Krishna Kowshik
మహిళల కోెసం ఆ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వారికి శుభవార్త పేర్కొంది. నెలకు వెయ్యి రూపాయల సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. ఇంతకు ఎక్కడంటే..?
మహిళల కోెసం ఆ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వారికి శుభవార్త పేర్కొంది. నెలకు వెయ్యి రూపాయల సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. ఇంతకు ఎక్కడంటే..?
Krishna Kowshik
మహిళల కోసం పలు రాష్ట్ర ప్రభుత్వాలు సరికొత్త పథకాలను తీసుకు వస్తున్నాయి. ఈ రోజుల్లో మహిళలే ఓటు బ్యాంకులని గుర్తించిన ఆయా ప్రభుత్వాలు వారిపై వరాల జల్లు కురిపిస్తున్నారు. మొన్నటి మొన్న తెలంగాణ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పింది కాంగ్రెస్. అధికారాన్ని చేపట్టగానే.. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించింది రేవంత్ రెడ్డి సర్కార్. అలాగే..18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ. 2500, గ్యాస్ కూడా రూ. 500లకు ఇస్తామంటూ ప్రకటించింది. వీటిని అమలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఇదే కాదూ.. కర్ణాటకలో కూడా ఇదే రకమైన పథకాలు అమల్లోకి వస్తున్నాయి. కాగా, ఇటువంటి వాటికి ఆద్యం పోసింది ఢిల్లీ ప్రభుత్వం.
ఢిల్లీలో 2019 నుండి సిటీ, మెట్రో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తుంది. కాగా, ఇప్పుడు మరో ముందడుగు వేసింది. మహిళలకు శుభవార్త చెప్పింది అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం. 18 సంవత్సరాల నిండిన మహిళలందరికీ.. నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటించింది ప్రభుత్వం. 2024-25 రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిషి.. తన తొలి బడ్జెట్ ప్రసంగంలో ఈ మేరకు ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద నెలకు వెయ్యి రూపాయలను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ప్రకటన వెలువడగా.. అరవింద్ కేజ్రీవాల్‌ను ఆప్ ఎమ్మెల్యేలు ప్రసంశిస్తూ.. నినాదాలు చేశారు.
లబ్దిదారుల కోసం 2024-25 బడ్జెట్‌లో ఈ లబ్దిదారుల కోసం రూ. 2,714 కోట్లు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నివాసితులై.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క మహిళకు ఈ ప్రయోజనం చేకూరుతుందని అతిషి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక ప్రకటనలు చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఈ బడ్జెట్‌లో విద్యా రంగానికే..16 వేల కోట్లకు పైగా కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం పదవ బడ్జెట్ ప్రవేశ పెట్టడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఇప్పటికే ఉచిత విద్యుత్, నీటి బిల్లులు, మొహల్లా క్లినిక్స్, వృద్ద మహిళల తీర్థయాత్రలకు పంపడం వంటి ఎన్నో కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు అతిషి.
అలాగే..ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో..9 లక్షల మంది బాలికలు చదువుతున్నారని, 933 మంది బాలికలు నీట్‌లో ఉత్తీర్ణత సాధించారని, 123 మంది బాలికలు జెఈఈలో పరీక్షలో ఉత్తీర్ణుతులయ్యారని ఉన్నారు. అసలైన రామరాజ్యాన్ని నెరవేర్చేంుదకు గత 9 ఏళ్లుగా అహర్నిశలు కష్టపడుతున్నామని, ఢిల్లీ ప్రజల శ్రేయస్సు కోసం పాటు పడ్డామని తెలిపారు. ఈ రామ రాజ్యంలో తమ తదుపరి అడుగు.. మహిళ భద్రత అని చెప్పారు. . గత పదేళ్ల కాలంలో మహిళలకు మెరుగైన జీవితాన్ని అందిచామన్నారు. తమ ప్రభుత్వంలో మహిళ జీవితంలో ఎంతో మార్పు వచ్చిందన్నారు ఆర్థిక మంత్రి. కాగా, ఇప్పుడు తీసుకు రాబోయే ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనకు వీరి అర్హులు కారు. ఈ పథకానికి ఆదాయపు పన్ను చెల్లింపు దారులు అర్హులు కారు, ఏదైనా పెన్షన్ స్కీములో లబ్ది పొందినా, లేదా ప్రభుత్వ ఉద్యోగి అయినా దీనికి అర్హులు కారు.