iDreamPost
android-app
ios-app

మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఈసారి టార్గెట్ సూర్యుడు!

  • Author Soma Sekhar Published - 06:32 PM, Mon - 28 August 23
  • Author Soma Sekhar Published - 06:32 PM, Mon - 28 August 23
మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఈసారి టార్గెట్ సూర్యుడు!

చంద్రయాన్-3 సక్సెస్ తో మంచి జోరుమీదుంది ఇస్రో. ఇక ఇదే జోరును కొనసాగించేందుకు తన సర్వశక్తులను కూడగట్టుకుని మరో ప్రయోగానికి సిద్ధమైంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. అందులో భాగంగానే మరో కీలక మిషన్ ప్రయోగానికి ముహుర్తం కూడా ఖరారు చేసింది. మెున్న చంద్రుడిని టార్గెట్ చేసి విజయం సాధించిన ఇస్రో.. ఈసారి భగభగ మండే సూర్యుడిని టార్గెట్ చేసింది. ఇందుకోసం ‘ఆదిత్య ఎల్-1’ ను సిద్ధం చేసింది. దీనిని పీఎస్ఎల్వీ-సి57 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

మరో కీలక మిషన్ కోసం ఇస్రో సిద్ధం అయ్యింది. సూర్యుడిపై పరిశోధనల కోసం రూపొందించిన ‘ఆదిత్య ఎల్-1’ సెప్టెంబర్ 2న ఉదయం 11.50 గంటలకు శ్రీహరి కోట నుంచి ప్రయోగించడానికి ముహుర్తం ఖరారు చేసింది. దీనిని పీఎస్ఎల్వీ-సి57 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లనుంది. కాగా.. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ ఇదే కావడం విశేషం. ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోగాలను సూర్యుడిపై చేపట్టలేదు ఇస్రో. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సూర్యుడిపై ఉన్న సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. ఇక ఈ ప్రయోగంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై అధ్యయనాలను చేపడుతోంది ఇస్రో. ఇక ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు సాధారణ పౌరులకు కూడా అవకాశం కల్పిస్తోంది ఇస్రో. దీనికోసం ఆగస్టు 29 (మంగళవారం) మధ్యాహ్నాం 12 గంటల నుంచి ఇస్రో అధికారిక వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది.

ఆదిత్య ఎల్-1 విశేషాలు..

  • ఆదిత్య ఎల్-1 శాటిలైట్ బరువు 150 కేజీలు. సూర్యుడిపై ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ ఇది.
  • ఈ మిషన్ ద్వారా గ్రహాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు కలుగుతుంది.
  • భూమి నుండి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ 1(L-1) చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెడతారు.
  • ఆదిత్య ఎల్-1 మెుత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్తుంది.
  • సూర్యుడి నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు వీలుగా ఈ పేలోడ్స్ ను రూపొందించారు.

ఇదికూడా చదవండి: అమృతకు సర్ ప్రైజ్ ఇచ్చిన తల్లి.. మొదటిసారి వీడియోతో..!