iDreamPost
android-app
ios-app

వీడియో: బ్రిడ్జ్ పై నుంచి దూకబోయిన మహిళ.. హీరోలా కాపాడిన క్యాబ్ డ్రైవర్!

Atal Setu: నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఆత్మహత్య ఘటనలు అనేవి చోటుచేసుకుంటాయి. కొన్ని సందర్భాల్లో సమీపంలో ఉండే ఎవరైనా గమనించి.. సూసైడ్ చేసుకునే వారిని రక్షిస్తుంటారు. తాజాగా ఓ మహిళ విషయంలో కూడా ఓ క్యాబ్ డ్రైవర్ హీరోలా మారి కాపాడాడు.

Atal Setu: నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఆత్మహత్య ఘటనలు అనేవి చోటుచేసుకుంటాయి. కొన్ని సందర్భాల్లో సమీపంలో ఉండే ఎవరైనా గమనించి.. సూసైడ్ చేసుకునే వారిని రక్షిస్తుంటారు. తాజాగా ఓ మహిళ విషయంలో కూడా ఓ క్యాబ్ డ్రైవర్ హీరోలా మారి కాపాడాడు.

వీడియో: బ్రిడ్జ్ పై నుంచి దూకబోయిన మహిళ.. హీరోలా కాపాడిన క్యాబ్ డ్రైవర్!

నిత్యం ఎంతో మంది వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటారు. ప్రతి సమస్యకు చావే పరిష్కారంగా భావించి..ఇలాంటి దారుణ నిర్ణయాలు తీసుకుంటారు. మరికొన్ని సందర్భాల్లో ఇలా ఆత్మహత్యాయత్నం చేసుకునే వారిని కొందరు గమనించి కాపాడుతుంటారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ఓ మహిళ  ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే స్థానికులు అప్రమత్తమై..ఆమెను కాపాడారు. తాజాగా మరో మహిళ బ్రిడ్జ్ పై నుంచి దూకబోయింది. అదే సమయంలో హీరోలా వచ్చిన క్యాబ్ డ్రైవర్ ఆమెను రక్షించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో చోటుచేసుకుంది. నిత్యం రద్దీగా ఉండే ముంబైలోని అటల్ సేతుపై శుక్రవారం ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. అదే సమయంలో అటుగా అక్కడే ఉన్న క్యాబ్‌ డ్రైవర్ ఒకరు హీరోలా స్పంచాడు. అతడితో పాటు వెంటనే పోలీసులు కూడా రావడంతో ఆమె ప్రాణాలు దక్కాయి. దీనికి సంబంధించిన వీడియోను ముంబయి పోలీసులు ఎక్స్‌ వేదికగా షేర్ చేశారు. అంతేకాక ఆత్మహత్యకు యత్నించిన మహిళా ఎవరు అనే విషయాన్ని పోలీసులు కనిపెట్టారు. ఆ మహిళ ముంబై లోని ములుంద్‌ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల రీమా ముకేశ్‌గా గుర్తించారు.

ఇక పోలీసులు షేర్ చేసిన వీడియోను చూసినట్లు అయితే సదరు మహిళా అటల్‌ సేతుకు చెందిన భద్రత కోసం ఏర్పాట చేసిన బారియర్ పై కూర్చొని ఉంది. తొలుత ఆ మహిళ..తన వద్ద ఉన్న వస్తువులను సముద్రంలో విసిరేసింది.  అనంతరం ఆమె కూడా బ్రిడ్జ్ పై నుంచి సముద్రంలోకి దూకబోయింది. ఇక సినిమాల్లో హీరోలు సడెన్ గా ఎంట్రీ ఇచ్చి…కాపాడినట్లు అక్కడ ఓ సీన్ ఆవిష్కృతమైంది. ఆ మహిళ సూసైడ్ కి యత్నించిన విషాయాన్ని అక్కడే సమీపంలో ఉన్న క్యాబ్ డ్రైవర్ ఒకరు పసిగట్టారు. వెంటనే క్షణం కూడా ఆలస్యం  చేయకుండా ఆమె వద్దకు చేరుకుని జుట్టు, చేతుల్ని గట్టిగా పట్టుకున్నారు. చేతులు లాగుతున్న..తాను కూడా సముద్రం వైపు వరుగుతున్నా..ఆ మహిళను మాత్రం వదల్లేదు. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆ మహిళను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇదే సమయంలో దగ్గర్లోనే పెట్రోలింగ్ చేస్తోన్న పోలీసులు ఈ ఘటనను గమనించి తక్షణమే అక్కడికి చేరుకున్నారు. ఇక క్యాబ్ డ్రైవర్, పోలీసులు కలిసి.. ఆ మహిళ ప్రాణాలను రక్షించారు. మొత్తం క్యాబ్ డ్రైవర్ చాకచక్యం, పోలీసుల తక్షణ స్పందనతో ఆమె ప్రాణాలు నిలిచాయి. ఈ వీడియోను ముంబయి పోలీసులు షేర్ చేశారు. ఎంతో విలువైన జీవితానికి ఇలాంటి చర్యలతో ముగింపు పలకొద్దని అభ్యర్థించారు. గత నెల కూడా ఇదేతరహా ఘటన జరిగింది. అటల్ సేతు బ్రిడ్జి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొంతకాలంగా ఏదో ఒక అంశంతో ఈ బ్రిడ్జ్ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఈ మహిళ ఆత్మహత్యయత్నంతో మరోసారి అటల్ సేతు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.