iDreamPost
android-app
ios-app

సామాన్యులకు షాకిచ్చిన పాల ధరలు! లీటర్ పాలపై..

  • Published Jun 03, 2024 | 11:03 AM Updated Updated Jun 03, 2024 | 11:03 AM

సామాన్యులకు పాల ధరలు షాకిచ్చాయి.. ఉత్పత్తి వ్యయాలు విపరీతంగా పెరగడంతో ధరలు పెంచినట్లు కంపెనీ ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితే..

సామాన్యులకు పాల ధరలు షాకిచ్చాయి.. ఉత్పత్తి వ్యయాలు విపరీతంగా పెరగడంతో ధరలు పెంచినట్లు కంపెనీ ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితే..

సామాన్యులకు షాకిచ్చిన పాల ధరలు! లీటర్ పాలపై..

ఉత్పత్తి వ్యయాలు విపరీతంగా పెరగడంతో.. పాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించి.. ఓ ప్రముఖ కంపెనీ షాకిచ్చింది. దాంతో సామాన్యులకు ఊహించిని షాక్ తగిలినట్లు అయ్యింది. పెరిగిన ధరలు జూన్ 3 నుంచే అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. మరి లీటర్ పాలపై ఆ కంపెనీ ఎన్ని రూపాయలు పెంచింది? ఆ కంపెనీ ఏది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సామాన్యులకు అములు మిల్క్ షాకిచ్చింది. గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో పాల ధరలు పెంచుతున్నట్లు పేర్కొంది. లీటర్ పెట్రోల్ పై రూ. 2 రూపాయలు పెంచింది. అమూల్ సంస్థ తాజా నిర్ణయంతో అన్ని వేరియంట్లు అమూల్ గోల్డ్, అమూల్ శక్తి, అమూల్ టీ స్పెషల్ మిల్క్ ధరలు సోమవారం నుంచి లీటరుపై రూ.2 చొప్పున పెరుగుతాయి. దేశ వ్యాప్తంగా అమూల్ సవరించిన ధరలు అమలులోకి వస్తాయని పేర్కొంది.

పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి:

అమూల్ గోల్డ్ పాలు లీటర్ రూ. 66 నుంచి 68కి పెరిగాయి. అమూల్ శక్తి లీటర్ రూ. 60కి చేరుకుంది. అలాగే అమూల్ తాజా పాలు లీటర్ రూ. 56, హాఫ్ లీటర్ రూ. 28కి చేరుకుంది. అమూల్ గేదె పాలు ఆఫ్ లీటర్ రూ.37, అమూల్ గోల్డ్ ఆఫ్ లీటర్ రూ.34, అమూల్ శక్తి హాఫ్ లీటర్ రూ.30 అయింది. సాగర్ స్కిమ్మిడ్ పాల ధర ఆఫ్ లీటర్ రూ.20, లీటర్ ధర రూ.40 వద్ద స్థిరంగా ఉన్నాయి. అమూల్ స్లిమ్ అండ్ ట్రిమ్ కస్టమర్లు అర్ధ లీటర్ పై రూ.25, లీటర్ పౌచ్ పై రూ.49 చెల్లించాల్సి ఉంటుంది. అయితే పాల ధరలను పెంచే విషయాన్ని సంస్థ ముందుగానే ప్రకటిస్తుంది. కానీ ఈసారి మాత్రం షాకింగ్ గా తన నిర్ణయాన్ని ప్రకటించింది. పశుగ్రాసం, రవాణా ఖర్చులు, పాల ఉత్పత్తి వ్యయం పెరగడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది.