iDreamPost

పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. దిగివస్తున్న పసిడి! ఈ రోజు ఎంతంటే?

Gold and Silver Retes: బంగారం ధరలు ఇటీవల ఆకాశాన్నంటాయి.. దీంతో కొనుగోలుదారులు ఆలోచనలో పడ్డారు. గత మూడు రోజుల నుంచి వరుసగా తగ్గుముఖం పట్టడంతో పసిడి కొనేవారికి ఇదే మంచి ఛాన్స్ అంటున్నారు నిపుణులు.

Gold and Silver Retes: బంగారం ధరలు ఇటీవల ఆకాశాన్నంటాయి.. దీంతో కొనుగోలుదారులు ఆలోచనలో పడ్డారు. గత మూడు రోజుల నుంచి వరుసగా తగ్గుముఖం పట్టడంతో పసిడి కొనేవారికి ఇదే మంచి ఛాన్స్ అంటున్నారు నిపుణులు.

పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. దిగివస్తున్న పసిడి! ఈ రోజు ఎంతంటే?

పసిడి కొనుగోలు చేయడం ఈ మధ్య దేశంలో మరీ ఎక్కువైంది. ఒకప్పుడు బంగారం అంటే ఆభరణాలుగా మాత్రమే చూసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పసిడి ఆభరణాలుగా మాత్రమే కాదు.. మంచి ఇన్వెస్ట్‌మెంట్‌గా భావిస్తున్నారు. ఏ ఆపదలో అయినా బంగారం ఉంటే మంచి భరోసా ఉంటుందని మధ్యతరగతి కుటుంబీకులు భావిస్తున్నారు. అందుకే పొదుపు చేసిన డబ్బుతో బంగారం కొనేందుకు ఇష్టపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో జరిగే కీలక పరిణామాలు పసిడి, వెండి ధరలపై చూపిస్తుంది.. అందుకే తరుచూ ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. గత మూడు రోజుల నుంచి పసిడి నేల చూపులు చూస్తుంది. ఈ రోజు మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎంతో చూద్దాం.

బంగారం కొనాలనుకునే వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అంటున్నారు నిపుణులు. ఈ మధ్య వరుసగా పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ధరలు తగ్గినపుడు కొనుగోలు చేస్తే భవిష్యత్ లో మంచి లాభం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నిన్న తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు కూడా ఊరటనిస్తున్నాయి. మహిళలు మొన్నటి వరకు శుభకార్యాలు ఏవీ లేవు.. ఈ నెలలో మళ్లీ మొదలు కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలు పసిడి కొనుగోలు చేసేందుకు జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.10 తగ్గి.. రూ.66,490 గా పలుకుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.10 తగ్గి.. రూ.72,540గా పలుకుతుంది.

today gold rates

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,640 గా పలుకుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,690 వద్ద కొనసాగుతుంది.ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,490 గా పలుకుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,540 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,090 గా పలుకుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.73,190 వద్ద కొనసాగుతుంది.ఈ రోజు కిలో వెండి పై రూ.100 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.93,400 వద్ద కొనసాగుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి