iDreamPost
android-app
ios-app

భక్తుడికి గుండె పోటు.. ప్రాణాలు నిలిపిన వాయుసేన సిబ్బంది!

Ayodhya: దేశంలో ఇప్పుడు అందరి చూపు అయోధ్య వైపే ఉంది. నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్యలో రామమందిరం ఎంతో ఘనంగా ప్రారంభించారు. బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరింగింది. ఇదే సమయంలో ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఓ భక్తుడి ప్రాణాలు కాపాడారు.

Ayodhya: దేశంలో ఇప్పుడు అందరి చూపు అయోధ్య వైపే ఉంది. నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్యలో రామమందిరం ఎంతో ఘనంగా ప్రారంభించారు. బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరింగింది. ఇదే సమయంలో ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఓ భక్తుడి ప్రాణాలు కాపాడారు.

భక్తుడికి గుండె పోటు.. ప్రాణాలు నిలిపిన వాయుసేన సిబ్బంది!

2024 జనవరి 22.. ఈ తేదీ, ఈ సంవత్సరం యావత్త భారతదేశంతో పాటు, ప్రపంచంలో ఉన్న హిందువులు మర్చిపోని రోజు. ఈ రోజు రామయ్య తండ్రి..తన సొంతూరు అయోధ్య నగరానికి వచ్చారు. భారత ప్రభుత్వం రామ మందిర ప్రారంభోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించింది. ప్రధాని చేతుల మీదుకు రామచంద్రుడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ వేడుకను చూసేందుకు లక్షలాది మంది రామ భక్తులు అయోధ్య నగరానికి వచ్చారు. ఇలా యావత్ భారత దేశం రామనామ స్మరణతో మారు మోగింది. ఇదే సమయంలో అయోధ్యలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ భక్తుడి గుండె పోటు వచ్చింది. దీంతో వెంటనే స్పందించిన ఎయిర్ ఫోర్స్ సిబ్బంది అతడి ప్రాణాలు ను కాపాడారు.

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్స వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకను లక్షలాది మంది ప్రజలు తిలకించారు. ఇక రామయ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన రామకృష్ణ శ్రీవాస్తవ(65)అనే భక్తుడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుండగా.. ఆ ఘట్టాన్ని రామకృష్ణ ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇదే సమయంలో ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో చుట్టుపక్కల వారు ఎంతో కంగారు పడి పోయి.. అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇదే సమయంలో వాయుసేన వింగ్ కమాండర్ మనీశ్ గుప్తా ఆధ్వర్యంలో ఆరోగ్య మైత్రి డిజాస్టర్ మేనేజ్మెంట్ చెందిన  ‘భిష్మం’ క్యూబ్ బృందం వెంటనే స్పందించింది. ఘటన స్థలం నుంచి రామకృష్ణను వెంటనే తరలించి చికిత్స అందించింది. ఇలా గుండెపోటు వంటి ఘటనలు జరిగినప్పుడు గోల్డన్ అవర్ గా పిలిచే తొలి గంటను వాయుసేన బృందం సమర్థవంతంగా వినియోగించుకుందని ఎయిర్ ఫోర్స్ ఓ ప్రకటనలో తెలిపింది.

చికిత్స ప్రారంభించిన సమయానికి ఆ భక్తుడికి బీపీ 120/170ఎంఎం హెచ్జీ వద్ద డేంజర్ లెవెల్ లో ఉందని ఎయిర్ ఫోర్స్  పేర్కొంది. ఎయిర్ ఫోర్స్ సిబ్బంది సత్వరమే చికిత్స అందించడంతో ఆయన ప్రాణాలు నిలిచాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా మారిన అనంతరం స్థానికి ఆస్పత్రికి తరలించారు. ఎవరికైన ఆరోగ్య అత్యవసర పరిస్థితి  ఏర్పడితే సత్వరమే స్పందించేందుకు వీలుగా ఆరోగ్య మైత్రి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రాజెక్  కింద క్యూబ్- బీష్మ్ పేరిట అయోధ్యలో రెండు మొబైల్ ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అత్యవసర వైద్య సేవలను  అందించేందుకు వీలుగా అత్యాధునిక వైద్య పరికరాలను సిద్ధంగా ఉంచారు. మరి.. ఓ భక్తుడి ప్రాణం కాపాడిన వాయుసేన సిబ్బందిపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తోన్నారు. మరి.. వాయు సేన అందించిన సాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.