iDreamPost
android-app
ios-app

46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరీ రత్న భండార్.. ఇందులో ఏం ఉన్నాయంటే?

  • Published Jul 13, 2024 | 8:19 PM Updated Updated Jul 13, 2024 | 8:19 PM

After 46 Years Ratna Bhandar Of Puri Jagannath Temple Will Reopen: ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయంలో ఉన్న రహస్య గదిని 46 ఏళ్ల తర్వాత తెరుస్తున్నారు. ఎప్పుడో స్వాతంత్య్రం రాక ముందు ఒకసారి తెరిచారు. స్వాతంత్య్రం వచ్చాక 1978లో తెరిచారు. మళ్ళీ ఆ తర్వాత ఇన్నాళ్లకు తెరుస్తున్నారు. అసలు ఆ రత్న భండార్ లో ఏమున్నాయంటే?

After 46 Years Ratna Bhandar Of Puri Jagannath Temple Will Reopen: ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయంలో ఉన్న రహస్య గదిని 46 ఏళ్ల తర్వాత తెరుస్తున్నారు. ఎప్పుడో స్వాతంత్య్రం రాక ముందు ఒకసారి తెరిచారు. స్వాతంత్య్రం వచ్చాక 1978లో తెరిచారు. మళ్ళీ ఆ తర్వాత ఇన్నాళ్లకు తెరుస్తున్నారు. అసలు ఆ రత్న భండార్ లో ఏమున్నాయంటే?

46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరీ రత్న భండార్.. ఇందులో ఏం ఉన్నాయంటే?

దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పూరీ జగన్నాథుని ఆలయంలో రహస్య గదిని రేపు అనగా జూలై 14న ఆదివారం నాడు తెరవనున్నారు. దాదాపు 46 ఏళ్ల తర్వాత రత్న భండార్ తెరుచుకుంటుంది. ఒడిశా హైకోర్టు ఆదేశాల మేరకు ఒడిశా ప్రభుత్వం చేత ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఆమోదంతో ఈ రత్న భండార్ ని తెరవనున్నారు. 46 ఏళ్ల తర్వాత తెరుస్తుండడంతో విష సర్పాలు ఉన్నాయేమో అన్న భయంతో ముందు జాగ్రత్తగా పాములను పట్టుకోవడం నిపుణులను తీసుకెళ్లనున్నారు. ఒకవేళ పాములు కాటు వేస్తే స్పాట్ లో వైద్యం చేసేందుకు వైద్యుల్ని కూడా ఏర్పాటు చేశారు.   

రత్న భండార్ ఎక్కడుందంటే?

రత్న భండార్ ని ఆఖరి సారిగా 1978లో తెరిచారు. మళ్ళీ అప్పటి నుంచి తెరవలేదు. ఈ రత్న భండార్ (రహస్య గది) పూరీ జగన్నాథ్ ఆలయానికి ఉత్తరాన ఉన్న జగన్మోహన ప్రార్థన మందిరం తర్వాత ఉంది. జగన్మోహన ప్రార్థన మందిరానికి కుడి వైపున స్టీల్ గ్రిల్స్ ఉన్న ఒక గది తాళాలు వేసి ఉంటుంది. ఆ గది లోపలకు వెళ్తే అక్కడ కింద రత్న భండార్ ఉంటుంది. ఈ రహస్య గదిలో అప్పటి భక్తులు, రాజులు సమర్పించిన బంగారం, ఆభరణాలు భారీగా ఉన్నాయి. ఈ రత్న భండార్ లో అందులో మూడు ఛాంబర్స్ ఉంటాయి. ఈ ఛాంబర్స్ లో నిధి, నిక్షేపాలు ఉన్నాయని చెబుతారు. మూడు ఛాంబర్స్ లో ఒకటి బాహర్ భండార్. తాళాలు తెరిచి గది లోపలకు వెళ్ళగానే బయట ఉంటుంది. స్వామి వారికి అస్తమానూ వాడే ఆభరణాలు ఉన్నాయి. అలానే బంగారపు వేషం వేస్తారు. ఏడాదికి 5 సార్లు బంగారపు వేషం వేస్తారు. ఈ వేషంలో పెద్ద బంగారు కిరీటం, బంగారు పాదాలు వంటివి ఉన్నాయి. ఇవన్నీ బయట భండార్ లో ఉన్నాయి. దీనికి ఒకటే తాళం ఉంది. అది భండార్ అధికారి దగ్గర ఉంటుంది.

రెండో ఛాంబర్ ని భిటర్ భండార్ అని అంటారు. మొదటి ఛాంబర్ ని దాటుకుని వెళ్తే ఈ రెండో ఛాంబర్ వస్తుంది. అయితే ఈ రెండో ఛాంబర్ కి మూడు తాళాలు ఉంటాయి. ఒక తాళం గజపతి మహారాజు వంశం దగ్గర ఉంటుంది. ఈ వంశీయులు ఇప్పటికీ ఆలయ సమీపంలోనే ఉన్నారు. రెండో తాళం భండార్ అధికారి దగ్గర, మూడో తాళం కలెక్టర్ ఆఫీస్ లో ఉంటుంది. ఈ మూడూ కలిపి ఒకేసారి తెరిస్తేనే ఆ రెండో ఛాంబర్ తెరుచుకుంటుంది. ఏ ఒక్క తాళం లేకపోయినా అది తెరుచుకోదు. దీన్ని తొలిసారిగా అంటే స్వాతంత్య్రం రాక ముందు 1905లో బ్రిటిష్ గవర్నమెంట్ తనిఖీల కోసం తెరిచింది. 1926లో దీనికి సంబంధించి జాబితా తయారు చేయబడింది. దీంతో ప్రతి మూడేళ్లకొకసారి తెరిచి ఎంత బంగారం, ఎంత వెండి ఉందో లెక్కించాలని 1960లో ఒక నియమం పెట్టారు. ప్రభుత్వ అనుమతి ఉంటేనే ఆ రత్న భండార్ ని తెరవాలని 1960లో ఒక చట్టం కూడా తీసుకొచ్చారు.

ఆ తర్వాత మూడు తాళాలతో 1978లో మే 13న తెరిచారు. అందులో ఉన్న ఆభరణాలను లెక్కించడం మొదలుపెడితే 70 రోజులు కొనసాగింది. ఇక లెక్కించడం తమ వల్ల కాదని మధ్యలోనే ఆపేశారు. దీన్ని బట్టి ఎంత బంగారం, ఆభరణాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. లెక్కించినంత వరకూ ఎంతుందో ఒక లిస్టులో చేర్చారు. అయితే అప్పటి నుంచి మళ్ళీ తెరవలేదు. రాజకీయ కారణాల వల్ల తెరవలేదు. 2018లో కోర్టు, పురావస్తు శాఖ అందులో ఉన్న వాటిని లెక్కించాలి అని ఒక నియమాన్ని తీసుకొచ్చాయి. అయితే ఛాంబర్ కి చెందిన మూడు తాళాల్లో ఒక తాళం పోయిందని చెప్తూ వచ్చారు. దీంతో బీజేపీ పార్టీ చొరవ తీసుకుని తాము అధికారంలోకి వస్తే ఆ రత్న భండార్ గదిని తెరిపిస్తామని హామీ ఇచ్చింది. దీంతో పూరీ జగన్నాథ భక్తులైన ఒడిశా ప్రజలు బీజేపీని గెలిపించారు. తాళం లేదన్నారు కదా ఎలా తెరుస్తారు అంటే బద్దలుకొడతామని బీజేపీ వెల్లడించింది. దీంతో మూడో తాళం తీసుకొచ్చి ఇచ్చారు. మూడు తాళాలతో రేపు అనగా జూలై 14న రత్న భండార్ ని తెరుస్తున్నారు. 

పలు నివేదికల ప్రకారం 1978 నాటి జాబితాలో చేర్చిన రత్న భండార్ లో ఉన్న ఆభరణాల సంఖ్య:

  • రాళ్లు, బంగారు పళ్ళాలు, ముత్యాలు, వజ్రాలు, పగడాలు, ఇతర విలువైన రాళ్లతో పొదిగిన 367 బంగారు ఆభరణాలు
  • 231 వెండి వస్తువులు

పలు నివేదికల ప్రకారం 1978 నాటి జాబితాలో చేర్చిన రత్న భండార్ లో ఉన్న ఆభరణాల బరువు:

  • 50 కిలోల బంగారు ఆభరణాలు
  • 173 కిలోల  వెండి వస్తువులు