Lok Sabha Polls 2024-Double PM Kisan Funds: ఎన్నికల వేళ మోదీ సర్కారు శుభవార్త.. మహిళా రైతులకు రూ.12 వేలు?

ఎన్నికల వేళ మోదీ సర్కారు శుభవార్త.. మహిళా రైతులకు రూ.12 వేలు?

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఓటర్లను ఆకర్షించేందుకు రెడీ అవుతోంది మోదీ సర్కార్‌. ఈ క్రమంలో మహిళా రైతులకు 12 వేల రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధం అవుతోందంట. ౠ వివరాలు..

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఓటర్లను ఆకర్షించేందుకు రెడీ అవుతోంది మోదీ సర్కార్‌. ఈ క్రమంలో మహిళా రైతులకు 12 వేల రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధం అవుతోందంట. ౠ వివరాలు..

మరికొన్ని నెలల్లో లోక్‌సభతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగున్నాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న మోదీ సర్కార్‌.. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకోవడం కోసం వరాలు కురిపిస్తోంది. ఇప్పటికే గ్యాస్‌ సిలిండర్‌ ధరను తగ్గించిన కేంద్రం.. ఇప్పుడు అన్నదాతలను ఆకట్టుకునేందుకు రెడీ అవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. రైతుల కోసం ఇప్పటికే ఎన్నో పథకాలు తీసుకువచ్చింది మోదీ సర్కార్‌.

వాటితోపాటు త్వరలోనే మరో కొత్త స్కీమ్‌కు శ్రీకారం చుట్టేందుకు రెడీ అవుతోందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలోని మహిళా రైతులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోందట మోదీ సర్కార్‌. వారికి రూ. 12,000 ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఆవివరాలు..

అన్నదాతలను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం.. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన స్కీమ్‌ ద్వారా ప్రతి ఏటా ఎకరాకి 6 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే మహిళా రైతులకు అందించే పీఎం కిసాన్‌ సాయాన్ని రెట్టింపు చేసే ఆలోచనలో ఉందట కేంద్ర ప్రభుత్వం. అంటే మహిళా రైతులకు అందించే పీఎం కిసాన్‌ యోజన సాయాన్ని రూ. 12,000 లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

పార్లమెంట్‌ ఎన్నికలకు మహిళా ఓటర్లను ఆకర్షించేలా కేంద్ర ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తున్నట్లు రాయిటర్స్‌ కథనంలో పేర్కొంది. ఈ ప్రణాళికను ఫిబ్రవరి 1న బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ప్రకటించినట్లయితే ప్రభుత్వానికి అదనంగా రూ.12,000 కోట్ల ఖర్చు పెరగనుందని బడ్జెట్‌ ప్రతిపాదనలో చర్చించినట్లు సమాచారం.

ప్రస్తుతం.. కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన’ కింద రైతులకు ఏడాదికి ఎకరాకు రూ.6000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తం ఒకే సారి కాకుండా మూడు విడతల్లో రూ.2000 చొప్పున అందిస్తోంది.  అంతేకాక ప్రస్తుతం అందించే పీఎం కిసాన్‌ మొత్తాన్ని కూడా పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందిస్తున్న రూ.6000ల నుంచి రూ.8000కు పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీనితో పాటు.. మహిళా ఓటర్లను ఆకట్టుకునే విధంగా, వారికి సాధికారత కల్పించేలా మహిళా రైతులకు అందించే కిసాన్‌ సాయం మొత్తాన్ని రెట్టింపు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Show comments