iDreamPost

ఆటో డ్రైవర్ బంపర్ ఆఫర్.. నా ఆటోలో ప్రయాణిస్తే కిలో టమాటా ఫ్రీ!

ఆటో డ్రైవర్ బంపర్ ఆఫర్.. నా ఆటోలో ప్రయాణిస్తే కిలో టమాటా ఫ్రీ!

ఇప్పుడు దేశవ్యాప్తంగా టమాటా ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు టమాటాలు కొనాలంటేనే భయంతో వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పంజాబ్ కు చెందని ఓ ఆటో డ్రైవర్ ప్రయాణికులకు బంపరాఫర్ ను ప్రకటించాడు. నా ఆటోలో ప్రయాణించిన వారికి కిలో టమాటా ఫ్రీగా ఇస్తానంటూ ఆటో వెనకాల రాసుకొచ్చాడు. దీంతో ప్రయాణికులు అతడి ఆటో ఎక్కిందుకు పోటీ పడుతున్నారట. కానీ, ఇతగాడు ఇక్కడ ఓ కండిషన్ కూడా పెట్టడండోయ్. ఇంతకీ స్టోరీ ఏంటనేది తెలియాలంటే మీరు ఆ ఆర్టికల్ చదవాల్సిందే.

పంజాబ్ లోని ఓ ప్రాంతంలో అరుణ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు స్థానికంగా ఆటో నడుపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా టమాటా ధరలు మండిపోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. దీంతో కొనలేని పరిస్థితుల్లో చాలా మంది టమాటా లేకుండా వంట చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆటో డ్రైవర్ అరుణ్ ప్రయాణికులకు ఓ బంపర్ ఆఫర్ ను ప్రకటించాడు.

నా ఆటోలో ప్రయాణించిన వారికి కిలో టమాటా ఫ్రీగా ఇస్తానంటూ ప్రకటించాడు. కానీ, మనోడు ఇక్కడ మరో కండిషన్ కూడా పెట్టాడు. అదేంటంటే? నా ఆటోలో ఐదు సార్లు ప్రయాణించిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని కూడా రాసుకొచ్చాడు. దీంతో స్థానిక ప్రయాణికులు అరుణ్ ఆటో ఎక్కేందుకు పోటీ పడుతున్నారు. మరో విషయం ఏంటంటే? అరుణ్ గతంలో గర్భిణీలకు, సైనికులకు ఉచిత ప్రయాణాన్ని కూడా కల్పించాడు. దీంతో పోలీస్ అధికారులు ఇతని సేవా దృక్పథాన్ని గుర్తించి సన్మానించి అభినందించారట.

ఇది కూడా చదవండి: వీళ్లు చాలా రిచ్ గురూ.. అమ్మవారికి టమాటాలతో మొక్కు చెల్లింపు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి