nagidream
Big Insult To Ram Lalla Sculptor Arun Yogiraj: అయోధ్య రామ మందిరంలోని బాల రాముని విగ్రహాన్ని చెక్కిన అరుణ్ యోగిరాజ్ కి అవమానం ఎదురైంది. బాల రాముని విగ్రహాన్ని చెక్కిన శిల్పిగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన అరుణ్ యోగిరాజ్ ని అమెరికా అవమానించింది.
Big Insult To Ram Lalla Sculptor Arun Yogiraj: అయోధ్య రామ మందిరంలోని బాల రాముని విగ్రహాన్ని చెక్కిన అరుణ్ యోగిరాజ్ కి అవమానం ఎదురైంది. బాల రాముని విగ్రహాన్ని చెక్కిన శిల్పిగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన అరుణ్ యోగిరాజ్ ని అమెరికా అవమానించింది.
nagidream
అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించిన బాలరాముని విగ్రహాన్ని అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి చెక్కిన విషయం తెలిసిందే. అత్యంత సుందరమైన బాలరాముని విగ్రహాన్ని చెక్కే అదృష్టం దక్కించుకున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అరుణ్ యోగిరాజ్ నైపుణ్యానికి దేశమంతా ముగ్ధులయ్యారు. దేశమంతా అరుణ్ యోగిరాజ్ పని తీరుని ప్రశంసించింది. అలాంటి శిల్పికి ఘోర అవమానం ఎదురైంది. అమెరికా అరుణ్ యోగిరాజ్ ని అవమానించింది.
అరుణ్ యోగిరాజ్ వీసాను అమెరికా నిరాకరించింది. 12వ అక్క వరల్డ్ కన్నడ కాన్ఫిరెన్స్ (డబ్ల్యూకేసీ 2024) ఈవెంట్ కి అరుణ్ యోగిరాజ్ వెళ్లాల్సి ఉంది. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో గ్రేటర్ రిచ్మండ్ కన్వెన్షన్ సెంటర్ లో ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 1 వరకూ ఈయనకు షెడ్యూల్ ఇచ్చారు. ఈ క్రమంలోనే అరుణ్ యోగిరాజ్ వీసాను అమెరికా నిరాకరించింది. అయితే అమెరికా ఎందుకు నిరాకరించిందో అనేది తెలియదని అరుణ్ యోగిరాజ్ అన్నారు. వీసాకు కావాల్సిన డాక్యుమెంట్లు అన్నీ తనతో తీసుకెళ్లానని, అన్ని నియమ నిబంధనలను అనుసరించానని.. అయినా కానీ వీసా ఎందుకు నిరాకరించారో తెలియదని అన్నారు.
ఐటీ రిటర్న్స్, బ్యాంక్ బ్యాలెన్స్, ఆడిట్ రిపోర్ట్ సహా అన్ని డాక్యుమెంట్స్ సమర్పించామని.. కానీ వారి రూల్స్ ఎలా ఉన్నాయో తెలియదు కాబట్టి పర్లేదని అన్నారు. వీసా ఇవ్వడానికి, అమెరికా వెళ్లేందుకు అనుమతివ్వడానికి వాళ్ళ రూల్స్ వేరేగా ఉండచ్చు.. వాటి మీద నాకు అవగాహన లేకపోవచ్చు ఏమో పర్లేదు.. వచ్చే ఏడాది ఫంక్షన్ కి హాజరవుతానని అన్నారు. వీసా నిరాకరణ గురించి చెబితే కేంద్ర ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదని.. దీనిపై స్పందన కోసం ఎదురుచూస్తున్నా అని అన్నారు. ఇక అక్క వరల్డ్ కన్నడ కాన్ఫిరెన్స్ అనేది కన్నడ కమ్యూనిటీకి చెందిన వాళ్లందరినీ ఒకేచోట కలిపే వేదిక. నార్త్ అమెరికా సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఉండే కన్నడ కమ్యూనిటీకి చెందిన వారిని ఒక వేదికపై తీసుకొచ్చి సాధించిన విజయాల గురించి చర్చించుకుంటారు.
కన్నడ భాషను, కన్నడ సంస్కృతిని రక్షించి భావి తరాలకు ఎలా అందివ్వాలి అనే లక్ష్యంతో ఈ ఈవెంట్ ని నిర్వహిస్తారు. అలాంటి ఈవెంట్ కి అరుణ్ యోగిరాజ్ ని ఆహ్వానించారు. కన్నడ కమ్యూనిటీకి అరుణ్ యోగిరాజ్ అందించిన సేవలకు గాను ఆయనను అమెరికాలో జరుగుతున్న ఈ ఈవెంట్ కి ఆహ్వానించారు. అయితే అమెరికా ఆయన వీసాను నిరాకరించింది. వీసా నిరాకరణపై అరుణ్ కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అవమానించింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.