్తారు అని ఎవరికోసమో ఎదురు చూడడం మానేసి.. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసి.. వారి జీవితాలను వారే బాగుచేసుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ కూడా ఈ కోవకు చెందిన వారే. ఒక చంటి బిడ్డకు తల్లి అయి ఉండి కూడా.. తన బిడ్డను ఎత్తుకుని మరి జీవనోపాధి కోసం ఆటో నడుపుతుంది.

రాజస్థాన్ కు చెందిన ఈ మహిళ పేరు హేమలత కుష్వాహా. ఈ మహిళను జైపూర్ తొలి మహిళా ఆటో డ్రైవర్ అని అంటూ ఉంటారు. అయితే, మనం ఇప్పటి వరకు బ్రతుకు తెరువు కోసం ఎదో ఒక పనిని ఎంచుకునే ఆడవారిని చూసే ఉంటాం. కానీ, ఈ మహిళకు ఓ చంటి బిడ్డ ఉన్నా సరే ఎందుకు ఈ వృత్తిని ఎంచుకోవాల్సి వచ్చిందనే విషయాన్నీ, ఈ క్రమంలో భర్తతోపాటు తోటి ఆటోడ్రైవర్ల నుంచి ఎదుర్కొన్న ఇబ్బందుల్ని తాజాగా మీడియాతో పంచుకుంది. “2012 లో నా భర్త నన్ను తీవ్రంగా కొట్టాడు. మొదటి అంతస్థు నుంచి నన్ను కిందికి తోసేశాడు. అపుడు నేను తీవ్రంగా గాయపడ్డాను. దానితో అతనిపై నేను ఇచ్చిన పిర్యాదు కారణంగా కేసు నమోదు చేశారు. అది ఇప్పటికీ నడుస్తూనే ఉంది. నా భర్త నా దగ్గరకు మళ్ళీ తిరిగి రాలేదు. దీనితో ఏడాదిన్నర బిడ్డతో నేను ఒంటరి మహిళగా మిగిలిపోయాను. నా కుటుంబాన్ని ఆర్థికంగా పోషించుకోవడం కోసం ఆటో డ్రైవింగ్ మొదలుపెట్టాను. ఈ క్రమంలో నేను చాల ఇబ్బందులను ఎదుర్కొన్నాను. నా తోటి ఆటో డ్రైవర్లు నాకు ఏ మాత్రం సహరించకపోగా.. నన్ను ఇబ్బందులకు గురి చేసేవారు. నా ఆటో హెడ్ లైట్స్ కూడా పగలకొట్టేవారు. దీనితో రాత్రి వేళల్లో అలానే డ్రైవ్ చేసేదాన్ని.

అక్కడున్న నలభై వేల మంది ఆటో డ్రైవర్లలో నేనొక్కదాన్నే .. మహిళా ఆటో డ్రైవర్ ని. అయినా కూడా వారు నన్ను ఇబ్బందులకు గురిచేసేవారు. ఈరోజుకి కూడా ఆ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను. ఆ తర్వాత మళ్ళీ నేను మరొక పెళ్లి చేసుకున్నాను. ఆ సమయంలో గర్భవతిగా ఉన్నపుడు కూడా..నాకు ఎవరు సహాయం చేయలేదు. నా భర్తకు కూడా ఆటో నడపడం రాదు.. దీనితో ప్రసవానికి వెళ్ళేటపుడు కూడా నేనే ఆటో నడుపుకుంటాను వెళ్ళాను. నేను ఆటో నడపడం ఎప్పటికి ఆపను. ఆటో డ్రైవింగ్ ద్వారానే నాకు గుర్తింపు లభించింది. కాబట్టి జైపూర్ తొలి ఆటో మహిళా ఆటో డ్రైవర్ గా ఉన్న ఈ గుర్తింపును వదులుకోను.” అంటూ హేమలత చెప్పుకొచ్చారు.

ఏదేమైనా, తన జీవితంలో ఎన్ని ఆటుపోట్లు, అవమానాలు ఎదురైనా.. తన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎటువంటి సహాయం చేయకపోయినా.. ఆ మహిళ దైర్యంగా ముందుకు సాగుతుంది. ఈ కథ మన మధ్యనే జీవితాన్ని గడుపుతున్న ఓ మహిళ గాధ.. ఈ మహిళ కథ ఎంతో మంది నిస్సహాయతగా మిగిలిపోయిన మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది. మరి, జైపూర్ కు చెందిన ఈ మహిళ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments