Keerthi
Aadhaar Card: దేశంలో ఆధార్ కార్డు పొంది పదేళ్లు పూర్తైన ప్రతిఒక్క పౌరులకు క్రేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ ను జారీ చేసింది. ఆధార్ అప్ డేట్ కు పెంచిన గడువు చివరి దశకు వచ్చింది. కనుక ఇంక ఆధార్ అప్ డేట్ చేయని వారు ఈ తేదీలోపు చేసుకోవాలని సూచించింది.
Aadhaar Card: దేశంలో ఆధార్ కార్డు పొంది పదేళ్లు పూర్తైన ప్రతిఒక్క పౌరులకు క్రేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ ను జారీ చేసింది. ఆధార్ అప్ డేట్ కు పెంచిన గడువు చివరి దశకు వచ్చింది. కనుక ఇంక ఆధార్ అప్ డేట్ చేయని వారు ఈ తేదీలోపు చేసుకోవాలని సూచించింది.
Keerthi
భారతదేశంలో ప్రతిఒక్క పౌరుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆధార్ ఐడెంటీటీ కార్డును జారీ చేసింది. ఇక ప్రస్తుత రోజుల్లో ఈ ఆధార కార్డు అనేది అందరికి ఒక ముఖ్యమైన పత్రంగా మారింది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పలు పథకాల ప్రయోజనాలను పొందలన్న ఈ ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా అయింది. కాగా, కేంద్ర ప్రభుత్వం ఈ ఆధార్ కార్డు జారీ ప్రక్రియను 2010లో ప్రారంభించింది. కనుక ఆధార్ కార్డు పొంది పదేళ్లు పూర్తయిన వారందరూ తప్పనిసరిగా అప్ డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.ఈ క్రమంలోనే ఆధార్ కార్డు దారులకు ఓ బిగ్ అలర్డ్ ను కూడా జారీ చేసింది. గత సంవత్సరం నుంచి ఆధార్ అప్ డేట్ చేసుకోవాలని, అలా చేయకుంటే ఆ తర్వాత నగదు జారిమానా ఉంటుందని చెప్తూ వస్తుంది.అలాగే అందుకు గడువును కూడా పెంచుకుంటూ వస్తుంది. అయితే తాజాగా ఆధార్ అప్ డేట్ చేసుకొమని పెంచిన గడువు చివరి దశకు వచ్చింది. కనుక ఇంక ఆధార్ అప్ డేట్ చేసుకోకపోయినా వారు ఈ గడువు తేదీలోపు చేసుకోవాలని సూచించింది. ఆ వివరాళ్లోకి వెళ్త
ఆధార్ కార్డు పొంది పదేళ్లు పూర్తైన ప్రతిఒక్క పౌరులు త్వరగా అప్ డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఏదుకంటే.. 2010లో జారీ చేసిన ఆధార్ కార్డుల్లో చాలా తప్పులు దొర్లాయని, కనుక ఇప్పుడు అందరూ దానిని సరి చేసుకోవాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది. అయితే గత సంవత్సరం నుంచి ఈ గడువును పొడిగిస్తూ వచ్చిన దేశ పౌరుల్లో నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అందుచేత మళ్లీ ఈ గడువును ఈనెల అనగా మార్చి 14, 2024 వరకు పొడింగించింది.ఇక ఈ ఆవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఆధార్ అప్ డేట్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. అలాగే ఈ ఆధార్ అప్ డేట్ ప్రక్రియ అనేది ఈ సేవాలో, నెట్ సెంటర్ లలో పడిగపులు కాస్తూ చేసే శ్రమ లేకుండా.. ఫ్రీగా అప్ డేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇక మరో తొమ్మిది రోజుల్లో ఆ గడువు తేదీ అనేది ముగియనున్నది. అందుకే గడువు తేదీ ముగియక ముందే ఈ ఆవకాశాన్ని వినియోగించుకొని ప్రతిఒక్కరూ ఆధార్ ను అప్ డేట్ చేసుకోవాలి. అలా చేయని యెడలా రూ. 10,000 జరిమానా తప్పనిసరిగా చెల్లించవలసి ఉంటుంది.
ఇక గడువు తేదీలోపు ఆధార్ కార్డు హోల్డర్లు ఎలాంటి రుసుములు చెల్లించకుండా మీ ఆన్ లైన్ సేవలను ఉపాయోగించి ఆధార్ కార్టు ను అప్ డేట్ చేసుకోవచ్చు. కాగా, పౌరులు ఐడీ ప్రూప్, అడ్రస్ ఫ్రూఫ్స్ ను ఆన్ లైన్ లో అప్ డేట్ కోసం https://tathya.uidai.gov.in/access/loginలో అధికారిక UIDAI వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయండి. ఆ వెబ్‌సైట్‌లో మీ ఆధార్ కార్డ్ నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి. ఆ తర్వాత ధృవీకరణ కోసం మీ మొబైల్‌లో అందుకున్న OTPని నమోదు చేయండి. అలాగే అందులో మీ పేరు, లింగం, చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలను తనిఖీ చేసి సరి చేసుకోండి. అలాగే వాటిని ధ్రువీకరించి నెక్ట్స్ స్టెప్‌కు వెళ్లాలనుకున్న వారికి డాక్యుమెంట్లు ఎలా అప్‌లోడ్ చేయాలో కూడా గైడ్‌లైన్స్ కనిపిస్తాయి. ఇక డాక్యుమెంట్ అనేది 2MB కంటే తక్కువ సైజ్ ఉండాలి.
అలాగే వీటికి JPEG, PNG, PDF ఫార్మాట్స్ సపోర్ట్ చేస్తాయి. ఆ తర్వాత వలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ప్రూఫ్‌గా మొదటి దశలో ఐడెంటిటీ ప్రూఫ్, రెండో దశలో అడ్రస్ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆయా డాక్యుమెంట్స్ ను స్కాన్ చేసి కాపీలను అప్లోడ్ చేసి సబ్మిట్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. చివరిగా 14 అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది. దీనితో అప్డేట్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి, ప్రతిఒక్కరు దీనిని గుర్తించుకొని ఆధార్ అప్ డేట్ కు గడువు ముగియక ముందే ఉచితంగా ఇప్పుడే అప్ డేట్ చేసుకోండి. లేదంటే గడువు ముగిసిన తర్వాత నగదు చెల్లించాల్సి వస్తుంది.